Asian Games- కువైట్ / బీజింగ్: వాయిదా పడిన ఆసియా క్రీడల్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించేలా రీషెడ్యూల్ చేశారు. నిజానికి చైనా ఆతిథ్యమిచ్చే ఈ ఆసియా మెగా ఈవెంట్ ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు జరగాల్సింది. కానీ ఆ దేశంలో కోవిడ్ కేసుల పెరుగుదల, వైరస్‌లో కొత్త స్పైక్ కలకలంతో ఆసియా గేమ్స్‌ను వాయిదా వేస్తున్నట్లు మే 6న ప్రకటించారు.
గత రెండు నెలలుగా పలు దఫా చర్చల అనంతరం తాజాగా రీషెడ్యూలును వెల్లడించారు. ‘ఆసియా క్రీడలు తిరిగి నిర్వహించేందుకు టాస్క్‌ఫోర్స్ రెండు నెలలుగా కృషిచేస్తోంది. చైనీస్ ఒలింపిక్ కమిటీ, హాంగ్జౌ ఆసియా గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ చర్చలు జరిపింది. మరో మేజర్ ఈవెంట్ నిర్వహణకు ఏ ఇబ్బంది లేకుండా తేదీల్ని ఖరారు చేయాలని నిర్ణయించింది’ అని ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ఒక ప్రకటనలో తెలిపింది.
చదవండి: Babar Azam: కోహ్లిని తలపిస్తున్న పాక్ కెప్టెన్.. ఖాతాలో మరో మైలురాయి
Comments
Please login to add a commentAdd a comment