ఉగ్రవాదాన్ని మోదీ సహించరు : జై శంకర్‌  | Modi Crystal Clear, Said He Will Not Tolerate Terror: Jaishankar In Book | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదాన్ని మోదీ సహించరు : జై శంకర్‌ 

Published Mon, May 16 2022 8:04 AM | Last Updated on Mon, May 16 2022 8:04 AM

Modi Crystal Clear, Said He Will Not Tolerate Terror: Jaishankar In Book - Sakshi

న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాల్ని ప్రధానమంత్రి నరేంద్ర  మోదీ ఎప్పటికీ సహించరని, మరీ ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదం పట్ల కఠినంగా ఉంటారని విదేశాంగ మంత్రి జై శంకర్‌ చెప్పారు. తాను రాసిన ‘‘మోదీ @20ః డ్రీమ్స్‌ మీట్‌ డెలివరీ’’ అనే పుస్తకంలో జై శంకర్‌ ఈ వివరాలను పేర్కొన్నారు. 2015లో తాను విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సార్క్‌ దేశాల పర్యటనకు వెళ్లే ముందు ప్రధాని తనతో చెప్పిన మాటల్ని జైశంకర్‌ ఈ పుస్తకంలో గుర్తు చేసుకున్నారు. ‘

‘నా అనుభవం, నా నిర్ణయం పట్ల మోదీకి ఎంతో విశ్వాసం ఉంది. అయినప్పటికీ పాకిస్తాన్‌ విషయంలో నాకు పలు జాగ్రత్తలు చెప్పారు. తన ముందు ప్రధానమంత్రుల్లా తాను ఉండడని, ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించనని చెప్పారు. ఉగ్రవాదం కట్టడిలో ఎలాంటి సందిగ్ధత ఉండకూదని మోదీ చెప్పారు’’ అని జై శంకర్‌ ఆ పుస్తకంలో రాసుకొచ్చారు.  
చదవండి: పాక్‌లో ఇద్దరు సిక్కుల కాల్చివేత 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement