గురుశిష్యులిద్దరూ స్టార్ హీరోల సినిమాలు పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. సుకుమార్ పుష్ప 2 స్క్రిప్ట్ మీద, బుచ్చిబాబు ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ మీద కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు కలిసి చర్చిస్తున్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో పుష్ప 2 కోసం సుకుమార్ బుచ్చిబాబు సలహాలు తీసుకుంటున్నాడంటూ పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఈ రూమర్స్‌పై బుచ్చిబాబు స్పందించాడు. 'తన గురువుతో కలిసి దిగిన ఫొటో షేర్ చేస్తూ.. ఈ ఫొటో నేను తర్వాత చేయబోయే నా సినిమా కథ గురించి చర్చిస్తున్న సందర్భంలోది. మా గురువుగారు సుకుమార్ సర్ నా కోసం, నా సినిమా కథ కోసం సాయం చేయడానికి వచ్చారు. సుకుమార్ సర్ సినిమా కథలో కూర్చుని చర్చించేంత స్థాయి నాకు లేదు, రాదు. ఆయన నుంచి నేర్చుకోవడమే తప్ప ఆయనకు ఇచ్చేంత లేదు' అని క్లారిటీ ఇచ్చాడు.
ఇక పుష్ప సీక్వెల్ విషయానికి వస్తే ఈ చిత్రాన్ని ఆగస్టులో మొదలుపెట్టాలని భావించారు. కానీ నిర్మాతల మండలి ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ బంద్ అని పేర్కొనడంతో చిత్రీకరణ మరింత ఆలస్యమయ్యే అవకాశముంది.
ఈ photo నేను తరువాత చేయబోయే నాసినిమాకథ Discussion సందర్భంలోది మాగురువుగారు@aryasukku సుకుమార్ Sir నా కోసం నా సినిమా కథ కోసం Help చేయడానికి వచ్చారు. సుకుమార్ Sir సినిమా కథలో కూర్చుని Discussion చేసేంత స్థాయి నాకు లేదు రాదు.ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడమే తప్ప , ఆయనకి ఇచ్చేంత లేదు pic.twitter.com/KN7qmbLg6X
— BuchiBabuSana (@BuchiBabuSana) July 28, 2022
చదవండి: చైతూతో కలిసి ఉన్న ఇంటినే ఎక్కువ రేటుకు కొనుక్కున్న సామ్
విజయ్ పాడిన ‘లైగర్’ యాటిట్యూడ్ సాంగ్ విన్నారా? చితక్కొట్టేశాడుగా..
Comments
Please login to add a commentAdd a comment