
ఆగిరిపల్లి: ఎన్నో ఆశలతో సౌదీ వెళ్లిన తాను తినటానికి తిండి లేక నరకయాతన అనుభవిస్తున్నానని, కాపాడాలంటూ ఆగిరిపల్లికి చెందిన షేక్ జుబేర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
ఆగిరిపల్లికి చెందిన సలీమునిస్సా కుమారుడు జుబేర్ మూడు నెలల క్రితం బతుకు దెరువు కోసం సౌదీ అరేబియాలోని రియాదు నగరంలో ఒక వ్యక్తి దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నానని మూడు నెలల నుంచి యజమాని జీతం ఇవ్వడం లేదని, జీతం అడిగితే దౌర్జన్యంగా పాస్‌పోర్ట్ లాక్కుని గదిలో బంధించి రక్తం వచ్చేలా కొట్టాడని, యజమానికి తెలియకుండా పారిపోయి తప్పించుకున్నానని, తిండి, నీరు లేక అల్లాడిపోతున్నానని చాలా భయంగా ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి తనను స్వదేశానికి తీసుకురావాలని వీడియోలో కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment