షేక్ మహమ్మద్ రఫీ(ఫైల్)
కడప కార్పొరేషన్: జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలోని నందలూరుకు చెందిన షేక్ మహమ్మద్ రఫీ(34) ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు వైఎస్‌ఆర్‌సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, ముమ్మడి బాలిరెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. వారు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నందలూరుకు చెందిన షేక్ మహమ్మద్ రఫీ కొన్నేళ్లుగా కువైట్‌లో సీసీ కెమెరాల టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 19వ తేది జాబిరియా ప్రాంతంలోని హాస్పిటల్‌లో కెమెరా అమర్చుతూ ప్రమాదవశాత్తు నిచ్చెన నుంచి కిందపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 28వ తేది మరణించాడు. మృతునికి భార్య, ఐదేళ్ల బాబు ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ కన్వీనర్లు సేవాదళ్ ఇన్‌చార్జి గోవిందు రాజు ద్వారా భారత రాయబార కార్యాలయంలో ఇమ్మిగ్రేషన్ పనులన్నీ పూర్తి చేశారు. బాడీ బాక్స్‌కు అయిన రూ.14వేలు బాలిరెడ్డి భరించగా, చెన్నై విమానాశ్రయం నుంచి నందలూరు వరకూ రాష్ట్ర ప్రభుత్వ ఏపీ ఎన్‌ఆర్‌టీ కార్పొరేషన్ వారు ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని ఇలియాస్, బాలిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment