Tuck Jagadish Update: New Lyrical Song Released From Tuck Jagadish Movie - Sakshi
Sakshi News home page

టక్‌ జగదీష్‌ ‘కోలో కోలన్నకోలో’ ఫ్యామిలీ సాంగ్‌ వచ్చేసింది

Published Sat, Mar 13 2021 11:16 AM | Last Updated on Sat, Mar 13 2021 2:02 PM

Nani Tuck Jagadish Movie: Kolo Kolanna Kolo Lyrical​ Song Released - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్‌లు హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘టక్‌ జగదీశ్‌’.. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత హీరో నాని, డైరెక్టర్‌ శివ నిర్వాణ కాంబినేషన్‌లో అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. షైన్‌ పిక్చర్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాతలు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా వచ్చిన పోస్టర్ల, ‘ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎద‌లో చేరి’ అనే మెలోడీ సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది.

తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాట విడుదల చేశారు చిత్ర బృందం. ‘కోలో కొలన్నకోలో’ అంటూ సాగే ఈ పాట కుటుంబంలోని అనుబంధాలు, ఆప్యాయతలను గుర్తు చేస్తుంది. తమన్‌ స్వరపరిచిన ఈ ఫ్యామిలీ సాంగ్‌కి సీతారామ శాస్త్రీ సాహిత్యం అందించగా,అర్మాన్‌ మాలిక్‌, హరిని ఇవటూరి ఆలపించారు. కాగా, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో పాటు రచన కూడా చేశారు శివ నిర్వాణ. నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్‌, వీకే న‌రేష్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవ‌ద‌ర్శిని, ప్రవీణ్ ముఖ్య పాత్రలు పోషించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement