Gulf NRI
-
సౌదీలో నరకం అనుభవిస్తున్నా.. కాపాడండి
ఆగిరిపల్లి: ఎన్నో ఆశలతో సౌదీ వెళ్లిన తాను తినటానికి తిండి లేక నరకయాతన అనుభవిస్తున్నానని, కాపాడాలంటూ ఆగిరిపల్లికి చెందిన షేక్ జుబేర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆగిరిపల్లికి చెందిన సలీమునిస్సా కుమారుడు జుబేర్ మూడు నెలల క్రితం బతుకు దెరువు కోసం సౌదీ అరేబియాలోని రియాదు నగరంలో ఒక వ్యక్తి దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నానని మూడు నెలల నుంచి యజమాని జీతం ఇవ్వడం లేదని, జీతం అడిగితే దౌర్జన్యంగా పాస్‌పోర్ట్ లాక్కుని గదిలో బంధించి రక్తం వచ్చేలా కొట్టాడని, యజమానికి తెలియకుండా పారిపోయి తప్పించుకున్నానని, తిండి, నీరు లేక అల్లాడిపోతున్నానని చాలా భయంగా ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి తనను స్వదేశానికి తీసుకురావాలని వీడియోలో కోరాడు. -
గల్ఫ్‌లో భారీ ‘క్రెడిట్’ స్కాం.. విషయం తెలిస్తే షాక్!
నిజామాబాద్: గల్ఫ్ ఏజెంట్లు నయా స్కాంకు తెరలేపారు. గతంలో కొందరు నకిలీ వీసాలు ఇచ్చి మోసం చేసేవారు. మరికొందరు విజిట్ వీసాపై పంపించి.. పనిచూపించకుండా.. వర్క్ పర్మిట్ ఇప్పించకుండా మోసం చేసేవారు. తాజాగా కొత్తరకం మోసానికి పాల్పడుతున్నారు. వీసాలు ఇప్పించి దుబా య్కు పిలిపించుకుని కొన్ని రోజుల పాటు తమ వద్ద ఉంచుకొని.. వీరి పేర్ల మీద క్రెడిట్ కార్డుల ద్వారా లోన్లు తీసుకొని వారిని తిరిగి ఇంటికి పంపించేస్తున్నారు. దుబాయ్‌కు చెందిన క్రెడిట్ కార్డుకు సంబంధించిన బ్యాంక్ సిబ్బంది ఈఏంఐలు చెల్లించాలని బెదిరింపులకు దిగడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. దీంతో తాము తీసుకోని రుణాలకు ఈఎంఐ లు ఎలా చెల్లిస్తామని బాధితులు మంగళవారం పోలీస్‌కమిషనర్ కల్మేశ్వర్‌ను ఆశ్రయించారు. స్పందించిన సీపీ వెంటనే విచారణ చేపట్టాలని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్‌రాజును ఆదేశించారు. అసలేం జరిగిందంటే.. దుబాయ్‌లో ఉద్యోగం కల్పిస్తామని ప్రతినెలా రూ. 40వేల నుంచి రూ. 50వేల వేతనంతో పాటు రూ. 50 లక్షల క్రెడిట్ కార్డు సౌకర్యం ఉంటుందని జిల్లా కేంద్రంలోని భవానీనగర్‌కు చెందిన ఏజెంట్ పబ్బ భూమేశ్ అలియాస్ దండిగాళ్ల భూమేశ్ అలియాస్ భూమారెడ్డి సబ్ ఏజెంట్లను నమ్మబలికాడు. దీంతో డొంకేశ్వర్ మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన భోజారాం మరో ఇద్దరు సబ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని నిజామాబాద్, నిర్మల్, జగిత్యాలకు చెందిన 82 మంది వద్ద ఒక్కొక్కరి నుంచి రూ. 6లక్షల చొప్పున వీసాకు వసూలు చేశారు. వీరి నుంచి వసూలు చేసిన సుమారు రూ. 5కోట్లను దఫాల వారీగా పబ్బ భూమేశ్ సూచించిన వారికి చెల్లించారు. డొంకేశ్వర్ మండలం అన్నారంనకు చెందిన భోజారం నిజామాబాద్‌లోని శ్రీదేవి ట్రావెల్స్‌కు చెందిన బెజ్జం సుబ్బారెడ్డికి రూ. 2కోట్లను చెల్లించాడు. వెంటనే డబ్బులు చెల్లించినట్లు భోజారాం పబ్బ భూమేశ్‌కు వాట్సాప్‌లో వాయిస్ మేసేజ్ చేశారు. తర్వాత ఆర్మూర్‌కు చెందిన అరెపల్లి మోహన్, ఆరెపల్లి నరేశ్, మోచ(బాడ్సి) రాజులకు రూ. 3కోట్లు భోజారం చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం వీరికి దుబాయ్ విజిట్ వీసాలను దశల వారీగా ఇప్పించారు. అక్కడికి వచ్చిన తర్వాత వర్క్ వీసా ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో వీసాలు వచ్చిన బాధితులు గ్రూపులుగా దుబాయ్‌కి వెళ్లారు. వీరిని పబ్బ భూమేశ్ ఏర్పాటు చేసిన రూంలో ఉంచారు.. 82 మందిలో 30 మందికి మాత్రమే వర్క్ పర్మిట్ ఇప్పించి.. క్రెడిట్ కార్డులు ఇప్పించాడు. బాధితుల క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు విత్‌డ్రా.. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన 82 మందిలో 30 మందికి వర్క్ వీసాలు రావడంతో పబ్బ భూమేశ్ అక్కడి క్రెడిట్ కార్డు బ్యాంక్ సిబ్బందితో అరబ్బీ, ఇంగ్లిష్‌లలో ఉన్న ఫారాలపై సంతకాలు చేయించాడు. తన అడ్రస్పైనే క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. అవి రాగానే వాటి నుంచి మరో రూ. 5 కోట్లు డ్రా చేసినట్లు బాధితులు సీపీకి విన్నవించారు. క్రెడిట్ కార్డులకు సంబంధించిన డబ్బులు చెల్లించకపోవడం వల్ల డిఫాల్ట్ కావడంతో పబ్బ భూమేశ్ 30 మందిని ఇండియా వెళ్లిపోవాలని.. వీసా సమస్య తలెత్తిందని.. లేదంటే జైలుకు వెళ్తారని భయభాంత్రులకు గురిచేశారు. దీంతో బాధితులు భోజారాంనకు ఫోన్ చేసి తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. దీంతో త్వరగా ఇండియాకు వెళ్తే.. ఒక్కొక్కరికి రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు తిరిగి ఇచ్చేస్తానని పబ్బ భూమేశ్ బాధితులకు చెప్పి పంపించేశాడు. ఇక్కడకు వచ్చిన తర్వాత డబ్బులు చెల్లించకుండా మోసం చేశాడు. అంతేకాకుండా దుబాయ్‌లోని క్రెడిట్ కార్డుకు సంబంధించిన బ్యాంకు సిబ్బంది బాధితులకు ఫోన్ చేసి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారు సీపీని ఆశ్రయించారు. వైద్యానికి డబ్బులు లేక.. రూ. 6 లక్షలు చెల్లించిన ఓ గల్ఫ్ బాధితుడి కొడుకు అనారోగ్యంతో మృతి చెందాడు. డబ్బులు లేకపోవడంతో చికిత్స చేయించలేక కొడుకును కాపాడుకోలేకపోయాడు. అలాగే మరో బాధితుడు అప్పులు ఇచ్చిన వారు వేధించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని సబ్ ఏజెంట్ భోజారం తెలిపారు. బాధితులు చెల్లించిన రూ. 5కోట్లు వారికి అందేలా చూడాలని సీపీ కల్మేశ్వర్‌ను కోరినట్లు భోజారం చెప్పారు. నాలుగు నెలల క్రితం ఆర్మూర్ పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. విచారణ చేపడుతున్నాం సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు గల్ఫ్‌లో జరిగిన మోసంపై విచారణ చేపట్టాం. సబ్ ఏజెంట్ భోజారం డబ్బులు ఎవరికి ఇచ్చారనే దానిపై విచారిస్తాం. బెజ్జం సుబ్బారెడ్డి, ఆరెపల్లి మహేశ్, ఆరెపల్లి నరేశ్, మోచ(బాడ్సి) రాజులకు డబ్బులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్ని అంశాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. లైసెన్స్ లేని ఏజెంట్లకు డబ్బులు చెల్లించి మోసపోవద్దు. – రాజశేఖరరాజు, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ, నిజామాబాద్ ఇవి చదవండి: బీచ్‌లో మెడికో మృతదేహం -
వలస.. ఏదీ భరోసా?
మంచిర్యాల: 'ఉన్న ఊరిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతుండడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు వలసబాట పడుతున్నారు. ఉపాధి అవకాశంతో పాటు అధిక వేతనాలు, మరింత మెరుగైన జీవనం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం.. పల్లెల నుండి పట్టణాలకు, ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వెళ్లడాన్ని అంతర్గత వలసలు అంటారు. ఒకదేశం నుండి మరో దేశానికి వెళ్లడాన్ని అంతర్జాతీయ వలసలు అంటారు.' నేడు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వలసదారులు ఉజ్వల భవిష్యత్, తగిన గుర్తింపు కోసం తమ మాతృభూమిని వదిలి వేరొక దేశానికి వెళ్తుంటారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 80 వేలకు పైగా కార్మికులు వివిధ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లినట్లు గల్ఫ్ సంక్షేమ సంఘాలు పేర్కొంటున్నాయి. వీరే కాకుండా గల్ఫ్ దేశాల నుంచి తిరిగొచ్చిన జిల్లావాసులు దాదాపు 2 లక్షల వరకు ఉంటారని ప్రవాసీమిత్ర కార్మిక సంఘాల నాయకులు పేరొంటున్నారు. జిల్లా నుంచి గల్ఫ్‌కు వెళ్తున్న వ్యక్తులకు సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో ఎక్కువ మంది కూలీలు గానే పనులు చేస్తున్నారు. తిరిగొచ్చిన తర్వాత కూడా సరైన ప్రత్యామ్నాయ, ఉపాధి మార్గాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన గాండ్ల రమణ ఉపాధి నిమిత్తం దాదాపు 12 ఏళ్లక్రితం ఒమన్ దేశానికి వెళ్లి కొన్ని నెలలక్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇక్కడ స్వయం ఉపాధి పొందేందుకు బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా తనకు ఏదైనా రుణం మంజూరు చేయించాలని కొన్నిరోజులక్రితం కలెక్టరేట్, డీఆర్డీవో, తదితర కార్యాలయాల్లో విన్నవించుకున్నాడు. రుణం మంజూరు కోసం కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినా ఇప్పటికీ ఎలాంటి సాయం అందలేదని గాండ్ల రమణ పేర్కొంటున్నాడు. గల్ఫ్ నుండి వాసస్ వచ్చిన ఇలాంటి వారు ఎందరో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి.. అమాయకులైన వలస కార్మికుల రక్షణకు ఆరు అరబ్ గల్ఫ్ దేశాలతో సహా 18 దేశాలను ఈసీఆర్ దేశాలుగా వర్గీకరించిన 1983 లోని ఎమిగ్రేషన్ చట్టం యొక్క ప్రాతిపదిక ప్రకారం గల్ఫ్ బోర్డు ఏర్పా టు చేయాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించాలి. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత (సోషల్ సెక్యూరిటీ) పథకం ప్రవేశ పెట్టాలి. గల్ఫ్‌కు వెళ్లిన సన్నకారు, చిన్నకారు రైతులకు రైతుబంధు, రైతు బీమా పథకం వర్తింపజేయాలి. కేంద్ర ప్రభుత్వం పరిధిలోనివి.. హైదరాబాద్‌లో సౌదీ, యూఏఈ, కువైట్ దేశాల కాన్సులేట్లు (రాయబార కార్యాలయాలు) ఏర్పాటయ్యేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ప్రవాస భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో సహజ మరణం కూడా చేర్చా లి. రూ.325 చెల్లిస్తే రెండు సంవత్సరాల కాలపరిమితితో ఇన్సూరెన్స్ ఇస్తారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఎమిగ్రేషన్ యాక్టు–1983 ప్రకారం గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్ళడానికి సర్వీస్ చార్జీగా అభ్యర్థి 45 రోజుల వేతనం (రూ.30 వేలకు మించకుండా) మాత్రమే ఏజెంటుకు చెల్లించాలి. దీనిపై 18 శాతం జీఎస్టీ రూ.5,400 చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి. ఇదీ నేపథ్యం.. వలస వెళ్తున్న పౌరులకోసం ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 18ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం (ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే)గా ప్రకటించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధుల సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ) 31 ఏళ్ల క్రితం 18 డిసెంబర్ 1990 సంవత్సరంలో జరిగిన సమావేశంలో ‘వలస కార్మికులు, కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ’ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఎంత స్వేచ్ఛా స్వతంత్రంగా విదేశాలకు వెళ్తున్నారో అంతే స్వేచ్ఛగా తిరిగిరావొచ్చని సభ తీర్మానం చేసింది. ప్రధాన డిమాండ్లు! తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ప్రవేశపెట్టాలని, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలాకాలంగా అమలుకు నోచుకోవడంలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో 6 వేలకు పై గా తెలంగాణ ప్రవాసీయులు గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో మృతి చెందగా రూ.5 లక్షల ఎ క్స్ గ్రేషియా కోసం కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని, రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్‌తో గల్ఫ్‌కార్మికుల సంక్షేమానికి, పునరావాసానికి కృషి చే యాలని ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్, గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ముంబయిలో ఏర్పాటు చేసిన మాదిరి హైదరాబాద్‌లో ‘విదేశ్‌భవన్’ ఏర్పాటు చేయాలని, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లో పాస్‌పోర్టు ఆఫీసు, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ ఆఫీసు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) రీజినల్ ఆఫీసు, విదేశాంగ శాఖ బ్రాంచి సెక్రెటేరియట్లు ఉండాలని, ‘ప్రవాసీ తెలంగాణ దివస్’ అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నారు. వలసదారుల సంక్షేమానికి కృషి చేయాలి.. వలస కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. కేరళ తరహా ప్రత్యేక గల్ఫ్‌బోర్డు ఏర్పాటు చేయాలి. వార్షిక బడ్జెట్లో రూ.500 కోట్ల నిధులు కేటాయించాలి. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. గల్ఫ్‌లో రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలి. తిరిగి వచ్చిన కార్మికులకు ఉపాధికోసం ఆయా వ్యక్తుల నైపుణ్యాలను బట్టి ప్రభుత్వాలు తగిన చేయూతనివ్వాలి. – కృష్ణ, గల్ఫ్ జేఏసీ రాష్ట్ర నాయకుడు ఇవి చదవండి: ఆ పథకాలకు బ్రేక్? దరఖాస్తు వారిలో ఆందోళన.. -
గన్ పార్క్ వద్ద గల్ఫ్ కార్మికుని మృతదేహానికి నివాళి
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన జనగామ నర్సయ్య ఇటీవల బహ్రెయిన్‌లో మరణించారు. శనివారం బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మృతదేహాన్ని గల్ఫ్ జేఏసీ నాయకులు, మృతుని కుటుంబ సభ్యులు కలిసి హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం, గన్ పార్క్ వద్ద ఉంచి నివాళులు అర్పించారు. గల్ఫ్ అమరులకు నివాళులు అర్పిస్తూ అరుణోదయ సాంస్కృతిక బృందం పాటలు పాడారు. గల్ఫ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గుగ్గిల్ల రవిగౌడ్, తెలంగాణ బీజేపీ గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు, తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుల మురళీధర్ రెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన గల్ఫ్ జేఏసీ నాయకులు రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్‌తో గల్ఫ్ బోర్డుతో కూడిన సమగ్ర ప్రవాసీ విధానం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఎనిమిది ఏళ్లలో 1,600 మంది తెలంగాణ కార్మికులు గల్ఫ్ దేశాలలో మృతి చెందారని, కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి గల్ఫ్ మృతుని కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు -
‘గల్ఫ్ కార్మికుల చెమట చుక్కల ద్వారా సంపాదించిన సొమ్మే అధికం’
ఎర్రటి ఎండలో.. తమ రక్తాన్ని మరిగించి చెమటను చిందిస్తున్న గల్ఫ్ కార్మికులు ఒక్కొక్క చెమట చుక్క ఒక్క రూపాయి లాగా సంపాదించి పంపిన విదేశీ మారక ద్రవ్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పవృక్షం, కామధేనువు లాగా లాభం చేకూరుస్తుంది. అయితే కార్మికులు మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలకు నోచుకోకుండా వారి బతుకులు ఎండమావులు అవుతున్నాయని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డిలోని వోక్సెన్ యూనివర్సిటీ గురువారం తెలంగాణ గల్ఫ్ వలసలపై జాతీయ వర్చువల్ సింపోజియం (ఆన్ లైన్ చర్చ) నిర్వహించింది. పబ్లిక్ పాలసీ రీసెర్చ్, స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగం ఈ చర్చను నిర్వహించింది. ఈ చర్చలో ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి మాట్లాడారు. గత సంవత్సరం (2021-22) లో ప్రవాస భారతీయులు నుంచి 89 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) భారతదేశం పొందింది. ఇది దేశ జిడిపి (స్థూల దేశీయ ఉత్పత్తి) లో 3 శాతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైల జనాభా 2 కోట్ల యాభై లక్షలు. ఇందులో ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో నివసించే 88 లక్షల మంది భారతీయ కార్మికుల చెమట చుక్కల ద్వారా సంపాదించిన సొమ్మే అధికం. ఎన్నారైలు పంపే విదేశీ మారక ద్రవ్యంతో దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ఉపయోగపడుతుంది. భారత ప్రభుత్వం వద్ద విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగ్గుతున్నట్లు ఇటీవలి నివేదికలు తెలుపుతున్నాయి. ఫారెక్స్ నిల్వలు 2 సంవత్సరాల కనిష్ట స్థాయి 564 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. రూపాయి విలువ అధఃపాతాళానికి జారిపోయింది. భారత ప్రభుత్వం పేద కార్మికులను విదేశాలకు పంపుతూ ఎగుమతి, దిగుమతి వ్యాపారం చేస్తున్నది. ఎలాంటి ఖర్చు లేకుండా మానవ వనరులను విదేశాలకు ఎగుమతి చేస్తున్న భారత ప్రభుత్వం ప్రవాసులు పంపే సొమ్ముతో భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నది. ప్రభుత్వాలకు ఎన్నారైల పెట్టుబడులు, వారు ఇచ్చే విరాళాలపై ఉన్న ప్రేమ వారి సంక్షేమం పట్ల లేదు. ప్రవాస కార్మికుల బతుకులు మారడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ బడ్జెట్ ను కేటాయించడం లేదు. ఒంటరి వలసలు, తక్కువ చదువు, తక్కువ నైపుణ్యం, తక్కువ ఆదాయం కలిగిన కార్మికులు అన్యాయానికి గురవుతున్నారు. ఆన్ లైన్ మీటింగ్ లో పాల్గొన్న మంద భీంరెడ్డి వారు పొట్టచేత పట్టుకొని సప్త సముద్రాలు, భారత సరిహద్దులు దాటి.. ఎడారి దేశాలలో పనిచేసే తెలంగాణ వలస కార్మికులు. తమ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సొమ్మును స్వదేశానికి విదేశీ మారక ద్రవ్యం రూపంలో పంపిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక జవాన్లుగా, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ బలోపేతంలో భాగస్వాములుగా తమ వంతు సేవ చేస్తున్నారు. దేశ సరిహద్దుల్లో పనిచేసే సైనికుల లాగా వీరు కూడా కుటుంబాలను వదిలి దూర తీరాలకు వెళ్లి మాతృభూమి రుణం తీర్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 15 లక్షల మంది వలసదారులు గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నారని ఒక అంచనా. ఒక కార్మికుడు, ఉద్యోగి సరాసరి నెలకు 700 యుఎఇ దిర్హామ్స్ / సౌదీ రియాల్స్ (లేదా సమానమైన గల్ఫ్ కరెన్సీలు) పంపితే అది రూ . 14,000 కు సమానం. 15 లక్షల మంది గల్ఫ్ ప్రవాసులు నెలకు రూ. 14 వేలు పంపిస్తే రూ. 2,100 కోట్లు అవుతుంది. సంవత్సరానికి రూ. 25,200 కోట్లు అవుతుంది. తెలంగాణ గల్ఫ్ ప్రవాసులు పంపే రూ. 25,200 కోట్లు విదేశీ మారక ద్రవ్యం వారి కుటుంబ సభ్యుల ద్వారా దేశీయంగా వినియోగంలోకి వచ్చినప్పుడు కనీసం 10 శాతం జీఎస్టీ సంవత్సరానికి రూ.2,520 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన సగం వాటా కింద సంవత్సరానికి రూ. 1,260 కోట్లు లాభపడుతున్నది. ఎక్స్ పోర్ట్ ఓరియెంటెడ్ యూనిట్స్ స్కీం (ఎగుమతి ఆధారిత యూనిట్ల పథకం) 1981లో ప్రవేశపెట్టబడింది. ఎగుమతులను పెంచడం, దేశంలో విదేశీ మారక ద్రవ్య ఆదాయాన్ని పెంచడం మరియు భారతదేశంలో అదనపు ఉపాధిని సృష్టించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం భూమి, నీరు, విద్యుత్, బ్యాంకు రుణాలు, పారిశ్రామిక రాయితీలు, పన్ను మినహాయింపులు అందిస్తుంది. గల్ఫ్ రిక్రూట్మెంట్ వ్యవస్థకు ఇండస్ట్రీ స్టేటస్ (పరిశ్రమల హోదా) ఇవ్వాలి. ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి. మెడికల్ టెస్ట్ ఫ్లయిట్ టికెట్, నైపుణ్య శిక్షణ లాంటి వాటికి ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వాలి. గల్ఫ్ దేశాలకు కార్మికులను భర్తీ చేసేందుకు ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేలు లేదా 45 రోజుల జీతాన్ని ఫీజుగా తీసుకోవడానికి రిక్రూటింగ్ ఏజెన్సీలకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రిక్రూట్మెంట్ ఫీజు లేకుండా ఉచితంగా ఉద్యోగ భర్తీ చేపట్టాలనే సంకల్పానికి ప్రభుత్వాల మద్దతు అవసరం. కార్మికులను విదేశాలకు పంపే అతిపెద్ద దేశమైన భారత్‌కు ఒక మైగ్రేషన్ పాలసీ (వలస విధానం) లేకపోవడం విచారకరం అని మంద భీంరెడ్డి అన్నారు. డా. జునుగురు శ్రీనివాస్, డా. రౌల్ వి. రోడ్రిగ్జ్, డా. జె. సంతోష్, డా. నరేష్ సుదవేని, డా. పి. వి. సత్య ప్రసాద్, వలస కార్మికుల ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షకుడు బి. ఎల్. సురేంద్రనాథ్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. -
గల్ప్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి
విదేశాలలో అసువులు బాసిన ప్రవాసీ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరుతూ గ్రామ ప్రజలు, గల్ఫ్ వాపసీలు గల్ఫ్ జెఏసి డిమాండ్ చేసింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో శుక్రవారం జరిగిన ఓ గల్ఫ్ కార్మికుడి శవయాత్రలో జేఏసీ నేతలు పాల్గొన్నారు. వాల్గొండకు చెందిన గుంటి బర్నబ్బ (42) ఇటీవల యూఏఈ రాజధాని అబుదాబిలో గుండెపోటుతో చనిపోయారు. అబుదాబి నుండి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించడానికి ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ కృషి చేసింది. సహచర కార్మికుడు గజ్జి శంకర్ అబుదాబి నుండి శవపేటికతో పాటు వచ్చారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వాల్గొండ వరకు శవపేటిక రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించింది. మృతుడికి భార్య అమృత, కుమారులు అజయ్, హర్షవర్ధన్ ఉన్నారు. గల్ఫ్ దేశాలలో సంవత్సరానికి సుమారు 200 మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు చనిపోతున్నారు. గత ఎనిమిది ఏళ్లలో సుమారు 1,600 మంది తెలంగాణ ప్రవాసీల మృతదేహాలు శవపేటికలలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా వారి స్వగ్రామాలకు చేరుకున్నాయి. కొందరి మృతదేహాలకు గల్ఫ్ దేశాలలోనే అంత్యక్రియలు జరిగాయని జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలలో చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా (మృత ధన సహాయం) ఇవ్వాలని గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ కోరారు. గల్ఫ్ ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్ లో ప్రతి సంవత్సరం రూ. 500 కోట్లు కేటాయించాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల కోరారు. ప్రవాసి అంతిమయాత్రలో సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గుగ్గిల్ల రవిగౌడ్, స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసి నాయకుడు మెంగు అనిల్, గ్రామ సర్పంచ్ దండిగ గంగు - రాజన్న, గ్రామస్తులు, గల్ఫ్ వాపసీలు తదితరులు పాల్గొన్నారు. చదవండి: ప్రాణాలతో గల్ఫ్ కు ఎగుమతి.. శవపేటికల్లో దిగుమతి -
జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్.. ఊపందుకున్న ఉద్యమం
మానవ వలస అనేది ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్న ప్రక్రియ. వలసలకు, అభివృద్ధికి, మానవ వికాసానికి సంబంధం ఉన్నది. వలస వెళుతున్న పౌరులందరి కోసం ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 18 ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా (ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే) గా ప్రకటించింది. ఈమేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ) 31 ఏళ్ల క్రితం 18 డిసెంబర్ 1990 సంవత్సరంలో జరిగిన సమావేశంలో "అందరు వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ" గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అంతర్జాతీయ వలసలు ఉన్న ఊరిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడం వలసలకు ఒక కారణం కాగా, అధిక వేతనాలు మరింత మెరుగైన జీవం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం మరొక కారణం. పల్లెల నుండి పట్టణాలకు గాని, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి గాని వెళ్లడాన్ని అంతర్గత వలసలు అంటారు. ఒకదేశం నుండి మరొకదేశానికి వెళ్లడాన్ని అంతర్జాతీయ వలసలు అంటారు. కోవిడ్ మరణాలు కోవిడ్ పరిస్థితుల వలన తెలంగాణ నుండి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వలస కార్మికుల పరిస్థితి మరింత దిగజారింది. కోవిడ్ కారణంగా ఆరు గల్ఫ్ దేశాలలో 3,576 మంది భారతీయులు చనిపోయారు. వీరిలో 200 కు పైగా తెలంగాణ వారు ఉన్నారని ఒక అంచనా. సౌదీ అరేబియా (1,154), యుఏఇ (894), కువైట్ (668), ఓమాన్ (551), బహరేన్ (200), ఖతార్ (109). వందే భారత్‌లో కోవిడ్ సందర్భంగా గల్ఫ్ దేశాల నుంచి భారత్ కు 'వందే భారత్ మిషన్' లో 7,16,662 మంది వాపస్ వచ్చారు. వీరిలో ఒక లక్షమంది తెలంగాణ వారు ఉన్నారని ఒక అంచనా. యుఏఇ (3,30,058), సౌదీ అరేబియా (1,37,900), కువైట్ (97,802), ఓమాన్ (72,259), ఖతార్ (51,190), బహరేన్ (27,453) వేల మంది భారతీయులు ఇండియాకి తిరిగి వచ్చారు. జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్ కరోనా సమయంలో గల్ఫ్ నుండి హడావిడిగా వెళ్లగొట్టబడిన కార్మికులకు జీతం బకాయిలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు (ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్) రాబట్టుకోవడం కోసం 'జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్' అనే ఉద్యమం నడుస్తున్నది. వాపస్ వచ్చిన వలస కార్మికుల పునరావాస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు స్పష్టం చేసింది. వాపస్ వచ్చినప్పుడు అధిక విమాన చార్జీలు, క్వారంటైన్ ఖర్చులు తడిసి మోపెడైనాయి. భారంగా మారిన తిరుగు ప్రయాణం కరోనా తగ్గుముఖం పట్టడంతో వాపస్ వచ్చిన వలస కార్మికులు తిరిగి గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. కరోనా టెస్టులు, అధిక విమాన చార్జీలు ఇబ్బంది పెడుతున్నాయి. కొత్తగా ఉద్యోగుల రిక్రూట్మెంట్ కూడా పుంజుకుంటున్నది. కరోనా సందర్భంగా రిక్రూటింగ్ ఏజెన్సీలను ఆదుకోవడానికి సెక్యూరిటీ డిపాజిట్లను కేంద్ర ప్రభుత్వం రూ. 50 లక్షల నుంచి రూ. 25 లక్షలకు, రూ. 8 లక్షల నుంచి రూ. 4 లక్షలకు తగ్గించింది. వలస కార్మికులు చెల్లించే సర్వీస్ చార్జీలు రూ.30 వేలు దీనిపై 18 శాతం జీఎస్టీ మాత్రం తగ్గించలేదు. ప్రవాసీ విధానం ఎన్నారైలు పంపే విదేశీ మారక ద్రవ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు జరుగుతున్నది. ప్రభుత్వాలకు ఎన్నారైల పెట్టుబడులపై ఉన్న ప్రేమ వారి సంక్షేమం పట్ల లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ప్రవేశపెట్టాలని, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండు చాలాకాలంగా అమలుకు నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడున్నర ఏళ్లలో 1500 కు పైగా తెలంగాణ ప్రవాసులు గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో మృతి చెందారు. గల్ఫ్ మృతుల కుటుంబాలు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా కోసం ఎదిరి చూస్తున్నారు. రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ తో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి, పునరావాసానికి కృషి చేయాలని కోరుతున్నారు. ఆన్లైన్ ఓటింగ్ 38 ఏళ్లనాటి ఎమిగ్రేషన్ యాక్టు, 1983 స్థానంలో నూతన ఎమిగ్రేషన్ యాక్టు, 2021 ను తీసుకరావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఎన్నారైలకు 'ప్రాగ్జీ' ఓటింగు (ప్రతినిధి ద్వారా, పరోక్ష పద్ధతిలో ఓటు వేయడం) లేదా ఆన్ లైన్ ఓటింగు సౌకర్యం కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గల్ఫ్ దేశాల జైళ్లలో మగ్గుతున్న 2,183 మంది భారతీయులు న్యాయ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కనీస వేతనం గల్ఫ్ దేశాలలో పనిచేసి భారతీయ కార్మికులకు భారత ప్రభుత్వం కనీస వేతనాలను తగ్గిస్తూ సర్కులర్లను జారీ చేసింది. అన్నివర్గాల ఒత్తిడితో ఆ తర్వాత ఆ సర్కులర్లను రద్దు చేశారు. భారత విదేశాంగ మంత్రి గల్ఫ్ దేశాలలో పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విదేశీ భవన్ కావాలి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ముంబయి లో ఏర్పాటు చేసిన విధంగా "విదేశ్ భవన్" ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలి. ఈ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ (సమీకృత సముదాయం) లో పాసు పోర్టు ఆఫీసు, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ ఆఫీసు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) రీజినల్ ఆఫీసు, విదేశాంగ శాఖ బ్రాంచి సెక్రెటేరియట్ లు ఉంటాయి. అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం 'ప్రవాసీ తెలంగాణ దివస్' ను అధికారికంగా నిర్వహించాలి. విదేశాలలో, స్వదేశంలో ఉన్న తెలంగాణ ప్రవాసి సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి హైదరాబాద్ కేంద్రంగా ఒక విశ్వవేదిక ఏర్పాటు చేసుకొని తమ హక్కుల కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్భంగా ప్రవాసులు అందరికీ శుభం జరగాలని ఆశిస్తూ ... - మంద భీంరెడ్డి (+91 98494 22622 ) -
ప్రవాసీ నిధుల ఆకర్షణలో భారత్ టాప్.. ఈ ఏడాది రూ. 6.47 లక్షల కోట్ల రాక
వాషింగ్టన్: విదేశాల నుంచి స్వదేశానికి డబ్బు పంపడంలో (రెమిటెన్సులు) భారతీయులే మొదట నిలుస్తున్నారు. భారతీయుల తర్వాత స్థానంలో చైనా, మెక్సికో, ఫిలిప్ఫైన్స్, ఈజిప్టు దేశాలు అత్యధికంగా ప్రవాసీయుల నుంచి నిధులు అందుకుంటున్న దేశాలుగా నిలిచాయి. ఈ విషయాలను వాషింగ్టన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం ప్రపంచబ్యాంక్ నివేదిక పేర్కొంది. దీని ప్రకారం 2021లో ఇలా దేశానికి రానున్న మొత్తం 87 బిలియన్ డాలర్ల నిధులు ఇప్పటికే వచ్చాయి. గతేడాది ఈ మొత్తం 83 బిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికా నుంచే అధికం ప్రవాసీయుల నుంచి ఇండియాకు అందుతున్న నిధుల్లో 20 శాతం వరకు అమెరికా నుంచి వస్తున్నాయి. యూఎస్ఏలో సెటిలైన ఎన్నారైలు ఇండియాలో ఉన్న తమ వారికి భారీ ఎత్తున నగదు పంపిస్తున్నారు. గతంలో ప్రవాసీ నిధులు అధికంగా అందించడంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న వలక కార్మికులు ముందుండే వారు. గల్ఫ్ పై కోవిడ్ ఎఫెక్ట్ గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు ప్రవాసీయులు పంపించే నిధులు ఈసారి తగ్గిపోయాయి. కరోనా కారణంగా వలస కార్మికుల్లో చాలా మంది ఇండియాకు తిరిగి వచ్చేశారు. కోవిడ్ తగ్గుముఖం పట్టినా వీరంతా తిరిగి గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. ఒకసారి పరిస్థితులు చక్కబడితే మరోసారి గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకి నిధుల ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు - భారత్‌కు రెమిటెన్సులు 2022లో 3 శాతం పెరిగి 89.6 బిలియన్ డాలర్లకు చేరుతాయని అంచనా. - దిగువ, మధ్య స్థాయి ఆదాయ దేశాలకు రెమిటెన్సుల మొత్తం 2021లో 7.3% పెరిగి 589 బిలియన్ డాలర్లకు చేరనుంది. - 2020తో పోల్చితే రెమిటెన్సుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉండే వీలుంది. కోవిడ్–19 సవాళ్ల తీవ్రత తగ్గడం దీనికి కారణం. - కోవిడ్–19 సంక్షోభ సమయంలో పలు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఈ ఇబ్బందుల పరిష్కారానికి, సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వ నగదు బదిలీ కార్యక్రమాలకు తోడు రెమిటెన్సుల తోడ్పాటు ఎంతగానో ఉందని ప్రపంచబ్యాంక్ సామాజిక, ఉపాధి పరిరక్షణా వ్యవహారాల డైరెక్టర్ మైఖేల్ పేర్కొన్నారు. చదవండి:సౌదీ అరేబియా, ఈజిప్టులలో ఐఐటీ, ఢిల్లీ క్యాంపస్‌లు -
ఆస్పత్రి బిల్లు రూ.3.40 కోట్లు.. ఆదుకున్న అధికారులు
దుబాయ్: అనారోగ్యం కారణంగా దుబాయ్ ఆస్పత్రిలో చేరిన గల్ఫ్ కార్మికుడికి అండగా నిలిచింది గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపెల్లి గ్రామానికి చెందిన కట్ల గంగారెడ్డి అనే కార్మికుడు గతేడాది డిసెంబర్ 25న అనారోగ్యం కారణంగా దుబాయ్‌లోని మెడిక్లినిక్ హాస్పిటల్లో చేరాడు. అప్పటికే పక్షవాతం రావడంతో బ్రెయిన్ ఆపరేషన్ మొదలుపెట్టగా పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లాడు. గత ఆరు నెలల తర్వాత గంగారెడ్డి కోమా నుంచి బయటకు వచ్చాడు,. అనంతరం మరో మూడు నెలల పాటు చికిత్స కొనసాగింది. అయితే ఈ 9 నెలలకు సంబంధించి చికిత్స బిల్లు రూ. 3.40 కోట్లు అయ్యింది. స్పందించిన అధికారులు తల తాకట్టు పెట్టినా చెల్లించలేనంతగా ఆస్పత్రి బిల్లు రావడంతో గంగారెడ్డి కుటుంబ సభ్యులు, స్నేహితులు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితిని సంప్రదించారు. సమితి అధ్యక్షుడు గుండెల్లి నర్సింహా పేషెంటుకు ధైర్యం చెప్పడంతో పాటు దుబాయ్‌లో ఉన్న ఇండియన్ కాన్సులేట్ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. దీనికి స్పందించిన భారతీయ అధికారులు బిల్లు మాఫీ చేయించడంతో పాటు గంగారెడ్డి ఇండియా చేరుకునేందుకు ప్రత్యేక ఎయిర్ అంబులెన్సుని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌కి చేరుకున్న గంగారెడ్డిని నేరుగా స్వగ్రామానికి పంపకుండా ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో పరిశీలనలో ఉంచారు. చదవండి: యూఏఈకి వెళ్లే వారికి ఊరట -
చేయని తప్పునకు గల్ఫ్‌లో జైలు పాలై..
కథలాపూర్ (వేములవాడ): చేయని తప్పునకు జైలు పాలై.. పాస్‌పోర్టు లేక దుబాయ్‌లో చిక్కుకున్న జగిత్యాల జిల్లావాసికి ఊరట లభించింది. గల్ఫ్ సంక్షేమ సంఘాల చొరవతో అతను స్వగ్రామానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. కథలాపూర్ మండలం గంభీర్‌పూర్‌కు చెందిన పిట్టల కొండగట్టు రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. గతేడాది మార్చిలో కొండగట్టు పేరిట రిజిస్టర్ అయిన సిమ్‌కార్డు పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఉపయోగించాడు. అతను చేసిన తప్పులకు కొండగట్టును అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. 8 నెలలు జైలు జీవితం గడిపిన కొండగట్టు.. ఇటీవల విడుదలయ్యాడు. అయితే.. కొండగట్టు వద్ద పాస్‌పోర్టు లేకపోవడంతో స్వదేశానికి రాలేకపోయాడు. ఈ విషయమై గత నెల 21న ‘స్వదేశానికి రప్పించండి’శీర్షికన సాక్షి మెయిన్‌లో ప్రచురితమైన కథనానికి గల్ఫ్ సంక్షేమ సంఘాల ప్రతినిధులు స్పందించారు. కొండగట్టు స్వదేశానికి వచ్చేందుకు కోర్టు అనుమతి పత్రం, ఎన్ఓసీ దుబాయ్‌లోని రాయబార కార్యాలయానికి అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో అతను స్వగ్రామానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇక్కడ చదవండి: శ్రీనివాస్‌ను జైలు నుంచి విడిపించరూ..! ఆరేళ్లుగా కుమార్తె అస్థికలు భద్రపరిచి.. -
9 నెలలకు స్వగ్రామానికి మృతదేహం
సాక్షి, అదిలాబాద్: రెక్కాడితేగాని డొక్కడాని పరిస్థితి, ఉన్న ఊళ్ళో వ్యవసాయ కూలీగా జీవనం, దినదినం పెరిగిన కుటుంబ ఖర్చులు వెరసి ఆ యువకుడికి అందరిలాగే బయటి దేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పిల్లలను బాగా సాకుదామన్న కలసాకారం కాకుండానే ఆ యువడిని విధి వక్రీకరించి. ఏడాది తిరగకక మునుపే తొమ్మిది నెలల కిందట విద్యుత్ షాక్‌తో సౌదీలో మృత్యువాత పడ్డాడు. మండలంలోని సిర్గాపూర్ గ్రామానికి చెందిన కదిలి చందు(26) తొమ్మిది నెలల కిందట సౌదీలో తాను పనిచేస్తున్న చోట విద్యుత్ షాక్‌తో మృత్యువాత పడ్డాడు. 9నెలలుగా ఆ కుటుంబ పడ్డ వేదన వర్ణనాతీతం. నిత్యం రోదన సౌదీలో ఉంటున్న స్థానికులకు వేడుకోలుతో అక్కడి కూలీలుగా పనిచేస్తున్న తెలంగాణ యువకులు చందాలు చేసి మృతదేహాన్ని తరలించేందకు శ్రమించారు. మృతి చెందిన వెంటనే అక్కడి అధికారులు అన్ని లాంచనాలు పూర్తి చేసినా మృతదేహాన్ని తరలించడంతో తీవ్ర జాప్యం చేశారు. ఆదివారం ఉదయం చందు మృతదేహం స్వగ్రామమైన సిర్గాపూర్‌కు చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు పలువురుని కంటతడి పెట్టించాయి. ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి భార్య హేమలత, కుమారుడు విష్ణువర్థన్, కూతులు వైష్ణవిలు ఉన్నారు. సౌదీలో చందాలు వసూలు చేస్తున్న వలస కూలీలు స్పందించిన గల్ఫ్ కార్మికులు మృతదేహం కోసం ఎంత వేచిచూసినా ఫలితం లేకపోవడంతో చివరకు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సభ్యులు బడుగు లక్ష్మన్, మోహన్, గోవింద్, గణేష్, గంగన్న, శ్రీకాంత్‌లు తోటి కార్మికుల సహాయంతో మృతదేహాన్ని స్వగ్రామమైన సిర్గాపూర్‌కు తరలించడంలో తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరికి చందాలు వేసుకుని చందు మృతదేహాన్ని ఆ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై పాలసీని అమలు పరిచి గల్ఫ్‌లో మృతి చెందిన వారికి రూ. పదిలక్షల ఎక్స్‌గ్రేసియా అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
సౌదీ అరేబియాలో తెలంగాణ కార్మికుల నిరసన
సాక్షి, మల్యాల(చొప్పదండి): గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సౌదీ అరేబియాలోని రియాద్ ప్రాంతంలో గల్ఫ్ కార్మికులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. గల్ఫ్ కార్మికుల అవగాహన వే దిక ఉపా«ధ్యక్షుడు బడుగు లక్ష్మణ్, సలహా దారుడు సత్రబోయిన దేవన్న, ఇన్చార్జి ఉప్పల్వాయి శంకర్, కోఆర్డినేటర్స్ గుండబోయిన కృష్ణ, కంకార్ల సురేశ్ ఆధ్వర్యంలో ప్లకార్డులు నిరసన కార్యక్రమం చేపట్టారు. -
కువైట్‌లో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
కువైట్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని కువైట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో సాల్మియా ప్రాంతంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెచ్చిన భారీ కేక్‌ను కట్ చేసి వైఎస్ జగన్‌కు తమ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుమారు 25 మంది రక్తదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్సీ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టీఎస్) సహకారంతో వైఎస్ఆర్ జిల్లాకు చెందిన షేక్ గౌసియా అనే మహిళకు రూ.33 వేల రూపాయల విలువ గల ఓపెన్ టికెట్ అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్. ముమ్మడి బాల్‌రెడ్డి, ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి, వైఎస్సార్ కువైట్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమమే లక్ష్యం కావాలి
గల్ఫ్ కార్మికుల విషయంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలపై వలస జీవుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటున్న వారిని ఇంటి బాట పట్టించి రాష్ట్ర రాజధాని పరిసరాల్లో ఉపాధి చూపుతామని, ఇందుకు తాను స్వయంగా రంగంలోకి దిగుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించిన విషయం విదితమే. గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించడం ఆహా్వనించదగ్గ పరిణామమేనని, అయితే వలస కార్మికులను స్వగ్రామాలకు రప్పించి ఇక్కడే ఉపాధి చూపుతామనే అంశంపై భిన్నాబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న కార్మికులు ఎందరు అనేది ప్రభుత్వం వద్ద నిర్ధిష్టమైన సంఖ్య లేదని, అది తేలకపోతే ఉపాధి అవకాశాలు ఎలా కలి్పస్తారని పలువురు ప్రశి్నస్తున్నారు. వలస కార్మికులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న ప్రవాసీ సంక్షేమ విధానం(ఎన్ఆర్ఐ పాలసీ) అమలు కాలేదని, కార్మికుల సంక్షేమానికి కార్యాచరణ చేపట్టాలని పలు స్వచ్ఛంద సంఘాలు సూచిస్తున్నాయి. గత హామీలను అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై పాలసీ అమలు చేస్తే లక్షల మంది గల్ఫ్ కారి్మకుల బతుకులు బాగుపడుతాయి. గల్ఫ్ కారి్మకుల సంక్షేమానికి గతంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుంది. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి వివరాలు ప్రభుత్వం వద్ద, కారి్మకుల ఊళ్లలోని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఉండాలి. మోస పూరిత ఏజెంట్ల వ్యవస్థను తుడిచిపెట్టాలి. బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లి నష్టపోయిన, మోసపోయిన వారికి ప్రభుత్వం వారి స్వగ్రామాల్లో ఉపాధి చూపాలి. వారికి పునరేకీకరణ కల్పించి మనోధైర్యం నింపాలి. గల్ఫ్ దేశాల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు ఆరి్థక సాయం చేయాలి. అవయవాలు కోల్పోయిన కారి్మకులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. భారత రాయబార కార్యాలయంలో తెలుగు మాట్లాడే అధికారులను ఏర్పాటు చేస్తే వలస కార్మికులకు సమస్యలు చెప్పుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. తెలుగు భాష వచ్చిన అధికారులు లేకపోవడంతో కార్మికులు సమస్యలు చెప్పుకోలేక కూడా నష్టపోతున్నారు. జీతాలు ఇవ్వని గల్ఫ్ కంపనీలు యజమానుల నుంచి వేతాలు రాబట్టడానికి విదేశాంగ శాఖ ద్వారా చర్యలు చేపట్టాలి. గల్ఫ్‌కు వెళ్లిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారు. వారి రేషన్‌కార్డుల కూడా కట్ చేస్తున్నారు. ఇలా తొలగించడం వల్ల వలసజీవులు ఎంతో నష్టపోతున్నారు. గల్ఫ్ నుంచి తిరిగివచ్చి ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి వారి నైపుణ్యం ప్రకారం వారి జిల్లాల్లో ఉద్యోగం కలి్పంచాలి. ఆచరణలో చూపితేనే నమ్మకం ఆయన ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లోని వివిధ దేశాలకు వెళ్లాడు. అక్కడ దశాబ్దం పాటు పనిచేసి తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. అక్కడి కారి్మకుల కష్టాలపై అవగాహన ఉన్న ఆయన.. సుఖీభవ సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా వారికి సేవలందిస్తున్నాడు. ఆయనే బొక్కెనపల్లి నాగరాజు. గల్ఫ్ కారి్మకుల సంక్షేమం అంశాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చర్చకు తీసుకురావడం.. కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్ఆర్ఐ పాలసీని అధ్యయనం చేయడానికి త్వరలోనే ఓ బృందాన్ని అక్కడికి పంపుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన ఈ నేపథ్యంలో గల్ఫ్ కారి్మకుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై నాగరాజు‘సాక్షి’కి తెలిపారు. గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి కేరళలో అమలు చేస్తున్న విధానంపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపనుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం. తెలంగాణ ఏర్పడక ముందు ఉద్యమంలో గల్ఫ్ కారి్మకులకు టీఆర్ఎస్ ఎన్నో ఆశలు కల్పించింది. రాష్ట్రం ఆవిర్బవించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ఆర్ఐ శాఖను పర్యవేక్షించిన మంత్రి కేటీఆర్ గల్ఫ్ కార్మికుల కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమయంలో సలహాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. కానీ, ఇంతవరకు వాటి అమలు దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం కేరళలో అమలు చేస్తున్న విధానంపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక బృందాన్ని పంపాలని నిర్ణయించిన ప్రభుత్వం.. దానిని ఇక్కడ అమలు చేయడానికి చిత్తశుద్ధితో వ్యవహరించాలి. గతంలో మాదిరిగానే మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపాలి. ముఖ్యంగా ప్రభుత్వం గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవాస భారత బీమా యోజన పథకం ద్వారా గల్ఫ్ దేశాల్లో ప్రమాదంలో మరణించిన కారి్మకుల కుటుంబాలకు రూ.10లక్షల ఆరి్థక సహాయం చేస్తుంది. కారి్మకులు ఎలా మరణించినా.. వారి కుటుంబానికి రూ.పది లక్షల ఆర్థిక సహాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీని రూపొందించాలి. గల్ప్‌లో చనిపోయిన వారి మృతదేహాలు స్వగ్రామాలకు చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని పరిష్కరించాలి. ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి. దీని ద్వారా గల్ఫ్‌లో ఉపాధి కోల్పోయి ఇక్కడకు వచి్చన కారి్మకులు స్వయం ఉపాధి పొందడానికి తగిన శిక్షణ ఇచ్చి రుణాలు అందజేయాలి. గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారిలో ఎక్కువ మందికి వృత్తి నైపుణ్యత లేకపోవడం వల్ల కూలీలుగా తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. ప్రభుత్వం వివిధ వృత్తుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి పంపితే అధిక వేతనాలు పొందడానికి అవకాశముంటుంది. వలసలు ఆపడం, కార్మికులను రప్పించడం కష్టమే.. గల్ఫ్ దేశాలకు వలసలను ఆపడం, అక్కడ ఉన్న మన కార్మికులను రప్పించడం కష్టమేనని జగిత్యాలకు చెందిన ఓ రిక్రూటింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు, గల్ఫ్ రిటర్నీ అయిన చిట్ల రమణ ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు. మన దగ్గర వ్యవసాయంలో, ఇతర పనుల్లో యాంత్రీకరణ జరగడంతో స్థానికంగా ఉపాధి తగ్గిపోయింది. గతంలో కార్మికులకు వేతనం చేతికి అందించేవారు. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో విధానం మారిపోయింది. కార్మికుల ఖాతాల్లోనే వేతనాలను జమ చేస్తున్నారు. అందువల్ల కార్మికులను మోసగించే చర్యలకు బ్రేక్ పడింది. గల్ఫ్‌కు చట్టబద్ధంగా వెళ్తే ఎలాంటి ఇబ్బందీ లేదు. -
మస్కట్‌లో ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్ ఆవిష్కరణ
గల్ఫ్ డెస్క్: గల్ఫ్ వలస జీవితాలు, కష్టసుఖాలు, హక్కులు, అభివృద్ధి.. ఇలా అన్ని కోణాలను స్పృశిస్తూ ప్రతీవారం ‘సాక్షి’ జిల్లా పేజీల్లో ‘గల్ఫ్ జిందగీ’ ప్రచురించడం తెలుగు జర్నలిజంలో కొత్త ప్రయోగం. 11 నవంబర్ 2017 న ప్రారంభమైన ఈ పేజీ 22 నెలలుగా.. ఈ సెప్టెంబర్ 2019 వరకు 83 వారాలుగా కొనసాగుతూ... వలస కార్మికులకు, ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు మధ్య వారధిలా ఉపయోగపడుతోంది. సమగ్ర సమాచారాన్ని ఇస్తూ గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు నేనున్నాననే భరోసా కల్పిస్తూ ముందుకెళ్తోంది. మొదట్లో ప్రతి శనివారం ప్రచురితమైన ఈ పేజీ, పాఠకుల కోరిక మేరకు 15 జూన్ 2018 నుంచి గల్ఫ్ దేశాల్లో సెలవు దినమైన శుక్రవారానికి మార్చడమైనది. ఈ పేజీలో గల్ఫ్ కార్మికులకు ఉపయోగపడే సమాచారం, ఎంబసీలు నిర్వహించే సమావేశాల వివరాలతో పాటు ఆయా దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న కార్మికుల గురించి, వారి జీవన విధానాలపై, సక్సెస్‌పై ప్రత్యేక కథనాలు ప్రచురించాం. ఒమన్ రాజధాని మస్కట్‌లో 4 అక్టోబర్ 2019న నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా 83 వారాల పేజీలను అన్నింటినీ కలిపి ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్‌ను ఆవిష్కరించనుండటం సంతోషం. ‘మైగ్రేంట్ ఫోరం ఇన్ ఏసియా’ సభ్య సంస్థ అయిన ‘ఎమిగ్రేంట్స్ వెల్ఫేర్ ఫోరం’ తెలంగాణ వలసల చరిత్రలతో ఈ ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్‌ను ఆవిష్కరించనుండటం గుర్తుండిపోయే ఘట్టం అని చెప్పవచ్చు. -
గల్ఫ్‌లోనూ.. ఎన్నికల వేడి
సాక్షి, నెట్వర్క్: మన పార్లమెంట్ ఎన్నికల ప్రచారం గల్ఫ్ దేశాల్లోనూ జోరుగా సాగుతోంది. అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేయడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్న ప్రవాసులు విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తమ డిమాండ్ల సాధనకు ఎన్నికలను ఒక అవకాశంగా తీసుకున్న గల్ఫ్ ప్రవాసులు సోషల్‌మీడియాలో తమ అభిప్రాయాలను పోస్టు చేస్తున్నారు. ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యవర్గాలు ఆయా గల్ఫ్ దేశాల్లో కూడా ఉన్నాయి. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలి, ఎవరికి మద్దతును ఇవ్వాలి అనే ఆంశంపై రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. తమకు ప్రయోజనం కల్పించే ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని గల్ఫ్ ప్రవాసులు కొంత కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న రోజుల్లో స్పందించి ఎన్ఆర్ఐ పాలసీని రూపొందించి తమ సంక్షేమానికి బాటలు వేస్తాయని వారు భావిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో దాదాపు 13లక్షల మంది తెలంగాణ వాసులు ఉపాధి పొందుతున్నారని అంచనా. వీరిపై స్వదేశంలో ఆధారపడిన వారి సంఖ్య నాలుగింతలు ఉంటుంది. గల్ఫ్ వలస జీవుల కుటుంబాల సంఖ్యను పరిశీలిస్తే ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగానే ఉంటుంది. ఆరు పార్లమెంట్నియోజకవర్గాల్లోప్రభావం చూపే అవకాశం గల్ఫ్ ప్రవాసుల ప్రభావం ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన వారు గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా ఉన్నారు. వారి నిర్ణయం ఈ నియోజకవర్గాల్లో కీలకం కానుంది. ఆయా దేశాల్లో పనులు ముగిసిన తరువాత క్యాంపులకు చేరుకుంటున్న వలస కార్మికులు సమావేశాలను నిర్వహిస్తూ తమ డిమాండ్లను రాజకీయ పక్షాలకు తెలిసేలా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. గల్ఫ్ ప్రవాసుల సంక్షేమానికి అండగా నిలచే రాజకీయ పక్షాలనే ఆదరించే దిశగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అడుగులు వేస్తున్నారు. 1,122 మంది ఎన్నారై ఓటర్లు తెలంగాణ రాష్ట్రంలో 2.95 కోట్ల మంది ఓటర్లున్నారు. గల్ఫ్ దేశాలలో 13 లక్షల మంది, ఇతర దేశాలలో మరో 10 లక్షల మంది ప్రవాసులున్నారు. వీరిలో కేవలం 1,122 మంది మాత్రమే ఎన్నారై ఓటర్లు (ఓవర్సీస్ ఎలక్టర్స్)గా నమోదయ్యారు. ఎన్ఆర్ఐ పాలసీ తీసుకురావాలి ప్రవాసులకు ప్రయోజనం కలిగించే ఎన్ఆర్ఐ పాలసీని తెలంగాణలో తీసుకురావాలి. ఈ పాలసీ వల్ల గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది. ఎన్నికల సందర్భంగా గల్ఫ్ ప్రవాసుల తరఫున మేము కోరుతున్నది ఒక్కటే.. ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలి. ఎన్ఆర్ఐ పాలసీకి అండగా ఉండేవారికే గల్ఫ్ ప్రవాసులు ఎన్నికల్లో మద్దతు తెలిపే అవకాశం ఉంది. – గోపాల్‌రెడ్డి, బహ్రెయిన్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం భారత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి గల్ఫ్‌లో ఉన్న కార్మికులు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఫేస్బుక్, వాట్సప్ తదితర సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఎవరి అభిప్రాయాలను వారు వెల్లడిస్తున్నారు. ఎన్నికలు ముగిసేవరకు గల్ఫ్ దేశాల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఏ పార్టీ గెలుస్తుందోనని సమాచారం తెలుసుకుంటున్నారు. – నర్సారెడ్డి, ఖతార్ కుటుంబ సభ్యులకు చెబుతున్నాం.. మొన్నటి వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి ఇక్కడ చర్చ జరిగింది. ఆ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా దేశ భవిష్యత్తుకు సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలు కావడంతో ఇప్పుడు వాడీవేడిగా చర్చ జరుగుతోంది. అన్ని రాజకీయ పార్టీల కార్యవర్గాలు కువైట్‌లో ఉన్నాయి. అందువల్ల క్యాంపుల్లో జోరుగానే ప్రచారం జరుగుతోంది. మేము ఓటు వేసే అవకాశాన్ని పొందకపోయినా సొంత గ్రామాల్లో ఉన్న మా కుటుంబ సభ్యులకు ఫోన్లలో ఏ పార్టీకి ఓటు వేయాలో చెబుతున్నాం.–ఆనందం గంగేశ్వర్, కువైట్ దేశభద్రత ముఖ్యం నాది జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయపల్లి. నేను షార్జాలో ఉంటాను. ఇప్పుడు జరిగే ఎన్నికలు దేశానికి సంబంధించినవి. దేశ భద్రత ఎంతో ముఖ్యం. మన దేశంలో జరిగే ఎన్నికలపై నిత్యం ఇక్కడ చర్చ జరుగుతోంది. ఇండియాలో మాదిరిగా ఇక్కడ పెద్దగా ప్రచారం ఉండదు కానీ.. ఇండియా వాళ్లు ఎవరు కలిసినా రాజకీయాలపై చర్చ జరుగుతుంది. – ఆకునూరి శంకర్, షార్జా దుబాయిలోనూ ఇదే చర్చ ఇండియాలో జరుగుతున్న ఎన్నికలపై దుబాయిలోనూ చర్చ సాగుతోంది. ఎవరికి ఓటు వేయాలనే అంశంపై క్యాంపుల్లో కార్మికులు చర్చింకుంటున్నారు. తాము ఇండియాకు వచ్చి ఓటు వేయలేకపోయినా.. తమ కుటుంబ సభ్యులకు చెప్పి నచ్చిన పార్టీకి ఓటు వేయించే అవకాశం ఉంది. దీంతో కార్మికులు తీరిక సమయాల్లో రాజకీయ చర్చలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. – షేక్ మిట్లు, దుబాయి మార్పు రావాలని ఆకాంక్ష దేశంలో ప్రాంతీయ పార్టీల కూటమి వస్తే.. అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు జాతీయ పార్టీల పాలన చూశాం. కూటమి అధికారంలో వస్తే బాగుంటుందని కార్మికులు చర్చింకుంటున్నారు. – నంగి మహేందర్, మస్కట్ నిజామాబాద్ బరిలోగల్ఫ్ రిటర్నీలు నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పసుపు, ఎర్రజొన్న సాగుచేసే రైతులు తమ సమస్యలను ప్రభుత్వాలు గుర్తించాలని జాతీయ స్థాయిలో ఈ ఆంశంపై చర్చ జరుగాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 175 మంది రైతులు ఉన్నారు. ఈ రైతుల్లో పలువురు గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చిన వారు ఉన్నారు. ఇక్కడ వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతోనే గల్ఫ్‌కు వలస వెళ్లామని, కానీ అక్కడ ఏజెంట్ల మోసాలు, కంపెనీ యజమానుల వంచన వల్ల శ్రమ దోపిడీకి గురయ్యామని పలువురు ఎంపీ అభ్యర్థులు వెల్లడించారు. ఎంపీ అభ్యర్థులలో బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన దాదాపు 50 మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి వచ్చిన వారు ఉన్నారు. నేను మొదట గల్ఫ్ బాధితుడినే.. నేను మొదట గల్ఫ్ బాధితుడినే. అఫ్గానిస్తాన్‌కు వెళ్లి జైలు శిక్ష అనుభవించాను. గల్ఫ్ దేశాల్లో ప్రయోజనం లేదని భావించి ఇక్కడే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాను. కానీ, వ్యవసాయం కూడా లాభసాటిగా లేకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ప్రభుత్వం మా బాధలను గుర్తించి న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఎన్నికల బరిలో ఉన్నాం. నేను స్వతంత్ర అభ్యర్థిగా నిజామాబాద్ స్థానం నుంచి పోటీచేస్తున్నాను.