ఆట కాదు సుమా! | Ram Charan and Buchi Babu RC16 Movie Updates | Sakshi
Sakshi News home page

ఆట కాదు సుమా!

Published Fri, Jun 21 2024 3:18 AM | Last Updated on Fri, Jun 21 2024 3:29 AM

Ram Charan and Buchi Babu RC16 Movie Updates

క్రీడాకారుడి పాత్ర చేయడం అంటే ఆట కాదు సుమా అనాలి. ఎందుకంటే ఆ క్రీడ మీద ఎంతో కొంత అవగాహన సంపాదించాలి. అలాగే ఆ క్రీడకు తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకోవాలి. రామ్‌చరణ్‌ త్వరలో ఈ పని మీదే బిజీ కానున్నారు. బుచ్చిబాబు సన (ఆర్‌సీ 16) దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్‌ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనున్నారని... కాదు రన్నర్‌గా కనిపిస్తారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

ఏది ఏమైనా క్రీడాకారుడి పాత్రలో కనిపించడం ఖాయం. ఇందుకోసం రామ్‌చరణ్‌ కండలు పెంచాలనుకుంటున్నారట. ఈ మేకోవర్‌ కోసం ఆస్ట్రేలియా వెళతారని సమాచారం. అక్కడ దాదాపు రెండు నెలలు శిక్షణ తీసుకుంటారని భోగట్టా. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ‘గేమ్‌ చేంజర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసి, ఆస్ట్రేలియా ప్రయాణమవుతారని తెలిసింది. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిన ‘ఆర్‌సీ 16’ షూటింగ్‌ని సెప్టెంబర్‌ లేదా అక్టోబరులో ఆరంభించేలా యూనిట్‌ ప్లాన్‌ చేస్తోందని టాక్‌. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement