గల్ఫ్ కార్మికుల విషయంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలపై వలస జీవుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటున్న వారిని ఇంటి బాట పట్టించి రాష్ట్ర రాజధాని పరిసరాల్లో ఉపాధి చూపుతామని, ఇందుకు తాను స్వయంగా రంగంలోకి దిగుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించిన విషయం విదితమే. గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించడం ఆహా్వనించదగ్గ పరిణామమేనని, అయితే వలస కార్మికులను స్వగ్రామాలకు రప్పించి ఇక్కడే ఉపాధి చూపుతామనే అంశంపై భిన్నాబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న కార్మికులు ఎందరు అనేది ప్రభుత్వం వద్ద నిర్ధిష్టమైన సంఖ్య లేదని, అది తేలకపోతే ఉపాధి అవకాశాలు ఎలా కలి్పస్తారని పలువురు ప్రశి్నస్తున్నారు. వలస కార్మికులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న ప్రవాసీ సంక్షేమ విధానం(ఎన్‌ఆర్‌ఐ పాలసీ) అమలు కాలేదని, కార్మికుల సంక్షేమానికి కార్యాచరణ చేపట్టాలని పలు స్వచ్ఛంద సంఘాలు సూచిస్తున్నాయి.
గత హామీలను అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై పాలసీ అమలు చేస్తే లక్షల మంది గల్ఫ్ కారి్మకుల బతుకులు బాగుపడుతాయి. గల్ఫ్ కారి్మకుల సంక్షేమానికి గతంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుంది. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి వివరాలు ప్రభుత్వం వద్ద, కారి్మకుల ఊళ్లలోని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఉండాలి. మోస పూరిత ఏజెంట్ల వ్యవస్థను తుడిచిపెట్టాలి. బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లి నష్టపోయిన, మోసపోయిన వారికి ప్రభుత్వం వారి స్వగ్రామాల్లో ఉపాధి చూపాలి. వారికి పునరేకీకరణ కల్పించి మనోధైర్యం నింపాలి.
గల్ఫ్ దేశాల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు ఆరి్థక సాయం చేయాలి. అవయవాలు కోల్పోయిన కారి్మకులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. భారత రాయబార కార్యాలయంలో తెలుగు మాట్లాడే అధికారులను ఏర్పాటు చేస్తే వలస కార్మికులకు సమస్యలు చెప్పుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. తెలుగు భాష వచ్చిన అధికారులు లేకపోవడంతో కార్మికులు సమస్యలు చెప్పుకోలేక కూడా నష్టపోతున్నారు. జీతాలు ఇవ్వని గల్ఫ్ కంపనీలు యజమానుల నుంచి వేతాలు రాబట్టడానికి విదేశాంగ శాఖ ద్వారా చర్యలు చేపట్టాలి. గల్ఫ్‌కు వెళ్లిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారు. వారి రేషన్‌కార్డుల కూడా కట్ చేస్తున్నారు. ఇలా తొలగించడం వల్ల వలసజీవులు ఎంతో నష్టపోతున్నారు. గల్ఫ్ నుంచి తిరిగివచ్చి ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి వారి నైపుణ్యం ప్రకారం వారి జిల్లాల్లో ఉద్యోగం కలి్పంచాలి.
ఆచరణలో చూపితేనే నమ్మకం
ఆయన ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లోని వివిధ దేశాలకు వెళ్లాడు. అక్కడ దశాబ్దం పాటు పనిచేసి తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. అక్కడి కారి్మకుల కష్టాలపై అవగాహన ఉన్న ఆయన.. సుఖీభవ సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా వారికి సేవలందిస్తున్నాడు. ఆయనే బొక్కెనపల్లి నాగరాజు. గల్ఫ్ కారి్మకుల సంక్షేమం అంశాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చర్చకు తీసుకురావడం.. కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్‌ఆర్‌ఐ పాలసీని అధ్యయనం చేయడానికి త్వరలోనే ఓ బృందాన్ని అక్కడికి పంపుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన ఈ నేపథ్యంలో గల్ఫ్ కారి్మకుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై నాగరాజు‘సాక్షి’కి తెలిపారు.
గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి కేరళలో అమలు చేస్తున్న విధానంపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపనుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం. తెలంగాణ ఏర్పడక ముందు ఉద్యమంలో గల్ఫ్ కారి్మకులకు టీఆర్‌ఎస్ ఎన్నో ఆశలు కల్పించింది. రాష్ట్రం ఆవిర్బవించి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్‌ఆర్‌ఐ శాఖను పర్యవేక్షించిన మంత్రి కేటీఆర్ గల్ఫ్ కార్మికుల కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఆ సమయంలో సలహాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. కానీ, ఇంతవరకు వాటి అమలు దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం కేరళలో అమలు చేస్తున్న విధానంపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక బృందాన్ని పంపాలని నిర్ణయించిన ప్రభుత్వం.. దానిని ఇక్కడ అమలు చేయడానికి చిత్తశుద్ధితో వ్యవహరించాలి. గతంలో మాదిరిగానే మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపాలి. ముఖ్యంగా ప్రభుత్వం గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలి.
కేంద్ర ప్రభుత్వం ప్రవాస భారత బీమా యోజన పథకం ద్వారా గల్ఫ్ దేశాల్లో ప్రమాదంలో మరణించిన కారి్మకుల కుటుంబాలకు రూ.10లక్షల ఆరి్థక సహాయం చేస్తుంది. కారి్మకులు ఎలా మరణించినా.. వారి కుటుంబానికి రూ.పది లక్షల ఆర్థిక సహాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీని రూపొందించాలి. గల్ప్‌లో చనిపోయిన వారి మృతదేహాలు స్వగ్రామాలకు చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని పరిష్కరించాలి. ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి. దీని ద్వారా గల్ఫ్‌లో ఉపాధి కోల్పోయి ఇక్కడకు వచి్చన కారి్మకులు స్వయం ఉపాధి పొందడానికి తగిన శిక్షణ ఇచ్చి రుణాలు అందజేయాలి. గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారిలో ఎక్కువ మందికి వృత్తి నైపుణ్యత లేకపోవడం వల్ల కూలీలుగా తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. ప్రభుత్వం వివిధ వృత్తుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి పంపితే అధిక వేతనాలు పొందడానికి అవకాశముంటుంది.
వలసలు ఆపడం, కార్మికులను రప్పించడం కష్టమే..
గల్ఫ్ దేశాలకు వలసలను ఆపడం, అక్కడ ఉన్న మన కార్మికులను రప్పించడం కష్టమేనని జగిత్యాలకు చెందిన ఓ రిక్రూటింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు, గల్ఫ్ రిటర్నీ అయిన చిట్ల రమణ ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు. మన దగ్గర వ్యవసాయంలో, ఇతర పనుల్లో యాంత్రీకరణ జరగడంతో స్థానికంగా ఉపాధి తగ్గిపోయింది. గతంలో కార్మికులకు వేతనం చేతికి అందించేవారు. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో విధానం మారిపోయింది. కార్మికుల ఖాతాల్లోనే వేతనాలను జమ చేస్తున్నారు. అందువల్ల కార్మికులను మోసగించే చర్యలకు బ్రేక్ పడింది. గల్ఫ్‌కు చట్టబద్ధంగా వెళ్తే ఎలాంటి ఇబ్బందీ లేదు.
Comments
Please login to add a commentAdd a comment