– కుంట కిషన్, ఎంపీ అభ్యర్థి అక్కడా.. ఇక్కడా ఇబ్బందులే... నేను దాదాపు పదిహేనేళ్లు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాను. అక్కడ కష్టాలు ఎదుర్కొన్నాను. ఇక్కడకు వచ్చి వ్యవసాయం చేస్తే పసుపు పంటకు, ఎర్రజొన్నలకు ధర లేక నష్టాలు చవిచూస్తున్నాం. ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవాలని పోటీలో నిలిచాం. ఏదో ఒక విధంగా ప్రభుత్వం ఆదుకుంటే మా బతుకులు బాగుపడతాయి.– లక్ష్మణ్, ఎంపీ అభ్యర్థి, జక్రాన్‌పల్లి గల్ఫ్ కార్మికులకు న్యాయం చేయాలి గల్ఫ్ కార్మికులకు, రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలి. ఇక్కడ వ్యవసాయం బాగాలేదని గల్ఫ్‌కు వెళ్తే అక్కడ కూడా పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. ఎంతో మంది గల్ఫ్ కార్మికులు కష్టాలు పడుతున్నారు. అందువల్ల ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికులకు, రైతులకు ప్రయోజనం కలిగించే కార్యక్రమాలను చేపట్టాలి.– భావన్న, ఎంపీ అభ్యర్థి, జక్రాన్‌పల్లి -
హైదరాబాద్‌లో ఏడు గల్ఫ్ మెడికల్ సెంటర్లు
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలయిన సౌదీ అరేబియా, యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్), ఓమాన్, బహ్రెయిన్, ఖతార్, కువైట్ లతోపాటు యెమెన్‌కు కొత్తగా ఉద్యోగానికి/నివాసానికి వెళ్లాలనుకునే వారు ముందస్తు ఆరోగ్య పరీక్షలు (ప్రీ హెల్త్ చెకప్ - మెడికల్ ఎగ్జామినేషన్) చేయించుకొని మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలి. ఇందుకోసం 'గల్ఫ్ హెల్త్ కౌన్సెల్' వెబ్ సైటు https://gcchmc.org/Gcc/Home.aspx ద్వారా ఆన్ లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి అంటువ్యాధులు ఏమైనా ఉన్నాయా ? ఎయిడ్స్, టీబీ వంటి వ్యాధులు ఉన్నాయా ? వారు ఆరోగ్యంగా ధృడంగా ఉన్నారా..? అని ఇక్కడ పరీక్ష చేసి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తారు. ఆరోగ్యవంతులకు మాత్రమే అరబ్ గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వీసా జారీ అవుతుంది. 'గల్ఫ్ హెల్త్ కౌన్సిల్' వారు భారత దేశంలోని 17 నగరాలలో 114 మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్లకు అనుమతి ఇచ్చారు. మంగుళూరు (4), అహ్మదాబాద్ (4), బెంగుళూరు (5), లక్నో (12), ముంబై (19), చెన్నై (7), ఢిల్లీ (13), హైదరాబాద్ (7), జైపూర్ (5), తిరువనంతపురం (5), తిరుచ్చి (5), కాలికట్ (5), మంజేరి (4), తిరూర్ (4), కొచ్చి (5), గోవా (3), కోల్‌కతా (7) మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు హైదరాబాద్‌లోని ఈక్రింది ఏడు మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్ల సేవలు వినియోగించుకోవచ్చు. ► మెస్కో డయాగ్నొస్టిక్ సెంటర్, దార్స్ షిఫా ఫోన్: 040 2457 6890 ఈ-మెయిల్: mescodc@hotmail.com ► గుల్షన్ మెడికేర్, అబిడ్స్ ఫోన్: 040 2461 2194 ఈ-మెయిల్: gulshanmedicarehyderabad@gmail.com ► ప్రీతి డయాగ్నొస్టిక్ సెంటర్, మెహిదీపట్నం ఫోన్: 040 6656 6785 ఈ-మెయిల్: preethi_kvk@yahoo.com ► సాలస్ హెల్త్ కేర్, హిమాయత్ నగర్ ఫోన్: 040 6625 7698 ఈ-మెయిల్: kasim@doctor.com ►ఎస్.కె. మెడికల్ సెంటర్, గోల్కొండ ఫోన్: 040 6558 7777 ఈ-మెయిల్: skmc7777@hotmail.com ► ఎస్.ఎల్. డయాగ్నోస్టిక్స్, ఖైరతాబాద్ ఫోన్: 040 2337 5235 ఈ-మెయిల్: sldpl@yahoo.co.in ► హైదరాబాద్ డయాగ్నొస్టిక్, సోమాజిగూడ ఫోన్: 040 2341 4051 ఈ-మెయిల్: hyderabaddiagnostic@gmail.com సేకరణ: మంద భీంరెడ్డి, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం +91 98494 22622 -
ఒకరి కోసం అందరు
సామల మురళి–డిచ్పల్లి, ఎన్.చంద్రశేఖర్–మోర్తాడ్ గల్ఫ్ దేశాల్లో ఐక్యతారాగం చాటుతున్నారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం రాంపూర్ వాసులు. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన ఆ గ్రామస్తులు తమ కష్టసుఖాలను పంచుకోవడం కోసం ఒక్కటయ్యారు. కష్టాల్లో ఉన్న తమ తోటి కార్మికులకు అండగా నిలువడానికి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. రాంపూర్ గల్ఫ్ అసోసియేషన్ పేరుతో మూడేళ్ల నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యూఏఈ, బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్ దేశాల్లో ఉపాధి పొందుతున్న రాంపూర్ వాసులకు ఎలాంటి కష్టం వచ్చినా అసోసియేషన్ సభ్యులు తాము ఉన్నామనే భరోసాను కల్పిస్తున్నారు. రాంపూర్ వాసులకు ప్రధాన వృత్తి వ్యవసాయమే అయినప్పటికీ సాగునీటి సౌకర్యం లేకపోవడం, బోరుబావుల్లో నీరు సమృద్ధిగా లేక పంటలు పండించే పరిస్థితి లేకపోయింది. దీంతో వలస బాటపట్టారు. గ్రామ జనాభా దాదాపు 6వేల వరకు ఉండగా అందులో సుమారు 1200 మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. సంస్థ ఆవిర్భావం ఇలా... గల్ఫ్ దేశాల్లో ఎంతో మంది తెలంగాణ కార్మికులు ఉన్నారు. వారి కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. అయితే ప్రత్యేకంగా రాంపూర్ వాసుల కోసం ప్రత్యేకంగా సంస్థ ఏర్పాటు చేసుకుని సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని భావించిన కర్రమొల్ల సాయన్న, మర్రికింది సంజీవ్, బుచ్చకోల్ల రవి, సక్కర్ల ఎర్రన్న, గూండ్ల బాలయ్యలు మూడేళ్ల కింద రాంపూర్ గల్ఫ్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న గ్రామస్తులందరినీ ఇందులో సభ్యులుగా చేర్చుకోవడం ద్వారా సంస్థను విస్తరించారు. ప్రస్తుతం సంస్థలో 300 మంది సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థలో చేరిన వారు సంస్థ నిర్ణయించిన మొత్తాన్ని సభ్యత్వ రుసుముగా చెల్లించాల్సి ఉంది. అలాగే ప్రతి నెలా కొంత మొత్తాన్ని జమచేసి సంస్థకు నిధుల లోటు లేకుండా చేశారు. గల్ఫ్ దేశాల్లో ఎక్కడ ఉన్నా సభ్యులు ఆన్లైన్లో సంస్థ పాలనా వ్యవహారాలు చూస్తున్న ప్రతినిధులతో సంప్రదింపులు జరుపు కొంటున్నారు. అలాగే తమ సభ్యత్వ రుసుం, ప్రతి నెలా జమ చేసే సొమ్మును సంస్థ ప్రతినిధులకు చేరేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే ఈ సంస్థ సభ్యులు ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి ఏ దేశంలో ఉన్నవారు ఆ దేశం లో సమావేశాలను నిర్వహించుకుంటున్నారు. అందరికీ అండగా... గల్ఫ్ దేశాల్లో ఉన్న రాంపూర్ వాసులకు ఏదైనా ప్రమాదం జరిగితే వైద్య చికిత్సల కోసం ఆర్థిక సహాయం అందించడం, వారిని స్వదేశానికి పంపడానికి అవసరమైన విమాన చార్జీలను చెల్లిస్తున్నారు. ఒక వేళ గల్ఫ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా వారికి కూడా సంస్థ ద్వారా సహాయం అందిస్తున్నారు. అలాగే ఏ కారణంతోనైనా గల్ఫ్ దేశాల్లో మరణిస్తే వారి మృత దేహాలను వీలైనంత తొందరగా స్వగ్రామానికి చేర్పించడం, అవసరమైన ఆర్థిక సహాయం అందించడం చేస్తున్నారు. మొదట గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారికి సహాయం అందించగా ఇప్పుడు ఆ సేవా కార్యక్రమాలను గ్రామానికి విస్తరించారు. గ్రామంలో హనుమాన్ మందిరాన్ని నిర్మించడానికి సంస్థ సభ్యులు ఎంతో కృషి చేశారు. అలాగే ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందించడానికి సంస్థ ఆర్థిక సహాయం చేస్తోంది. ప్రతి వేసవిలో చలివేంద్రాన్ని నిర్వహించి ప్రయాణికుల దాహార్తిని తీరుస్తున్నారు. పండుగల సందర్భంలో అన్నదానం నిర్వహిస్తున్నారు. అలాగే గ్రామంలోని వికలాంగులైన విద్యార్థులకు, పేద విద్యార్థులను ప్రోత్సహించడానికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు సంస్థ ద్వారా నగదు బహుమతులను అందిస్తున్నారు. ఇలా సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్న సంస్థ సభ్యులు ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాక గల్ఫ్ దేశాల్లో అవకాశం ఉన్న సమయంలో ఆటల పోటీలను నిర్వహించడం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వన భోజనాలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక వెబ్సైట్, సోషల్ మీడియాలో ఖాతాలు రాంపూర్ గల్ఫ్ అసోషియేషన్ సంస్థ సేవా కార్యక్రమాలను వివరించడంతో పాటు సహాయం పొం దగోరేవారి వివరాలను తెలుసుకోవడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అంతేగాక ఫేస్బుక్, వాట్సప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఖాతా లను తెరిచి సంస్థ కార్యక్రమాలను ఎప్పటికప్పు డు అందరికి తెలిసే విధంగా పోస్టుచేస్తున్నారు. ప్రవాసుల సేవలు అభినందనీయం గల్ఫ్ దేశాల్లో ఉన్న రాంపూర్ వాసులు అసోసియేషన్‌గా ఏర్పడి సేవా కార్యక్రమాలను విస్తరించడం అభినందనీయం. రాంపూర్ గ్రామానికి మంచి పేరు తీసుకువస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న కార్మికులకు సహాయం అందించడమే కాకుండా గ్రామంలోని పేదలకు అండగా నిలువడం ఎంతో బాగుంది. వారి సేవా కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాయి. – పాపాయి తిరుపతి, సర్పంచ్ రాంపూర్ అసోసియేషన్ ద్వారానే మృతదేహం ఇంటికి చేరింది మా తమ్ముడు దేవేందర్ ఏడాది క్రితం సౌదీలో మరణించాడు. మృతదేహాన్ని ఇంటికి చేర్చడంలో మా అసోసియేషన్ సభ్యులు ఎంతో శ్రమించారు. సంస్థ సభ్యులు చొరవ చూపడం వల్లనే పది రోజుల్లో మృతదేహం ఇంటికి చేరింది. అసోసియేషన్ సభ్యులు ఆర్థికసాయం కూడా చేశారు. వారు చేసిన మేలు మరచిపోలేం. – కిరణ్‌కుమార్, రాంపూర్ వాసి -
ఎంబసీలను బలోపేతం చేయాలి
హైదరాబాద్: విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రిటైర్డ్ అంబాసిడర్ డాక్టర్ బి.ఎం. వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎమిగ్రేషన్ (విదేశీ వలసల) ముసాయిదా బిల్లు – 2019 పై ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరిన నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. విదేశీ వలసలకు సంబందించి నూతన చట్టం తీసుకువచ్చే ప్రయత్నం హర్షణీయమన్నారు. 35 ఏళ్ల క్రితం భారతదేశం నుంచి కార్మికులు పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న సందర్భంలో ఎమిగ్రేషన్ యాక్ట్ – 1983 విదేశీ వలసల చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చారని, సమకాలీన వలసల పోకడల సమస్యలను పరిష్కరించేందుకు ఈ చట్టానికి కొన్ని అంతర్గత పరిమితులను చేర్చారని అన్నారు. అప్పటికాలానికి అనుగుణంగా పరిమిత వనరుల ప్రకారం ఎమిగ్రేషన్ యాక్ట్ 1983 పనిచేసిందని అన్నారు. వలస కార్మికుల రక్షణ, సంక్షేమ కార్యక్రమాలు ఆశించిన మేరకు అమలు చేయకపోవటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. నేటి పరిస్థితులకు అనుగుణంగా, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని నూతన ముసాయిదా బిల్లును తీసుకురావలనుకోవటం మంచి పరిణామమని ఆయన చెప్పారు. గల్ఫ్ దేశాల్లో రాయబార కార్యాలయాల్లో తెలుగు తెలిసిన అధికారులను నియమించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విదేశీ రాయబార కార్యాలయాల్లో సరైన సిబ్బంది, నిధులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని సమకూర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ఎంబసీలను పటిష్టం చేçసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలని కోరారు. కార్మికుల రక్షణ, సంక్షేమం ప్రభుత్వ బాధ్యత హైకోర్టు న్యాయవాది రచనారెడ్డి మాట్లాడుతూ.. విదేశాలకు వలస వెళ్తున్న కార్మికుల రక్షణ, సంక్షేమాన్ని భారత ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని నియామకాలు ఎమిగ్రేషన్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారానే జరగాలని, లైసెన్స్‌లేని ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. నేపాల్, శ్రీలంక తరహాలో కార్మికుల్లో నైపుణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, కార్మికుల నైపుణ్యతకు తగినట్లుగా నియామకాలు జరగాలన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా తీసుకువచ్చే ముసాయిదా బిల్లులో వలస కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు పటిష్టమైన నిబంధనలు రూపొందించాలని కోరారు. కొత్త బిల్లు గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టిని పెట్టాల్సిన అవసరముందన్నారు. మైగ్రంట్స్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు నరసింహనాయుడు మాట్లాడుతూ.. విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులతో పాటు ఉద్యోగం కోసం వెళ్లే భారతీయులందరు తమ వివరాలను ఎంబసీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. రిక్రూటింగ్ ఏజెన్సీలు, ఎడ్యుకేషన్ కాన్సల్టెన్సీలు తప్ప నిసరిగా లైసెన్స్‌లు తీసుకోవాలన్నారు. ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సురేంద్రనాథ్ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా, చట్టవిరుద్ధమైన రిక్రూట్మెంట్, మత్తు మందుల రవాణా, నేరస్తులకు అశ్రయం ఇవ్వటం, మహిళలు, పిల్లలను ఇబ్బందులు పెట్టడం లాంటి విషయాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆస్ట్రేలియా ఎన్నారై ఆదిరెడ్డి యార మాట్లాడుతూ విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల పట్ల భారత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఆస్ట్రేలియాకు కొత్తగా వచ్చిన భారతీయ విద్యార్థులకు తమ సంఘాలు సహాయకారిగా ఉంటున్నాయని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ రిటైర్డ్ అధికారి మహ్మద్ ఇబ్రహీంఖాన్, సిస్టర్ లిస్సీజోసెఫ్, మురళిధర్ దేశ్‌పాండే, ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, స్వదేశ్ పరికిపండ్ల, చాంద్‌పాషా, గొడ్డేటి గంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
కోటి ఆశలు..
సాక్షి నెట్వర్క్: ముందస్తు ఎన్నికల్లో విజయదుందుభి మోగించి మళ్లీ అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడైనా తమ సమస్యలపై దృష్టి సారించాలని గల్ఫ్ కార్మికులు కోరుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ వలస కార్మికుల సంక్షేమంపై పలు హామీలు ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అంతగా దృష్టి పెట్టలేదనే విమర్శలు ఉన్నాయి. గత బడ్జెట్లో ఎన్ఆర్ఐ సెల్‌కు రూ.100 కోట్లు కేటాయించినప్పటికీ వాటి వినియోగంపై మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. గల్ఫ్ వలస కార్మికుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర సచివాలయంలోని ఎన్ఆర్ఐ సెల్‌ను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు. ఎన్ఆర్ఐ సెల్లో సిబ్బంది అసలే లేకపోవడంతో తమ వినతులు బుట్టదాఖలవుతున్నాయని కార్మికులు చెబుతున్నారు. కార్మికులకు వారు ఎంపిక చేసుకున్న రంగంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించడం వల్ల గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. అలాగే ఏజెంట్ల మోసాలపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి బాధితులకు సరైన న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతూ మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సూచిస్తున్నారు. కేరళ తరహా విధానం అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గల్ఫ్‌లో నష్టపోయి సొంతూళ్లలో స్థిరపడాలనుకునే వారికి రాయితీ రుణాలు ఇప్పించాలనే డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది. ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి గల్ఫ్ వలస కార్మికుల సంఖ్య అధికంగా ఉన్న దృష్ట్యా రాష్ట్ర మంత్రి వర్గంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. కేరళ తరహా విధానం అమలు చేస్తే వలస కార్మికులకు మేలు జరుగుతుంది. గల్ఫ్ వలసల వల్ల లబ్ధి పొందిన వారికంటే నష్టపోయిన వారి సంఖ్యనే అధికంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. – సుందర ఉపాసన, తెలంగాణ గల్ఫ్ సంక్షేమ, సాంస్కృతిక సంస్థ ప్రతినిధి గల్ఫ్ కార్మికులకు అండగా ఉండాలి తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు అండగా ఉండాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే గల్ఫ్ బాధితులకు న్యాయం జరిగింది. ఆ తరువాత కార్మికుల గురించి ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. కొత్త ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పథకాలను అమలు చేయాల్సి ఉంది. కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలల్లో చదువుకోవడానికి అవకాశం కల్పించాలి. – షేక్ చాంద్‌పాషా, గల్ఫ్ రిటర్నింగ్ మెంబర్స్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మానవతా దృక్పథంతో స్పందించాలి గల్ఫ్ వల్ల నష్టపోయిన వారి పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలి. ఎంతో మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి లేక సొంతూళ్లకు చేరుతున్నారు. అలాంటి వారికి స్వయం ఉపాధి కోసం రాయితీపై రుణాలు ఇప్పించాలి. బతుకుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గల్ఫ్‌లో మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల నష్ట పరిహారం అందించాలి. – శివన్నోల్ల రాజు, కువైట్ ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలి కేరళ తరహాలో ఎన్ఆర్ఐ (గల్ఫ్) పాలసీ అమలు చేయాలి. వలస వెళ్లి ఐదేళ్లు పూర్తి చేసుకున్న గల్ఫ్ కార్మికులకు ఆసరా పింఛన్ ఇవ్వాలి. రైతు బీమా తరçహాలో గల్ఫ్ బీమా అమలు చేసి రూ.5 లక్షల బీమా అందించాలి. గల్ఫ్ దేశాల్లోని భారత ఎంబసీలో అన్ని భాషలకు సంబంధించిన అధికారులను నియమించాలి. గల్ఫ్ కార్మికులకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేయాలి. – ఎండీ.హబీబ్, గల్ఫ్ కార్మికుడు, వీవీరావుపేట ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఏటా బడ్జెట్లో రూ.500 కోట్లు పెడతామని, గల్ఫ్‌లో మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షల నష్ట పరిహారం ఇస్తామని, ప్రమాదవశాత్తు గాయపడిన వారిని స్వదేశానికి తీసుకువచ్చి నాణ్యమైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్ దేశాల్లో న్యాయ సహాయం అందించేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ అమలు చేయలేదు. ఇప్పుడైనా టీఆర్ఎస్ సర్కార్ గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించాలి. వీటితో పాటు 50 ఏళ్లు దాటిన గల్ఫ్ కార్మికులకు పింఛన్ ఇవ్వాలి. వలస కార్మికులకు స్వగ్రామాల్లో రేషన్ కార్డులు తొలగించరాదు. – గుగ్గిల్ల రవిగౌడ్, మేడిపల్లి, జగిత్యాల జిల్లా -
గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ వరాలజల్లు
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజులలో సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. ఇటీవల ఏఐసీసీ అధ్యక్షలు రాహుల్ గాంధీ, కామారెడ్డి సభలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారని గుర్తు చేశారు. కుటుంబ సభ్యులను, కన్న ఊరును వదిలి కానరాని దేశాలకు తరలివెళ్ళి ఏళ్లతరబడిగా రెక్కలు ముక్కలు చేసుకుంటున్న10 లక్షల మంది తెలంగాణ వలస కార్మికుల కుటుంబాల్లో ఎన్నో ఆవేదనలు, కష్టాలు, కన్నీళ్లు, సంక్షోభాలు ఉన్నాయని పేర్కొన్నారు. అరబ్ గల్ఫ్ దేశాలయిన సౌదీ అరేబియా, యుఏఇ, ఒమాన్, బహరేన్, కువైట్, ఖతార్ లతో పాటు మలేసియా, సింగపూర్ తదితర దేశాలలో పని చేస్తున్న వలసకార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బొంబాయి - దుబాయి - బొగ్గుబాయి అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రవాస భారతీయుల పాత్ర ముఖ్యముగా గల్ఫ్ దేశాలలోని వలసకార్మికుల పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వలస కార్మికులను మర్చిపోయిందని గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో దాదాపు 900 కు పైగా తెలంగాణ వలసజీవులు గల్ఫ్ లో అసువులుబాశారని గల్ఫ్ మృతుల కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదని ఆయన విమర్శించారు. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో వరుసగా నాలుగు బడ్జెట్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. ఎంతో ఒత్తిడి తర్వాత ఐదవ బడ్జెట్ 2018-19 ఆర్ధిక సంవత్సరానికి రూ.100 కోట్లు కేటాయించారని, కానీ ఈ డబ్బును ఎలా ఖర్చు చేయాలో నిర్ణయం చేయకుండా, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం గల్ఫ్ బిడ్డలను దారుణంగా మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న10 లక్షల మంది తెలంగాణ ప్రవాసీలు ప్రతినెలా 1500 కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం మాతృదేశానికి పంపిస్తూ రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పడుతున్నారన్నారు. ఈ విధంగా గల్ఫ్ ఎన్నారైలు తెలంగాణాకు ఏటా రూ. 18 వేల కోట్లు పంపిస్తున్నారని, పరోక్షంగా 5-6 శాతం స్థానిక పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. ఒక వెయ్యి కోట్ల ఆదాయం పొందుతున్నదని తెలిపారు. ఈ నాలుగేళ్లలో తెలంగాణ గల్ఫ్ కార్మికులు ఎడారిలో ఎర్రటి ఎండలో తమ చెమటను చిందించి పంపిన విదేశీమారక ద్రవ్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ. నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని సంపాదించుకున్నదని ఆయన వివరించారు. గల్ఫ్ లో ఉన్న రైతులకు రూ. 5 లక్షల బీమా : బతుకుదెరువుకోసం గల్ఫ్ దేశాల బాటపట్టిన సుమారు ఒకలక్ష మంది తెలంగాణ చిన్న, సన్నకారు రైతులకు 'రైతుబంధు' పథకం వర్తింపచేయాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని ఉత్తమ్ తెలిపారు. వీరిలో చాలా మంది వ్యవసాయం దెబ్బతిని, బోర్లు తవ్వించి అప్పులపాలై పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లినవారేనని, భూమిని నమ్ముకుని బతికిన రైతులు వ్యవసాయం దెబ్బతినడం మూలంగానే విదేశాలకు వెళ్లారని స్వదేశంలో ఉన్న రైతులతో సమానంగా విదేశాలలో ఉన్న రైతులకు ఎల్ఐసి వారి రూ. 5 లక్షల గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ (బృంద జీవిత బీమా) ను వర్తింపచేస్తామని హామీ ఇచ్చారు. ప్రవాసంలో ఉన్న రైతులకు కూడా అన్నిరకాల 'రైతుబంధు' ప్రయోజనాలు కల్పించడానికి ఒక విధానం రూపొందిస్తామని, ఎన్నారై రైతుల వ్యవహారాలను చూడటానికి వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ హామీలు : ► కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులలో సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటిస్తాం ► గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధికి ప్రతి ఏటా రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాము. ► గల్ఫ్ లో మృతి చెందిన వలసకార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) చేస్తాము. (గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన ఒక సంవత్సరంలోపు ఇక్కడ మరణించిన వారికి కూడా వర్తింపు) ► గల్ఫ్ కార్మికుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము. ► గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న వలసకార్మికులకు, ఎన్నారైలకు న్యాయ సహాయం చేస్తాము. ► గల్ఫ్ వలసకార్మికుల పేర్లను రేషన్ కార్డులలో కొనసాగిస్తాము. ఆరోగ్యశ్రీ పథకాన్ని గల్ఫ్ కార్మికులకు వర్తింపజేస్తాము. ► గల్ఫ్ వలసకార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ లతో కూడిన "ప్రవాసీ యోగక్షేమ" అనే పథకాని ప్రవేశపెడతాము. ► ఎన్నారైలు, గల్ఫ్ కార్మికులు స్వదేశానికి వాపస్ వచ్చినంక పునరావాసం, పునరేకీకరణ కొరకు ఆర్ధిక సహాయం చేస్తాము. ► మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి, రిక్రూటింగ్ వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేస్తాము. అవగాహన సదస్సులు నిర్వహిస్తాము. ► గల్ఫ్ కు వెళ్ళడానికి అవసరమైన 'గమ్కా' మెడికల్ చెకప్ చార్జీలను (రూ.4 నుండి 5 వేలు) ప్రభుత్వం ద్వారా రీయింబర్సుమెంటు చేస్తాము. ► గల్ఫ్ కు ఉద్యోగానికి వెళ్ళడానికి చట్టబద్దంగా రిక్రూటింగ్ ఏజెన్సీలకు చెల్లించాల్సిన సర్వీస్ చార్జీలను, ఇతర ఖర్చులను బ్యాంకుల ద్వారా రుణాల ఇప్పిస్తాము. ► ప్రతి జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఎన్ఆర్ఐ విభాగాలను ఏర్పాటు చేస్తాము. ► రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో వలసలపై అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేస్తాము. ► నేషనల్ అకాడమి ఆఫ్ కన్ స్ట్రక్షన్ (న్యాక్) కేంద్రాలను బలోపేతం చేసి, నైపుణ్య శిక్షణ కేంద్రాలను ప్రతి సబ్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేస్తాము. ► కేరళ, పంజాబ్ రాష్ట్రాలు నిర్మాణాత్మకమైన విధి విధానాలతో గల్ఫ్ కార్మికులకు ఆసరాగా ఉంటూ సామాజిక భద్రత కల్పిస్తున్నారు తెలంగాణా ప్రభుత్వం కూడా విస్తృత ఆధ్యయనం చేసి ఆయా విది విధానాలను అమలు చేస్తాము. ► ప్రతి ఏటా ప్రవాసి తెలంగాణ దివస్ అధికారికంగా నిర్వహిస్తాము. ► గల్ఫ్ దేశాల్లోని ప్రవాసీ తెలంగాణ సంస్థలను, వ్యక్తులను గుర్తించి, అనుసంధానపరచి ప్రోత్సహించి సమస్యల పరిష్కారంలో వారిని భాగస్వాములను చేస్తాము. ► హైదరాబాద్ లో సౌదీ కాన్సులేట్, యుఏఇ కాన్సులేట్ ల ఏర్పాటుకు ప్రయత్నిస్తాము. ► ఎంబసీలలో తెలుగు అధికారులను నియమించేలా ప్రయత్నిస్తాము. -
ఆ పెళ్లి ఖర్చు రూ.55 కోట్లు!
తిరువనంతపురం : పెళ్లిళ్లకు అయ్యే ఖర్చును నియంత్రించాలని కేరళ మహిళ కమిషన్ ఓ వైపు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే...మరోవైపు కేరళకు చెందిన ఎన్నారై తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. అందుకోసం ఆయన అక్షరాల రూ. 55 కోట్లు ఖర్చు పెడుతున్నారు. పెళ్లి మండపం కోసమే 20 కోట్లు ఖర్చు పెట్టారంటే మిగతా వాటికి ఎంత రేంజ్లో ఖర్చు చేస్తున్నారో ఊహించుకోండి మరి.... వివరాల్లోకి వెళితే... కేరళ ఎన్నారై రవి పిళ్లై... తన కుమార్తె డాకర్ట్ అరతీని కొచ్చికి చెందిన డాక్టర్ ఆదిత్య విష్ణుకు ఇచ్చి గురువారం వివాహం జరిపిస్తున్నారు. తన గారాల పట్టి వివాహ వేడుకకు దేశంలోని ప్రముఖులతోపాటు ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల నుంచి ప్రభుత్వాధినేతలను ఆయన ఆహ్వానం పలికారు. వీఐపీలు ఈ వేడుక వద్దకు తరలించేందుకు రెండు ఛార్టర్డ్ ఫ్లైట్లు తిరువనంతపురం ఎయిర్ పోర్ట్‌లో ఇప్పటికే సిద్ధంగా ఉంచారు. అంతేనా 250 మంది పోలీసులు.. 350 మంది ప్రైవేట్ భద్రత సిబ్బంది ..వారి భద్రతను పర్యవేక్షించనున్నారు. ఇక ఈ వివాహ వేడుక సందర్భంగా మలయాళ చిత్ర హీరోయిన్లు శోభన, మంజు వారియర్‌తో డాన్స్ ప్రోగ్రాములు. స్టిఫెన్ దేవసే ఆధర్వంలో మ్యూజికల్ షోను కూడా ఏర్పాటు చేశారు. ఇక కళ్యాణ మండపం కోసం ఏకంగా టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాహుబలి చిత్రానికి సంబంధించిన 'సెట్స్' ను వేయించారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌తో బాహుబలి తరహాలో సెట్టింగ్స్ వేయించి మరీ వివాహం జరిపిస్తున్నారు. ఇందుకోసం ఎనిమిది ఎకరాలలో రూ. 20 కోట్లు ఖర్చ పెట్టి మరీ ఈ సెట్టింగ్స్ వేశారు. కేరళకు చెందిన రవి పిళ్లై గల్ఫ్‌లో ఆర్పీ గ్రూప్‌ని నిర్వహిస్తున్నారు. ఈ గ్రూప్ ఆధ్వరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, గనులు, విద్యా, నిర్మాణ రంగాల్లో వ్యాపారం సాగుతుంది. ఆర్పీ గ్రూప్‌కు దేశవ్యాప్తంగా 26 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలలో 80 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన సర్వేలో కేరళ ఎన్నారైల్లో అత్యధిక సంపన్నుల జాబితాలో రవి పిళ్లై మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.