‘అల వైకుంఠపురములో..’ చిత్రానికి సంబంధించిన రెండో పాట టీజర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. పూర్తి సాంగ్‌ను దీపావళి కానుకగా ఈ నెల 26న విడుదల చేయనున్నారు.‘రాములో..రాములా నన్ను ఆగం చేసిందిరో’అని సాగే పాటకు తమన్ సంగీతం అందించగా అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఇక ఈ పాట కూడా అభిమానులను ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకునేలా కనిపిస్తోంది.