
సాక్షి, అలమరావతి : విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రెండో దశ ‘వందే భారత్ మిషన్’లో భాగంగా కువైట్ నుంచి బయలుదేరిన విమానం గన్నవరంకు చేరింది. మొత్తం 145 మంది మహిళలు గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. అమ్నెస్టీలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీరంతా కువైట్ నుంచి గన్నవరం చేరారు. వీరిలో వైఎస్ఆర్ కడప, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన మహిళలు ఎక్కుగా ఉన్నారు. వీరందరినీ థర్మల్ పరీక్షలు తర్వాత నూజివీడులో ఏర్పాటు చేసిన క్వారెంటైన్‌కు తరలించాలని అధికారులు నిర్ణయించారు.
శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కువైట్ నుంచి మరో విమానం రానుందని ఏపీ ఎన్ఆర్‌టీ ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్ తెలిపారు. వారి వసతి కోసం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కాగా ఉపాధి కోసం కువైట్ వెళ్లి లాక్‌డౌన్ కారణంగా ఆదేశంలో చిక్కుకున్న ఏపీ వాసులను స్వరాష్ట్రానికి తీసురావడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కేంద్ర విదేశాంగశాఖకు సీఎం లేఖ రాశారు. ఏపీ వాసులను తరలించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. సీఎం జగన్ లేఖపై స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ వెంటనే ఏపీ వాసులను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment