deveneni uma maheswara rao
-
‘వర్గపోరు పార్టీలో తేల్చుకోండి’
సాక్షి, కృష్ణా : గన్నవరం మండలం ముస్తాబాద్ వద్ద రైతులు ఆదివారం టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చెప్పట్టారు. గొల్లపూడి పంపింగ్ స్కీమ్ నుంచి వెంటనే రైతులకు నీరు అందించాలంటూ ధర్నా నిర్వహించారు. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రక్క నియోజవర్గమైన మైలవరం రైతులకు నీరు అందిస్తూ.. గన్నవరం రైతులకు నీరు ఇవ్వకపోవడం అన్యాయమని రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతుల ధర్నాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం నియోజవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో ఉన్న వర్గపోరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి ఉమామహేశ్వరరావుకి-ఎమ్మెల్యే వంశీమోహన్ మధ్య విభేదాలు ఉండే పార్టీలో తేల్చుకోవాలని అన్నారు. టీడీపీ నేతలు ప్రతిపక్ష నాయకులపై విమర్శలు మాని రైతుల గురించి ఆలోచించాలని వ్యాఖ్యానించారు. -
మంత్రి జోక్యం.. హైకోర్టును ఆశ్రయించిన ప్రేమజంట
సాక్షి, అమరావతి : పోలీసులు వేధిస్తున్నారంటూ కృష్ణా జిల్లాకు చెందిన ప్రేమజంట మంగళవారం ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. నందిగామకు చెందిన సురేష్, శ్రీజ కులాంతర వివాహం చేసుకున్నారు, వీరి వివాహానికి శ్రీజ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్రీజ మేనమామ కంచికచర్ల టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు కావడంతో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోక్యం చేసుకుంటునట్లు ప్రేమజంట ఆరోపిస్తోంది. ఇద్దరిని విడగొట్టాలని దేవినేని ఒత్తిడి తెస్తున్నారని, శ్రీజను ఇంట్లో బంధించి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారని సురేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు సీఎస్, డీజీపీ, కలెక్టర్, ఎస్పీతో పాటు తొమ్మిది మందికి నోటీసులు జారీ చేసింది. కేసును వెనక్కి తీసుకోవాలని నందిగామ డీఎస్సీ రాదేశ్ మురళి, ఏఎస్ఐ నాగేశ్వరరావు వేధింపులకు పాల్పడుతున్నారని ప్రేమజంట తెలిపారు. -
ఇంద్రకీలాద్రిపై ఘనంగా రాజగోపురం ప్రారంభం
సాక్షి, విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రిపై నూతనంగా నిర్మించిన రాజగోపురం, మల్లికార్జున మహామండపాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అంతకు ముందుకు శృంగేరీ శివగంగ శారదా పీఠాధిపతి శ్రీ పురుషోత్తమ భారతీ స్వామీజీ ఆధ్వర్యంలో రాజగోపురంపై నవ స్వర్ణ కలశాల ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం భారతీస్వామి అనుగ్రహభాషణం చేశారు. మంత్రులు మాట్లాడుతూ... ఇంద్రకీలాద్రి దిగువ నుంచి రాజగోపురానికి చేరుకోవడానికి కావాల్సిన ర్యాంపుల నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. అన్నదాన భవనంపై నూతనంగా నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను మంత్రి దేవినేని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, నగర మేయర్ కోనేరు శ్రీధర్‌లతోపాటు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.ఎస్.వి.ప్రసాద్, కమిషనర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.