AR Rahman as Music Director for Ram Charan and Buchi Babu's Movie - Sakshi
Sakshi News home page

AR Rahman: ఏడేళ్ల తర్వాత తెలుగు సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌!

Published Mon, Apr 10 2023 8:47 AM

AR Rahman As Music Director to Ram Charan and Buchi Babu Movie - Sakshi

రామ్‌చరణ్‌ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు ఈ చిత్రం నిర్మించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణను సెప్టెంబరులో ప్రారంభించాలని యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్, జాన్వీకపూర్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి.

అలాగే ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా ఆస్కార్‌ అవార్డు విజేత ఏఆర్‌ రెహమాన్‌ పేరు తాజాగా వినిపిస్తోంది. గతంలో తెలుగులో ‘సూపర్‌ పోలీస్‌’,‘నాని’, ‘ఏమాయ చేసావె’ ‘కొమురం పులి’ ‘సాహసం శ్వాసగా సాగిపో’(2016) సినిమాలకు సంగీతం అందించారాయన. ఏడేళ్ల తర్వాత ఏఆర్‌ రెహమాన్‌ మరోసారి తెలుగు సినిమాకు సంగీతం అందించనున్నారని టాక్‌. ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.  

Advertisement
 
Advertisement
 
Advertisement