
అజ్ఞాతవాసి లాంటి ఘోర పరాజయం తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు భారీ ఆఫర్ దక్కినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అజ్ఞాతవాసి సినిమా తరువాత త్రివిక్రమ్ సినిమాకు క్రేజ్ ఉండదేమోనని అంతా అనుకున్నారు. కానీ విడుదలకు ముందే యూఎస్ హక్కులను ఓ సంస్థ భారీ మొత్తంలో కొనుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనపడబోతోన్న ఈ చిత్ర యూఎస్ హక్కులు దాదాపు పన్నెండు కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూర్చుతున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు (మే 20) కానుకగా ఈ సినిమా టైటిల్, ఎన్టీఆర్ లుక్‌ను రిలీజ్ చేయనున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment