కువైట్‌ అగ్ని ప్రమాదంపై కమల్‌, మమ్ముట్టి దిగ్భ్రాంతి | Kamal Haasan And Mammootty Responds On Kuwait Fire Accident | Sakshi
Sakshi News home page

Kuwait Fire Accident: కువైట్‌ అగ్ని ప్రమాదంపై కమల్‌, మమ్ముట్టి దిగ్భ్రాంతి

Published Thu, Jun 13 2024 12:02 PM | Last Updated on Thu, Jun 13 2024 12:15 PM

Kamal Haasan And Mammootty Responds On Kuwait Fire Accident

కువైట్‌లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో 50 మంది మృతి చెందడం పట్ల హీరోలు కమల్‌ హాసన్‌, మమ్ముట్టి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్‌ వేదికగా మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. కువైట్‌ దక్షిణ అహ్మదీ గవర్నరేట్‌లో మాంగాఫ్‌ ప్రాంతంలోని ఆరు అంతస్థుల భవనంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 42 మంది భారతీయులు సహా మొత్తం 50 మంది మృత్యువాత పడ్డారు.  బాధితుల్లో ఎక్కువమంది కేరళ, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. వీరంతా ఉపాధి కోసం కువైట్‌ వెళ్లి అగ్నికి ఆహుతి అయ్యారు.  

 

 ఈ విషాద ఘటన పట్ల కమల్‌ స్పందిస్తూ.. ‘కువైట్‌లోని మంగాఫ్‌లో అపార్ట్‌మెంట్ అగ్నిప్రమాదంలో భారతీయులు సహా 50 మందికి పైగా మరణించారనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ ఘోర ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధిత భారతీయులకు అవసరమైన సహాయం అందించడానికి, మరణించిన వారి మృతదేహాలను మాతృదేశానికి తీసుకురావడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరుతున్నాను’అని కమల్‌ ట్వీట్‌ చేశాడు.

‘కువైట్‌ అగ్ని ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ కష్ట సమయంలో మీకు ధైర్యం, ఓదార్పునివ్వాలని నేను ప్రార్థిస్తున్నాను’అని మమ్ముట్టి ఎక్స్‌లో రాసుకొచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement