లాహోర్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. సుమారు 22 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. పట్టుబడిన ఉగ్రవాదులు ఐఎస్ఐఎస్, టీటీపీతో పాటు ఇతర నిషేధిత సంస్థలకు చెందినట్లు గుర్తించారు.
కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ ప్రతినిధి దీనిపై మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ శాఖ ఇచ్చిన సమాచారం ఆధారంగా పంజాబ్‌లోని వేర్వేరు జిల్లాల్లో సుమారు 152 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఐఎస్ఐఎస్, తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, లష్కరే ఈ జాంగ్వీ గ్రూపులకు చెందిన 22 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు చెప్పారు.
లాహోర్, అటాక్, షేక్‌పురా, ముజాఫర్‌ఘర్, నాన్‌కానా సాహిబ్, బవల్‌పుర్, డీజీ ఖాన్, ఫైసలాబాద్, ముల్తాన్, భవాల్‌నగర్, రావల్పిండి నుంచి వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల వద్ద నుంచి 1645 గ్రామాలు పేలుడు పదార్థాలు, మూడు హ్యాండ్ గ్రానేడ్లు, ఒక ఐఈడీ బాంబు, 12 డెటోనేటర్లు, పిస్తోల్, నిషేధిత సాహిత్యాన్ని సీజ్ చేశారు. అనుమానిత ఉగ్రవాదులు పంజాబ్‌లో అఘాయిత్యానికి ప్లాన్ వేశారు, రాష్ట్రంలో ఉన్న కీలక ప్రదేశాలను, వ్యక్తులను టార్గెట్ చేయాలని భావించారు.
1,645 గ్రాముల బరువున్న పేలుడు పదార్థాలు, మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక ఐఈడీ బాంబు, 12 డిటోనేటర్లు, 32 అడుగుల సేఫ్టీ ఫ్యూజ్ వైర్, ఒక పిస్టల్, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment