
కువైట్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని కువైట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో సాల్మియా ప్రాంతంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెచ్చిన భారీ కేక్‌ను కట్ చేసి వైఎస్ జగన్‌కు తమ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుమారు 25 మంది రక్తదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్సీ తెలుగు సొసైటీ(ఏపీఎన్‌ఆర్‌టీఎస్) సహకారంతో వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన షేక్ గౌసియా అనే మహిళకు రూ.33 వేల రూపాయల విలువ గల ఓపెన్ టికెట్ అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్. ముమ్మడి బాల్‌రెడ్డి, ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి, వైఎస్సార్ కువైట్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.




Comments
Please login to add a commentAdd a comment