ganna varam
-
గన్నవరంలో హైటెన్షన్
-
కువైట్ నుంచి గన్నవరం చేరుకున్న విమానం
సాక్షి, అలమరావతి : విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రెండో దశ ‘వందే భారత్ మిషన్’లో భాగంగా కువైట్ నుంచి బయలుదేరిన విమానం గన్నవరంకు చేరింది. మొత్తం 145 మంది మహిళలు గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. అమ్నెస్టీలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీరంతా కువైట్ నుంచి గన్నవరం చేరారు. వీరిలో వైఎస్ఆర్ కడప, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన మహిళలు ఎక్కుగా ఉన్నారు. వీరందరినీ థర్మల్ పరీక్షలు తర్వాత నూజివీడులో ఏర్పాటు చేసిన క్వారెంటైన్‌కు తరలించాలని అధికారులు నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కువైట్ నుంచి మరో విమానం రానుందని ఏపీ ఎన్ఆర్టీ ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్ తెలిపారు. వారి వసతి కోసం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కాగా ఉపాధి కోసం కువైట్ వెళ్లి లాక్డౌన్ కారణంగా ఆదేశంలో చిక్కుకున్న ఏపీ వాసులను స్వరాష్ట్రానికి తీసురావడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కేంద్ర విదేశాంగశాఖకు సీఎం లేఖ రాశారు. ఏపీ వాసులను తరలించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. సీఎం జగన్ లేఖపై స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ వెంటనే ఏపీ వాసులను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. -
‘వర్గపోరు పార్టీలో తేల్చుకోండి’
సాక్షి, కృష్ణా : గన్నవరం మండలం ముస్తాబాద్ వద్ద రైతులు ఆదివారం టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చెప్పట్టారు. గొల్లపూడి పంపింగ్ స్కీమ్ నుంచి వెంటనే రైతులకు నీరు అందించాలంటూ ధర్నా నిర్వహించారు. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రక్క నియోజవర్గమైన మైలవరం రైతులకు నీరు అందిస్తూ.. గన్నవరం రైతులకు నీరు ఇవ్వకపోవడం అన్యాయమని రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతుల ధర్నాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం నియోజవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో ఉన్న వర్గపోరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి ఉమామహేశ్వరరావుకి-ఎమ్మెల్యే వంశీమోహన్ మధ్య విభేదాలు ఉండే పార్టీలో తేల్చుకోవాలని అన్నారు. టీడీపీ నేతలు ప్రతిపక్ష నాయకులపై విమర్శలు మాని రైతుల గురించి ఆలోచించాలని వ్యాఖ్యానించారు. -
కన్హయ్య రాక.. బీజేపీ కాక
కృష్ణా : జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ రాకతో ఐవీ ప్యాలెస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న కన్హయ్య అక్కడ నుంచి నేరుగా ఐవీ ప్యాలెస్ సభస్థలికి చేరుకున్నారు. అయితే దేశ ద్రోహం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కన్హయ్య రాకను బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. సభా ప్రాంగణంలోకి వెళ్లేందుకు పలువురు బీజేపీ నేతలు యత్నించారు. ఈ సందర్భంగా బీజేపీ, సీపీఐ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా హైదరాబాద్ లో ఈ రోజు(గురువారం) ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కన్హయ్య కుమార్ పాల్గొన్న సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. 'గోరక్షాదళ్'కు చెందిన ఇద్దరు యువకులు ఒక్కసారిగా లేచి.. 'భారత్ మాతాకీ జై' అంటూ చెప్పులు విసిరారు. ఈలోపు హాల్లో ఉన్న ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ఆ ఇద్దరినీ పట్టుకుని చితక్కొట్టారు. ఆ ఇద్దరూ మీడియా ఉన్నవైపు రావడంతో.. మీడియా కెమెరా స్టాండ్లు తీసుకుని వాటితో వాళ్లను కొట్టారు. ఈ ప్రయత్నంలో వీడియో కెమెరాలు కూడా కొన్ని పగిలాయి. ఈలోపు అక్కడే ఉన్న పోలీసులు వచ్చి వాళ్లిద్దరినీ బయటకు తీసుకెళ్లి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.