బెస్ట్‌ టీమ్‌తో కొత్త చిత్రాన్ని ప్రకటించిన 'సిద్ధు జొన్నలగడ్డ' | Siddu Jonnalagadda New Movie Telusu Kada | Sakshi
Sakshi News home page

Siddu Jonnalagadda: బెస్ట్‌ టీమ్‌తో కొత్త చిత్రాన్ని ప్రకటించిన 'సిద్ధు జొన్నలగడ్డ'

Published Mon, Oct 16 2023 2:28 PM | Last Updated on Mon, Oct 16 2023 3:09 PM

Siddu Jonnalagadda New Movie Telusu Kada - Sakshi

'గుంటూరు టాకీస్‌, కృష్ణ అండ్ హిజ్ లీలా' సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ  ‘డి.జె టిల్లు’ సినిమాతో బాగా పాపులర్‌ అయ్యాడు.  ఈ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నాడు. దీంతో డీజే టిల్లు సీక్వెల్‌ 'టిల్లు స్క్వేర్'​తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇలా ఉండగా తాజాగా ఆయన నుంచి మరొక కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.

ఈ సినిమాకు  తెలుసు కదా అనే సరికొత్త టైటిల్‌ను మేకర్స్‌ ఫిక్స్‌ చేశారు. సిద్దు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నాతో పాటు కెజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తుండగా.. యువరాజ్ కెమెరామెన్‌ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీమ్‌ చాలా  బలంగా కనిపిస్తోంది. సినిమా టైటిల్‌ వీడియో చాలా రిచ్‌గా చిత్రీకరించారు. ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లో తమన్ అందించిన మ్యూజిక్​ మనసును తాకేలా కూల్‌గా ఉంది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్​ విన్నింగ్ టెక్నిషియన్​ శ్రీకర ప్రసాద్​ ఎడిటర్​గా వ్యవహరించనుండటం విశేషం.

(ఇదీ చదవండి: శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్‌ రావిపూడి)

టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ ఫ్యామిలీ నుంచి బాద్‌షా చిత్రంతో కాస్ట్యూమ్​ డిజైనర్​గా ఇండస్ట్రీకి పరిచమైన నీరజ కోన ఈ చిత్రానికి మొదటిసారి దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నారు. టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్​గా గుర్తింపు పొందిన నీరజ దర్శకురాలిగా తొలిసారి మెగాఫోన్‌ పట్టారు. తెలుసు కదా సినిమా టీమ్‌ చూస్తే బ్లాక్‌ బస్టర్‌ గ్యారెంటీ అని చెప్పవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement