Dasara: Nani's 'Chamkeela Angeelesi' Telangana Folk Song Released - Sakshi
Sakshi News home page

Nani: ‘చమ్కీల అంగీలేసి.. ఓ వదినే’.. నాని దసరా సాంగ్‌ విన్నారా?

Published Thu, Mar 9 2023 10:27 AM | Last Updated on Thu, Mar 9 2023 10:55 AM

Nani Starrer Chamkeela Angeelesi Folk Song Released - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని, కీర్తి సురేష్‌ జంటగా నటించిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓడేల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. బొగ్గు గనుల నేపథ్యంలో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌ జోరు పెంచారు మేకర్స్‌. ఇందులో భాగంగా ఇప్పటికే నాని ఓ వైపు ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్లతో సందడి చేస్తుంటే, మరోవైపు మేకర్స్‌ సినిమాలోని ఒక్కో సాంగ్‌ను రిలీజ్‌ చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి మూడో లిరికల్‌ చమ్కీల అంగీలేసి.. ఓ వదినే.. చాకు లెక్క ఉండేటోడే.. అనే సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను ధీ - రామ్ మిర్యాల ఆలపించగా, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. పక్కా జానపథ యాసలో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement