భోపాల్ : గతవారం కువైట్ నుంచి ఇండోర్ విమానాశ్రయానికి చేరుకున్న భారతీయుల్లో 25 మందికి పైగానే కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. విద్యార్థులు, పర్యాటకులు సహా 120 మంది భారతీయులు మే13న కువైట్ నుంచి రెండు విమానాల్లో ఇండోర్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని భోఫాల్‌లోని క్వారంటైన్ సెంటర్‌కి తరలించారు. 240 మంది ప్రయాణికుల్లో 25కి పైగానే కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. శనివారం మరికొంత మందిలో కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. (60 మంది తబ్లిగీ సభ్యుల అరెస్ట్)
ప్రస్తుతం కరోనా బాధితులు భోపాల్‌లోని చిరాయు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 5,000 దాటగా, కరోనా కారణంగా ఒక్క ఇండోర్‌లోనే అత్యధికంగా 249 మంది మరణించారు. ఇప్పుడు ఇండోర్ విమానాశ్రయానికి చేరుకున్న భారతీయుల్లో కరోనా వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తుంది. దీంతో వారికి చికిత్స అందిస్తున్న సిబ్బందికీ వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. (ఘోర రోడ్డు ప్రమాదం; ఐదుగురి మృతి )
Comments
Please login to add a commentAdd a comment