
దుబాయ్: సౌదీ అరేబియా ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష అమలు చేసింది. 1980లో మక్కా మసీదు స్వా«ధీనం నేరంలో 63 మంది తలలు నరికి సౌదీ మరణ శిక్ష అమలు చేసింది. శిక్ష అమలైన వారిలో మహిళలు, పిల్లల్ని చంపిన వారితో పాటు అల్ ఖాయిదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు, యెమన్‌లోని హైతీ తిరుగుబాటుదారులకు మద్దతునిచ్చిన వారు కూడా ఉన్నారు.