telugu kala samithi
-
కువైట్‌లో తమన్ 'సుస్వర తమనీయం'.. వైభవంగా వేడుక
Thaman Music Festival In Kuwait: రెండున్నర సంవత్సరాల తరువాత 'కోవిడ్' అనంతరం మొట్టమొదటి సారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రత్యక్ష సంగీత కార్యక్రమం 'సుస్వర తమనీయం'. కువైట్‌లో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జూన్ 3 సాయంత్రం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు యస్.యస్. తమన్ బృందంతోపాటు సుమారు 1500 మందికిపైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తమన్ బృందమైన గాయని గాయకులు శ్రీ కృష్ణ, సాకేత్, పృథ్వీచంద్ర, విమల రోషిని, శ్రీ సౌమ్య, శృతి రంజని, మనీష, హరిక నారాయణ్ తదితరులు తమ పాటలతో అలరించారు. దాదాపు యాభై పాటలతో అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియం దద్దరిల్లింది. సభ్యులందరు కేరింతలు,నృత్యాలు, ఆనందో త్సాహాలతో కన్నుల పండుగగా తమన్ 'సుస్వర తమనీయం' ఆద్యతం అలరించింది. చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు అనంతరం స్పాన్సర్స్.. తమన్‌ను, వారి బృందాన్ని, మిగతా సంస్థల అధ్యక్షులను, ఇండియన్ ఎంబసీ ముఖ్య అతిధి శ్రీ కమల్ సింగ్ రాథోడ్‌ను "తెలుగు కళా సమితి" కార్యవర్గం జ్ఞాపికలతో సత్కరించింది. ఈ కార్యక్రమంలో "తెలుగు కళా సమితి" స్మారక చిహ్నమైన 'సావెనీర్' వార్షిక సంచికను విడుదల చేశారు. -
టీకేఎస్ ఎన్నికలు
దాదర్, న్యూస్‌లైన్ : నవీముంబైలోని వాషీలోగల తెలుగు కళాసమితి (టీకేఎస్) ఎన్నికల్లో బి నారాయణరెడ్డి, ఎం కొండారెడ్డి ప్యానల్ భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించింది. జి బి రామలింగయ్య, జి ప్రవీణ్ ప్యానల్‌పై సుమారు 80 శాతం ఓట్ల తేడాతో గెలుపొందింది. ఈ సమితి చరిత్రలోనే ఈసారి ఎన్నికల్లో అత్యధిక ఓట్లు పోలయ్యాయి. ఇక అధ్యక్షుడిగా పోటీ చేసిన నారాయణరెడి ్డకి 727 ఓట్లురాగా, ప్రత్యర్ధి జి బి రామలింగయ్యకు కేవలం 202 ఓట్లు వచ్చాయి. మరోవైపు ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన కొండారెడ్డికి అత్యధిక ఓట్లులభించాయి. ఆయనకు ఏకంగా 735 ఓట్లు లభించగా ప్రవీణ్‌కు కేవలం 176 మాత్రమే పోలయ్యాయి. ఇలా నారాయణ రెడ్డి, కొండారెడ్డి ప్యానల్‌కు చెందిన సభ్యులంతా భారీ మెజారిటీతో గెలుపొందారు. తెలుగు కళా సమితి 20014-2016 కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ అనంతరం సాయంత్రం ఆరు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించినప్పటికీ అర్థరాత్రి వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఆదినుంచి లెక్కింపు పూర్తయ్యేదాకా నారాయణరెడ్డి, కొండారెడ్డి ప్యానల్ ఆధిక్యంలోనే కొనసాగింది. ఈ ప్యానల్ గెలుపు తథ్యమని తేలిపోయినా ఓట్ల తేడా తెలుసుకునేందుకు అర్ధరాత్రి దాకా అనేక మంది ఉత్యంఠతో ఎదురుచూశారు. దీంతో తెలుగు కళాసమితి ప్రాంగణంలో సందడి నెలకొంది. ఓట్ల లెక్కింపు పూర్తయిందని ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన ఆర్.కె.రెడ్డి, ఒ.సుబ్రమణ్యంలు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం అంతా టపాసులు కాల్చడంతోపాటు మిఠాయిలు పంచుకున్నారు. కాగా రెండేళ్ల కిందట ఎన్నికైన నారాయణ రెడ్డి, కొండారెడ్డికి చెందిన పాత కార్యవర్గకమిటీ వరుసగా రెండోసారి కూడా విజయం సాధించింది. కొత్త కమిటీలో ఒకరిద్దరు మినహా అంతా పాతవారే. అందరినీ కలుపుకుని ముందుకెళతాం ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం అధ్యక్షుడు బి నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం. కొండారెడ్డిలు మాట్లాడుతూ అందరినీ కలుపుకుని ముందుకె ళతామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. అవసరమైన అనుమతులన్నీ తీసుకుని అత్యాధునికమైన భవనాన్ని నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయం తమది కాదని, అందరిదంటూ అభివర్ణించారు. తెలుగు కళాసమితి వికాసానికి, తెలుగు ప్రజల ఐక్యతతోపాటు సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. అదేవిధంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతోపాటు భాషా వికాసానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. భవన నిర్మాణానికి అంతా సహకరించాలి తెలుగు కళా సమితికి నూతన భవనం నిర్మించేందుకు అంతా సహకరించాలని నారాయణ రెడ్డి,కొండారెడ్డి పిలుపునిచ్చారు. అందరి సహకారంతో ఈ కలను సాకారం చేస్తామన్నారు. విజేతల వివరాలివే అధ్యక్షుడు: బి నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు: జి సుబ్రమణ్యం, కె వరలక్ష్మి. ప్రధాన కార్యదర్శి: ఎం కొండారెడ్డి. సంయుక్త కార్యదర్శి: వై వి నారాయణ రెడ్డి, టి మంజుల, కోశాధికారి: మీర్జలీ షేఖ్, సంయుక్త కార్యదర్శి: ఎల్ మీనాసుబ్రమణ్యం. కార్యవర్గ సభ్యులు: జి సుబ్బా రెడ్డి, గట్టు నర్సయ్య, జి వెంకటయ్య, కె. భాస్కర్ రెడ్డి, ఎం తిరుపతిరెడ్డి, మల్లేశ్వర్ కట్టెకోల, జీ కోటి రెడ్డి, ఆర్.వి.నారాయణ రెడ్డి, వేముల దశరథ్, వి రమణారెడ్డి, డి పద్మ, టి విజయ లక్ష్మి, వహీదా షేఖ్. -
23న తెలుగు కళాసమితి ఎన్నికలు
సాక్షి, ముంబై: నవీముంబైలోని వాషీలోగల ‘తెలుగు కళా సమితి’లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ముంబైలో తెలుగు సంస్థల మాతృసంస్థగా గుర్తింపు పొందిన ‘ది బొంబాయి ఆంధ్రమహాసభ’ తర్వాత అతిపెద్ద సంస్థగా తెలుగు కళా సమితి అవతరించింది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఈ ఎన్నికలపైనే కేంద్రీకృతమైంది. నవీముంబైలో ఉన్నప్పటికీ ఈ సంస్థ సభ్యులు ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్నారు. దీంతో ఆదివారం జరగనున్న ఎన్నిక ల్లో ఎవరు గెలుపొందనున్నారనే విషయమై ఉత్కంఠ కనిపిస్తోంది. ముఖాముఖి పోటీ...: తెలుగు కళా సమితి ఎన్నికల్లో రెండు ప్యానళ్ల మధ్య పోటీ జరుగుతోంది. బి. నారాయణ రెడ్డి, ఎం కొండారెడ్డి ప్యానల్, జి బి రామలింగయ్య, జి ప్రవీణ్ ప్యానల్లు ఈ ఎన్నికల బరిలో ఉన్నాయి. ఈ ప్యానళ్ల మధ్య పోటీ జరుగుతోంది. అయితే ఎవరిని విజయం వరించనుందనేది వేచిచూడాల్సిందే. అయితే ఎన్నికల నేపథ్యంలో తెలుగు కళాసమితికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. 1977లో ఆవిర్భావం తెలుగు ప్రజల సమైక్యత, సంక్షేమంతోపాటు సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకుగా 1977లో తెలుగు కళా సమితిని స్ధాపించారు. కొందరు తెలుగు పెద్దలు కలసి తమకంటూ ఒక సంస్థ ఉండాలని, ముంబైలాంటి ప్రాంతంలో తమ భాషను, సాహిత్యాన్ని, కళాసంస్కృతులను పరిర క్షించుకోవాలనే లక్ష్యంతో స్ధాపించిన ఈ సంస్థ స్వల్పకాలంలోనే అందరి మనన్నలు అందుకుంది. దీంతో తమకంటూ ఓ భవనం ఉండాలని తెలుగు పెద్దలు భావించారు. సిడ్కో సంస్థసహకారంతో 1,000 చదరపు అడుగుల స్థలాన్ని నవీముంబై వాషీలోని ప్రధాన ప్రాంతంలో సంపాదించగలిగారు. తెలుగువారంతా సమావేశమయ్యేందుకు అక్కడ చిన్న భవనాన్ని నిర్మించుకున్నారు. కొంత కాలంగా నవీముంబైతోపాటు వాషీ ప్రాంతం అత్యంతవేగంగా అభివృద్ధి చెందింది. అదే విధంగా తెలుగు కళా సమితి నిర్వహించిన అనేక కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇలా తెలుగువారి అభివృద్ధితోపాటు తమకంటూ ఓ గుర్తింపును తీసుకవచ్చేందుకు కృషి చేస్తున్న తెలుగు కళా సమితిలో సభ్యులుగా చేరేందుకు అనేక మంది ముందుకు రావడం ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ తెలుగు కళా సమితిలో 2100 మంది సభ్యులున్నారు. అయితే ఇప్పటికీ పాత కట్టడమే ఉండడంతో సభ్యులు సమావేశాలకు, ఇతర అవసరాలకు సరిపడకుండాపోయింది. దీంతో నూతన భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ప్రధాన అంశంగా మారిన నూతన భవన నిర్మాణం...! తెలుగు కళా సమితి ఎన్నికల్లో ఈ సారి నూతన భవన నిర్మాణం అంశం ప్రధాన అంశంగా మారింది. ప్రస్తుత కార్యవర్గం అవసరాలకు పాత నిర్మాణం సరిపోకపోవడంతో ఆ స్థానంలో నూతన భవన నిర్మాణాం చేపట్టాలని 2012లో నిర్ణయించారు. ఈ నిర్మాణానికి రూ. 2.5 కోట్ల మేర ఖర్చు అవుతుందని, అదే విధంగా కమెన్స్మెంట్ సర్టిఫికెట్ కోసం కూడా సుమారు రూ. 15 లక్షల ఫీజు చెల్లించాల్సిరానుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవన నమూనాను తయారు చేసిన అనంతరం నిర్మాణానికి కావల్సిన నిధులను సమకూర్చుకునే విషయంలో సర్వసభ్య సమావేశంలో భిన్నభిప్రాయాలు ఏర్పడ్డాయి. అయితే అదే సర్వసభ్య సమావేశంలో నూతన భవన నిర్మాణంపై ఏకాభిప్రాయం ఏర్పడింది. దీంతో అత్యాధునిక హంగులతో అందరికి అందుబాటులో ఉండేవిధంగారెండంతస్తుల భవనాన్ని నిర్మించాలని పాత కార్యవర్గ కమిటీ సంకల్పించింది. అయితే ఇది ప్రత్యక్షంగా అమల్లోకి తెచ్చేందుకు కొద్దిపాటి మార్పులతో అన్ని అనుమతులకోసం దరఖాస్తులు కూడా చేసింది. దాదాపు అన్ని అనుమతులు లభించినప్పటికీ కాని కొన్ని సాంకేతిక కారణాల వల్ల అనుమతులు లభించడంలో జాప్యమైంది. అయినప్పటికీ భవననిర్మాణం విషయంపై ధృఢసంకల్పంతో ఉన్నట్టు ప్రస్తుత కార్యవర్గం చెబుతోంది. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఇదే అంశం ప్రధాన అంశంగా మారింది.