
ఐక్యరాజ్యసమితి: ఉగ్రవాదానికి పాకిస్తాన్‌ను కేంద్ర స్థానంగా ప్రపంచ దేశాలన్నీ పరిగణిస్తున్నాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ‘‘పాక్ ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఉగ్రభూతాన్ని పెంచి పోషించడం మానుకోవాలి’’ అంటూ హితవు పలికారు. ‘‘ఉగ్రవాదం ఎక్కడ పురుడు పోసుకుందో ప్రపంచమంతటికీ తెలుసు. పామును ఇంట్లో పెంచుకుంటే ఎప్పటిౖMðనా కాటేయడం ఖాయమని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అప్పట్లో పాక్‌ను హెచ్చరించారు’’ అని గుర్తుచేశారు.
ఐరాస ప్రధాన కార్యాలయంలో ‘అంతర్జాతీయ ఉగ్రవాదం, సవాళ్లు, పరిష్కార మార్గాలు’ అంశంపై భేటీకి మంత్రి నేతృత్వం వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆసియాలో, ఇతర ప్రాంతాల్లో ఉగ్ర దాడుల వెనుక ఉన్నదెవరో అందరికీ తెలుసన్నారు. దక్షిణాసియాలో ఉగ్రవాదం ఎప్పుడు అంతమవుతుందని పాక్ జర్నలిస్టు ప్రశ్నించగా ‘మీ దేశ మంత్రులనే అడగండి’ అని బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment