![Kuwait Issued Orders Not To Renewal Visa Above 60 Years Migrant Workers - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/8/kuwit.gif.webp?itok=PPYM2wSC)
కువైట్: తమ దేశంలో విదేశీ వలసదారుల సంఖ్యను తగ్గించుకోవడంతో పాటు తమ పౌరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను విస్తృత పరచడానికి కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విదేశీ వలస కార్మికుల్లో ఎవరికైనా 60 ఏళ్లు పైబడితే వారికి వీసాలను రెన్యూవల్ చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కొత్త వీసాల జారీ ప్రక్రియను రద్దు చేసిన కువైట్ ప్రభుత్వం.. తమ దేశంలోని వివిధ కంపెనీల్లో ఉపాధి పొందుతున్న విదేశీ వలస కార్మికుల వయస్సును పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇది ఇలా ఉండగా కువైట్‌లో లైసెన్స్ పొంది వ్యాపారం చేసుకునేవారు తమ వయస్సుతో సంబంధం లేకుండా వీసా రెన్యూవల్ చేసుకోవచ్చు. కరోనా సంక్షోభంతో ఇప్పటికే ఎంతో మంది తెలంగాణ కార్మికులు కువైట్ నుంచి ఇంటి బాట పట్టగా.. వయస్సు ఆధారంగా వీసాల రెన్యూవల్‌కు ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో కొంత మంది కార్మికులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంటికి రాక తప్పదని వెల్లడి అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment