( ఫైల్ ఫోటో
సాక్షి, హైదరాబాద్: పోలీసులకు, కౌంటర్ ఇంటెలిజెన్స్‌కు మల్లేపల్లి సవాల్‌గా మారింది. ఈ ప్రాంతంపై పోలీసుల నిఘా కొరవడటంతో పాటు సెర్చ్ ఆపరేషన్లు తగ్గాయి. మర్కాజ్ ఘటనతో మల్లేపల్లిపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. హైదరాబాద్‌లో స్లీపర్ సేల్స్‌కు అడ్డాగా మల్లేపల్లి మారింది. మల్లేపల్లిలో 20 ఏళ్ల నుంచి ఉంటున్న ఉగ్రవాదులు మాలిక్ బ్రదర్స్ ఇప్పటివరకు పోలీసులకు చిక్కలేదు.
8 ఏళ్లలో ఆరుగురు ఉగ్రవాదులను మల్లేపల్లిలో ఎన్‌ఐఏ పట్టుకుంది. మల్లేపల్లిలో వస్త్ర దుకాణాలను ఆశ్రయం చేసుకుని ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నారు. సూరత్,ముంబై నుంచి వస్త్రాల ఇంపోర్ట్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మల్లేపల్లి ఉండగా, ఆ ప్రాంతంలో 1200లకు పైగా వస్త్ర దుకాణాలు ఉన్నాయి. యూపీ బీహార్ నుండి వచ్చి హోల్ సేల్ వస్త్రాల షాపుల్లో వర్కర్స్ గా మకాం పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment