'దసరా' నుంచి ఊరమాస్‌ 'ధూమ్ ధామ్ దోస్తాన్' వీడియో సాంగ్‌ వచ్చేసింది | Dhoom Dhaam Dostan Song From Dasara Movie Is Out Now | Sakshi
Sakshi News home page

Dasara Movie: 'దసరా' నుంచి ఊరమాస్‌ 'ధూమ్ ధామ్ దోస్తాన్'వీడియో సాంగ్‌ వచ్చేసింది

Published Wed, Mar 22 2023 8:17 PM | Last Updated on Wed, Mar 22 2023 8:19 PM

Dhoom Dhaam Dostan Song From Dasara Movie Is Out Now - Sakshi

నాని, కీర్తిసురేష్‌ జంటగా నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమా దసరా. శ్రీకాంత్‌ ఓదెల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 30న విడుదల కానుంది. ఇప్పటికే విడుదల ట్రైలర్‌, పాటలు సినిమాపై ఓ రేంజ్‌లో బజ్‌ను క్రియేట్‌ చేశాయి. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో ఇప్పటికే ప్రమోషన్స్‌ జోరు పెంచారు మేకర్స్‌.

ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాలోని  ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ అనే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ముంబైలో జరిగిన ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నాని, హీరోయిన్ కీర్తి సురేష్‌లతో రానా, దీక్షిత్‌ శెట్టి కూడా పాల్గొన్నారు.

‘దసరా’ సినిమాలో నాని ధరణిగా నటిస్తుండగా, కీర్తి సురేష్‌ వెన్నెలగా కనిపించనుంది. పక్కా విలేజ్‌ బ్యాక్‌గ్రాండ్‌లో మాస్‌ ఎంటర్‌టైనర్‌లా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement