
సంగీత దర్శకుడు తమన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తన గురించి వచ్చిన ప్రతీ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే ఒక్కోసారి తమన్ చర్యలు బెడిసి కొడుతుంటాయి. గతంతో దేవీ శ్రీ ప్రసాద్‌ను దూషిస్తూ పెట్టిన ఓ ట్వీట్‌ను తమన్ లైక్ చేయడం వివాదాస్పదమైంది.
తాజాగా మరోసారి తప్పులో కాలేశాడు తమన్. నాగచైతన్య, సమంత జంటగా తెరకెక్కిన మజిలీ సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తమన్ తన సోషల్ మీడియా పేజ్‌లో చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే ఫేస్‌బుక్‌లో లీడ్ పెయిర్ అంటూ సమంత, అక్కినేని నాగార్జునల పేర్లు రాయటంపై సెటైర్లు పడుతున్నాయి.
శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ సినిమాకు తమన్ నేపథ్య సంగీతం అందించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవటంతో పాటు కమర్షియల్‌గానూ సక్సెస్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment