
న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీ చిన్ననాటి ఫొటోలు, ఆయన గురించి ఎవరికీ అంతగా తెలియని ఆసక్తికర అంశాలు ఉన్న ఒక పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. ప్రధానిగా మోదీ ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఆ జీవిత కథాత్మక పుస్తకాన్ని సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ బాలకృష్ణన్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ‘నరేంద్ర మోదీ– హార్బింజర్ ఆఫ్ ప్రాస్పరిటీ అండ్ అపొసిల్ ఆఫ్ వరల్డ్ పీస్’ అనే ఈ పుస్తకాన్ని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జ్యూరిస్ట్స్ అధ్యక్షుడు, ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆదిశ్ అగర్వాల, అమెరికన్ రచయిత్రి ఎలిజబెత్ హోరన్ సంయుక్తంగా రచించారు. ఈ–బుక్‌గానూ ఇది అందుబాటులో తెచ్చారు. ఇంగ్లిష్‌సహా 10 విదేశీ భాషల్లో, తెలుగు సహా 10 భారతీయ భాషల్లో లభిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment