కువైట్‌లో భారత ప్రయాణికులు ఇక్కట్లు.. 13 గంటలుగా ఆహారం లేక.. | Indian Passengers Stuck At Kuwait Airport | Sakshi
Sakshi News home page

కువైట్‌లో భారత ప్రయాణికులు ఇక్కట్లు.. 13 గంటలుగా ఆహారం లేక..

Dec 1 2024 9:26 PM | Updated on Dec 2 2024 11:02 AM

 Indian Passengers Stuck At Kuwait Airport

కువైట్‌: భారత ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ముంబై నుంచి మాంచెస్టర్‌కు వెళ్లే భారత ప్రయాణికులు కువైట్ విమానాశ్రయంలో చిక్కుకుపో​యారు. ఈ క్రమంలో దాదాపు 13 గంటలపాటు వారంతా ఎయిర్‌పోర్టులోనే ఉన్నారు. ప్రయాణికులకు ఆహారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముంబై నుండి మాంచెస్టర్‌కు వెళ్లున్న విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో ఫ్లైట్‌ అ‍త్యవసరంగా కువైట్‌లో ల్యాండ్‌ అయింది. దీంతో, ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయియి. తమ విమానం కువైట్‌లో దిగే ముందు యూటర్న్ తీసుకున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ప్రయాణికులంతా దాదాపు 13 గంటలుగా విమానాశ్రయంలోనే ఉన్నారు. వారికి ఆహారం, సాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. గల్ఫ్ ఎయిర్‌లోని ప్రయాణికులు ఎయిర్ పోర్టు అధికారులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ప్రయాణికులును వేధించారని, యూరోపియన్ యూనియన్, యూకే, యూఎస్ నుంచి వచ్చిన ప్రయాణికులకు మాత్రమే ఎయిర​్‌పోర్టు సిబ్బంది వసతి కల్పించారని ఆరోపించారు. భారత్‌, పాకిస్తాన్‌, ఇతర ఆగ్నేయాసియా దేశ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న వారిపై పక్షపాతం చూపిస్తున్నారని, ఎలాంటి వసతులు ఇవ్వలేదని మండిపడుతున్నారు.

ఈ సందర్బంగా ప్రయాణికుడు మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టులోనే 13 గంటలకు పైగా సమయం గడిచింది. దాదాపు 60 మంది ప్రయాణికులు ఇక్కడే ఉన్నారు. ఉదయం నుండి ప్రతి మూడు గంటలకు మేము ఇంటికి వెళతామని వారు మాకు చెబుతున్నారు. కానీ, ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసం మాకు కూర్చోవడానికి స్థలం ఇవ్వమని మేము వారిని చాలా సార్లు అడిగాము. అందరూ నేలపై కూర్చున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement