అల్లు అర్జున్ 'పుష్ప 2' చివరి దశ పనులు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ సహా పలువురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. తాజాగా 'డాకు మహారాజ్' టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ 'పుష్ప 2' కోసం పనిచేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చిన తమన్.. తాజాగా మరో ఇంటర్వ్యూలో మూవీ గురించి ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి-రమ్య బెహరా)
'పుష్ప 2 చూసి భయపడ్డాను. ఎందుకంటే అద్భుతంగా వచ్చింది. ఈ మూవీ తర్వాత అవార్డులన్నీ బన్నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తాయి. పదిహేను రోజుల్లో సినిమా మొత్తం కంప్లీట్ చేయమన్నారు. అది సాధ్యం కాదు. అందుకే నాకున్న టైంలో ఫస్ట్ హాఫ్‌ను దాదాపుగా కంప్లీట్ చేసి ఇచ్చాను' అని తమన్ చెప్పాడు.
మ్యూజికల్ స్కూల్ కట్టాలనేది తన కోరిక అని.. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఫ్రీగా మ్యూజిక్ నేర్పించాలని అనుకుంటున్నానని తమన్ చెప్పుకొచ్చాడు. మ్యూజిక్ ఉన్న చోట క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. నేను క్రికెట్ ఆడి వస్తే వెంటనే ఓ ట్యూన్ వస్తుంది. క్రికెట్ ఆడటంలో నాకు చాలా ఆనందం ఉంటుంది. రెండు, మూడేళ్లలో వరల్డ్ క్లాస్ స్టూడియోని ఇక్కడే కడతాను. ప్రభుత్వం తరుపున ఏమైనా సాయం చేస్తారా? అని కూడా అడుగుతాను. స్థలం ఇవ్వమని మాత్రం అడగనని తమన్ తన ఆలోచనల్ని పంచుకున్నాడు.
(ఇదీ చదవండి: మోసపోయిన 'కంగువ' హీరోయిన్ దిశా పటానీ తండ్రి)
Comments
Please login to add a commentAdd a comment