రియాద్: సౌదీ అరేబియాలో ఈ ఏడాది శిరచ్ఛేదం చేసిన వారి సంఖ్య 88కి చేరింది. తాజాగా ముగ్గురికి మరణశిక్ష అమలు చేసింది. గతేడాది సంఖ్యను అప్పుడే అధిగమించింది. 2014లో 87 మందికి మరణశిక్ష అమలు చేసింది. సౌదీకి చెందిన అవాద్ ఆల్- రొవైలీ, లఫీ ఆల్-షమరీ అనే పౌరులకు ఉత్తర జావుఫ్ ప్రాంతంలో శిరచ్ఛేదం అమలు చేసినట్టు సౌదీ ప్రెస్ ఏజెన్సీ అధికారి ఒకరు వెల్లడించారు. నిషేధిత మత్తు పదార్ధాల రవాణా కేసులో దోషులుగా తేలడంతో వీరికి మరణశిక్ష అమలు చేశారు. హత్య కేసులో మహ్మద్ ఆల్-షిహ్రీ అనే మరో వ్యక్తికి నైరుతి ఆసిర్ ప్రాంతంలో శిరచ్ఛేదం చేశారు.
మరోవైపు సౌదీలో నేర విచారణలు నిష్పక్షపాతంగా జరగడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలో మరణశిక్ష అమలు చేస్తున్న దేశాల్లో సౌదీ అరేబియా టాప్-5లో ఉంది.
88 మందికి శిరచ్ఛేదం
Published Wed, May 27 2015 9:25 AM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM
Advertisement