
భారత్-పాక్ మ్యాచ్: మ్యూజిక్ డైరెక్టర్ అసంతృప్తి
హైదరాబాద్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దాయాది జట్లు భారత్-పాకిస్తాన్ ల మధ్య ఆసక్తికర పోరుకు వర్షం అంతరాయం కలిగించింది. మరో బంతి పూర్తయితే 10 ఓవర్లు అవుతాయనగా వర్షం కారణంగా మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. మ్యాచ్ నిలిచేపోయే సమయానికి 9.5 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. దీనిపై సగటు అభిమానుల తరహాలోనే సెలబ్రిటీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్ లో వాతావరణ పరిస్థితులు తెలిసి కూడా ఐసీసీ నిర్వాహకులు ఇక్కడ చాంపియన్స్ ట్రోఫీని ఎలా ప్లాన్ చేశారని టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్వీట్ చేశాడు.
ఈ నెలలో ఇంగ్లండ్ లో పరిస్థితులు అనుకూలించవని ముందుగానే తెలిసినా ఎందుకు ఇలా ట్రోఫీ నిర్వహిస్తున్నారంటూ, ఓ ఫొటోను కూడా పోస్టు చేశాడు. త్వరగా వర్షం ఆగిపోయి మ్యాచ్ జరగాలని థమన్ ఆకాంక్షించాడు. ఈ ట్రోఫీలో వర్షం కారణంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ల మధ్య మ్యాచ్ రద్దయిన విషయం తెలసిందే. ప్రస్తుతం వర్షం ఆగి మ్యాచ్ జరుగుతున్నా.. మళ్లీ వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలుండటంతో క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. భారత్-పాక్ పోరు అంటే ఈ రెండు దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి ఉంటుందన్న విషయం తెలిసిందే.
How did they planned this #ChampionsTrophy17 having ⛈⛈⛈⛈ overcast climate all this month