సాక్షి, న్యూఢిల్లీ : కువైట్‌లోని భారతీయులకు అక్కడి ప్రభుత్వం శుభవార్తను అందించింది. లాక్‌డౌన్ కారణంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి పంపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచింది. భారత ప్రభుత్వం ఆమోదం కోసం కువైట్ ప్రభుత్వం ఎదురుచూస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపగానే భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేయనుంది.( చదవండి : హెచ్ -1బీ వీసాదారులకు భారీ ఊరట)
మరోవైపు గల్ఫ్‌లోని భారతీయులను తీసుకొచ్చేందుకు భారత్ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే దీనికోసం రక్షణ శాఖకు చెందిన విమానాలను సిద్ధం చేసింది. ఏ క్షణంలోనైనా కువైట్ సహా గల్ఫ్ దేశాలకు విమానాలు వెళ్లనున్నాయి. కోవిడ్-19 వ్యాపించకుండా సకల జాగ్రత్తలు పాటిస్తూ, వీరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒకేసారి ఎక్కువ మందిని తీసుకొచ్చేందుకు వీలుగా యుద్ధ నౌకలను రంగంలోకి దించింది.
Comments
Please login to add a commentAdd a comment