Vishnu Vishal FIR Movie Banned In Malaysia, Kuwait And Qatar - Sakshi
Sakshi News home page

Vishnu Vishal : FIR మూవీ బ్యాన్‌.. ఫ్యాన్స్‌కి హీరో క్షమాపణలు

Published Fri, Feb 11 2022 11:34 AM | Last Updated on Fri, Feb 11 2022 12:02 PM

Vishnu Vishal FIR Movie Banned In Malaysia, Kuwait And Qatar - Sakshi

Vishnu Vishal FIR Movie Banned: కోలీవుడ్‌ హీరో విష్ణు విశాల్‌కి షాక్‌ తగిలింది. తాజాగా ఆయన నటించిన చిత్రం FIR(ఎఫ్‌ఐఆర్‌ )నేడు(ఫిబ్రవరి11)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్‌ రెస్పాన్స్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమాకు మూడు దేశాలు షాకిచ్చాయి. కువైట్‌, మలేషియా, ఖతార్‌లతో ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా విష్ణు విశాల్‌ వెల్లడించాడు. సినిమాలోని ప్రధాన కంటెంట్‌ కారణంగా అక్కడ సెన్సార్‌ని క్లియర్‌ చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

దీంతో మలేషియా, కువైట్‌, ఖతార్‌ ఫ్యాన్స్‌కు హీరో విష్ణు విశాల్‌ క్షమాపణలు చెప్పాడు. కాగా ఈ సినిమాలో విష్ణు ముస్లిం యువకుడిగా నటించగా, గౌతమ్‌ మీనన్‌ పోలీసు అధికారిగా నటించాడు. మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్, గౌరవ్ నారాయణన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement