
కువైట్ సిటీ: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం (జూన్12) తెల్లవారుజామున 3 గంటలకు సదరన్ అహ్మదిలోని మంగాఫ్‌లో ఉన్న ఆరు ఫ్లోర్‌ల అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. అపార్ట్‌మెంట్‌లోని ఒక గదిలో ఉన్న కిచెన్ నుంచి ముందుగా మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మంటల్లో మొత్తం 53 మంది సజీవ దహనమయ్యారు.
మృతుల్లో 40 మంది దాకా భారతీయులే. తీవ్రంగా గాయపడిన మరో 40కి పైగా మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగినపుడు అపార్ట్‌మెంట్‌లో 160 మంది దాకా ఉన్నట్లు సమాచారం. వీరంతా ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్న నిర్మాణ రంగ కార్మికులని సమాచారం.
అగ్ని ప్రమాద ఘటనపై కువైట్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment