
యార్లగడ్డ వెంకట్రావు (ఫైల్ పోటో)
సాక్షి, కృష్ణా : గన్నవరం మండలం ముస్తాబాద్ వద్ద రైతులు ఆదివారం టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చెప్పట్టారు. గొల్లపూడి పంపింగ్ స్కీమ్ నుంచి వెంటనే రైతులకు నీరు అందించాలంటూ ధర్నా నిర్వహించారు. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రక్క నియోజవర్గమైన మైలవరం రైతులకు నీరు అందిస్తూ.. గన్నవరం రైతులకు నీరు ఇవ్వకపోవడం అన్యాయమని రైతులు ఆందోళన చేస్తున్నారు.
రైతుల ధర్నాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం నియోజవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో ఉన్న వర్గపోరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి ఉమామహేశ్వరరావుకి-ఎమ్మెల్యే వంశీమోహన్ మధ్య విభేదాలు ఉండే పార్టీలో తేల్చుకోవాలని అన్నారు. టీడీపీ నేతలు ప్రతిపక్ష నాయకులపై విమర్శలు మాని రైతుల గురించి ఆలోచించాలని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment