offences
-
జీఎస్టీ కౌన్సిల్ అజెండాలో కీలక అంశాలు
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ భేటీ ఈ నెల 17న జరగనుంది. జీఎస్టీ నిబంధనల ఉల్లంఘనలను నేరాలుగా పరిగణించకపోవడం అన్నది ముఖ్యమైనది. అలాగే, జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు, పాన్ మసాలా, గుట్కా కంపెనీల పన్ను ఎగవేతలు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. జీఎస్టీ కింద నిబంధనల ఉల్లంఘనలో ప్రాసిక్యూషన్ చేపట్టే వాటి ద్రవ్య పరిమితి (కేసు విలువ) మూడు రెట్లు పెంచాలని జీఎస్టీ కౌన్సిల్‌కు సంబంధించి న్యాయ కమిటీ సిఫారసు చేసింది. దీనిపై జీఎస్టీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే, జీఎస్టీ ఉల్లంఘనలదారుల నుంచి వసూలు చేసే ఫీజును కూడా తగ్గించడాన్ని తేల్చనుంది. ముఖ్యంగా ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై పన్ను రేటు పెంపు అంశాన్ని ఈ విడత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం చర్చకు చేపట్టకపోవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై మంత్రుల బృందం ఇంకా నివేదిక సమర్పించాల్సి ఉందని పేర్కొన్నాయి. -
మలేషియా సంచలన నిర్ణయం... మరణ శిక్ష రద్దు!
Death Penalty Remains Mandatory For Several Offences: మలేషియా సంచలన నిర్ణయం తీసుకుంది. హత్య, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర తీవ్రమైన నేరాలకు మలేషియా దేశంలో మరణశిక్ష తప్పనిసరి. ఐతే మలేషియా ప్రభుత్వం కొన్ని నేరాల్లో విధించే తప్పనిసరి మరణశిక్షను రద్దు చేయడానికి అంగీకరించినట్లు తెలిపింది. 2018లోనే అధికారాన్ని చేజిక్కించుకున్న సంస్కరణవాద కూటమి మరణశిక్షను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఐతే రాజకీయ ప్రత్యర్థులు, బాధితుల కుటుంబాల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా ఈ మరణశిక్ష రద్దు నిలిచిపోయింది. ప్రస్తుతం కేబినేట్ మరణ శిక్షను రద్దు చేసేందుకు సమ్మతించినట్లు న్యాయశాఖ మంత్రి వాన్ జునైది తువాంకు జాఫర్ తెలిపారు. కానీ ఈ మరణశిక్షకు ప్రత్యామ్యాయంగా ఎలాంటి శిక్షలు విధించవచ్చనే దానిపై తదుపరి అధ్యయనం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు ఈ విషయంపై నిర్ణయం అన్ని పార్టీల హక్కులను రక్షించే విధంగా ఇవ్వడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మార్పులు చేయడానికి పార్లమెంట్లో చట్టం చేయవలసి ఉంటుందన్నారు. పైగా ఇది పూర్తి స్థాయిలో అమలు కావడానికి కూడా కాస్త సమయం పడుతుందని అన్నారు. మానవ హక్కుల ఆసియా డిప్యూటీ డైరక్టర్ ఫిల్ రాబర్ట్సన్ తప్పనిసరి మరణశిక్షను తొలగిస్తామని మలేషియా బహిరంగంగా ప్రకటించడం ఒక ముఖ్యమైన ముందడుగుగా అభినందించారు. ఐతే మలేషియాలో ఇంతవరకు వరుసగా అధికాలోకి వచ్చిన ఇతర ప్రభుత్వాలు ఈ మరణశిక్షను రద్దు చేస్తాం అంటూ... మాటలకే పరిమితం చేశాయే తప్ప ఆచరణలోకి తీసుకు రావడంలో విఫమయ్యాయి. (చదవండి: తనని తాను కాల్చుకునేలోపే ఊహించని దారుణం... ఆ తర్వాత) -
ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష అమలు
దుబాయ్: సౌదీ అరేబియా ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష అమలు చేసింది. 1980లో మక్కా మసీదు స్వా«ధీనం నేరంలో 63 మంది తలలు నరికి సౌదీ మరణ శిక్ష అమలు చేసింది. శిక్ష అమలైన వారిలో మహిళలు, పిల్లల్ని చంపిన వారితో పాటు అల్ ఖాయిదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు, యెమన్లోని హైతీ తిరుగుబాటుదారులకు మద్దతునిచ్చిన వారు కూడా ఉన్నారు. -
గేరేసి ... చెక్కేసి
► వాహనాన్ని తస్కరించడం.. దాన్ని రిసీవర్‌కు విక్రయించడం.. అలా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడం.. ఇది ప్రొఫెషనల్ దొంగల శైలి. ► ఓ వాహనంపై మోజుపడి చోరీ చేయడం.. విసుగొచ్చే వరకు తిరిగేసి ఒకచోట వదిలేయడం లేదా దాచేయడం.. మరోటి తస్కరించడం.. ఇదీ జాయ్ రైడర్స్ స్టైల్. సాక్షి, సిటీబ్యూరో: సిటీలో ఈ రెండు రకాలైన నేరాలు చోటు చేసుకున్న ఫలితంగా గత ఏడాది వాహనచోరీ కేసుల సంఖ్య ఏకంగా 17 శాతం పెరిగింది. 2014 నుంచి ఈ నేరాలను కట్టడి చేయడానికి పోలీసు విభాగం ప్రయత్నాలు ప్రారంభించింది. ఫలితంగా 2018 వరకు వరుసగా తగ్గతూ వచ్చిన ఆటోమొబైల్ అఫెన్సులు 2019లో మాత్రం హఠాత్తుగా పెరిగాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసు విభాగం ఈ క్రైమ్‌ను కట్టడి చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వాహనచోరీలనే వృత్తిగా ఎంచుకుని, అలా వచ్చే సొమ్ముతోనే బతికే వాళ్లతో పాటు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తమ సరదా తీర్చుకోవడం కోసం చోరబాట పడుతున్నారని అధికారులు గుర్తించారు. రికార్డుల్లో ఉన్న పాత వారిని పట్టుకోవడం కొంత వరకు సాధ్యమవుతున్నా... జాయ్ రైడర్స్ మాత్రం ముçప్పుతిప్పలు పెడుతున్నారు. వలసవస్తున్న ‘ప్రొఫెషనల్స్’... వాహనచోరీలనే వృత్తిగా ఎంచుకున్న నగరానికి చెందిన వారి సంఖ్యా ఎక్కువగానే ఉండేది. అయితే గడిచిన ఆరేళ్లుగా నగర పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో వీరికి కొంతమేర అడ్డుకట్ట పడింది. ప్రస్తుతం సిటీకి వలస దొంగల బెడద ఎక్కువగా ఉంటోంది. బయటి రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన చోరులు నగరానికి వచ్చి తమ ‘పని’ పూర్తి చేసుకుని వెళ్తున్నారు. వీరి పూర్తి వివరాలు పోలీసు రికార్డుల్లో లేకపోవడం, పీడీ యాక్ట్ నమోదుకు సాంకేతిక ఇబ్బందులు ఉండటంతో ఈ చోరులకు అడ్డుకట్ట వేయడం కష్టంగా మారుతోంది. ఈ ముఠాలు, చోరులు సిటీలో తస్కరించిన వాహనాలను బయటకు తరలించి విక్రయిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ కారణంగానే చోరీకి గురైన వాహనాల రికవరీ దారుణంగా ఉంటోందని వివరిస్తున్నారు. గడిచిన కొన్నేళ్ళ గణాంకాలు తీసుకుంటే ఏ ఒక్క ఏడాదీ వాహనచోరీల్లో రికవరీల శాతం 50 శాతానికీ చేరకపోవడానికి ప్రధాన కారణం ఇదేనని స్పష్టం చేస్తున్నారు. జాయ్ రైడర్స్‌తో మరో తలనొప్పి... స్నేహితులు లేదా ప్రేయసితోనే, సరదాగా తిరగడం కోసమో వాహనాలను చోరీ చేస్తున్న జాయ్ రైడర్స్ సంఖ్య ప్రొఫెషనల్స్‌కు దీటుగా ఉంటోందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ నగరంలో పెరిగిపోయిందని అధికారులు చెప్తున్నారు. జాయ్ రైడర్స్‌గా పట్టుబడుతున్న వారిలో విద్యార్థులు, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారి బిడ్డలు ఉంటుండటం, వీరంతా కొత్త నేరగాళ్లు కావడంతో గుర్తించడం, పట్టుకోవడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఇలాంటి జాయ్ రైడర్స్‌కు సంబంధించిన ఇటీవల కాలంలో పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మైనర్లు ఈ నేరాల వైపు మళ్ళుతున్నారు. నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో లభిస్తున్న గుర్తుతెలియని వాహనాల్లో జాయ్ రైడర్స్ ద్వారా చోరీకి గురైనవీ పెద్దసంఖ్యలోనే ఉంటున్నాయని పోలీసు అధికారులు చెప్తున్నారు. చోరీ చేసిన వాహనానికి రిజి్రస్టేషన్ నెంబర్ మార్చి కొంతకాలం తిరిగిన తరవాత లేదంటే ట్రాఫిక్ పోలీసులు అడిగినప్పుడు సరైన డాక్యుమెంట్లు చూపించలేకో వదిలేసి వెళుతున్నారు. దృష్టిపెట్టిన ప్రత్యేక విభాగాలు... నగరంలో 2018తో పోలిస్తే 2019లో నేరాల నమోదు తగ్గింది. అయితే దీనికి భిన్నంగా పెరిగిన వాహనచోరీలను కట్టడి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఓ పక్క ప్రొఫెషనల్స్, మరోపక్క జాయ్ రైడర్స్‌ను కట్టడి చేయడానికి చర్యలు ప్రారంభించారు. నేర విభాగాలతో పాటు టాస్క్‌ఫోర్స్ అధికారులు వాహనచోరీలపై దృష్టి కేంద్రీకరించేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్న ప్రత్యేక బృందాలు వాహనచోరీలకు చెక్ చెప్పడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. జాయ్రైడర్స్ను కట్టడి చేయడంతో తల్లిదండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ వాళ్ళపై కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని వివరిస్తున్నారు. ఈ జాయ్రైడర్స్ ఎక్కువగా అనధికారిక పార్కింగ్ ప్లేసులు, రాత్రి వేళల్లో ఇళ్ళ బయట పార్క్ చేసిన వాహనాలే టార్గెట్ చేస్తారని, వీటిని వాహనచోదకులు దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎన్ని చోరీలు? ఏ ఏడాది 2014 1475 2015 1211 2016 1034 2017 889 2018 661 2019 78 -
పన్ను చెల్లింపుదారులకు మరో అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఆదాయపు పన్ను నేరాల కాంపౌండింగ్ కు కల్పించిన ప్రత్యేక అవకాశాన్ని మరో నెలపాటు పొడిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ (సీబీడీటీ) ప్రకటించింది. డిసెంబరు 31తో ముగిసిన గడువును జనవరి 31 వరకు పెంచుతున్నట్టు సీబీడీటీ జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. ఆదాయపు పన్ను నేరాల సమ్మేళనం కోసం దరఖాస్తు చేసుకోవడానికి పన్ను చెల్లింపుదారులు సదుపాయాన్ని పొందటానికి చివరి తేదీ జనవరి 31 వరకు సిబిడిటి పొడిగించినట్లు శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులలో తెలిపింది. ఐపీఏఐ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా)తో సహా మిగిలిన క్షేత్ర నిర్మాణాల నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ తుది అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. కాగా న్యాయబద్ధమైన కేసుల్లో పన్ను చెల్లింపుదారుల ఇక్కట్లను తప్పించేందుకు, ప్రాసిక్యూషన్ కేసుల పెండింగ్‌ను తగ్గించేందుకు ‘‘వన్-టైమ్" అవకాశాన్నిగత ఏడాది సెప్టెంబరులో ప్రకటించింది. డిసెంబరు 31వరకు అవకాశాన్నికల్పించింది. పన్ను నేరాలు లేదా పన్ను ఎగవేతకు పాల్పడిన వారు పన్ను బకాయిలు, సర్‌చార్జీలు చెల్లించేందుకు అవకాశం ఇవ్వాలన్న లక్ష్యంతో వారిపై ప్రాసిక్యూషన్ దాఖలు చేయకపోవడాన్నే కాంపౌండింగ్‌గా వ్యవహరిస్తారు. -
బాల్యానికి రక్షణెలా?
పిల్లల రక్షణకు సంబంధించి మనకు అనేక చట్టాలున్నాయి. వారి విషయంలో అతిగా ప్రవర్తిస్తే, నేరానికి పాల్పడితే ఎలాంటి శిక్షలుంటాయో అవన్నీ ఏకరువు పెడతాయి. అయినా ఆ నేరాల్లో తగ్గుదల లేదు. నానాటికీ పెరుగుతున్నాయి. పత్రికల్లో, చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లో ఆ ఉదంతాలు నిత్యం తారస పడుతూనే ఉంటాయి. తాజాగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ విడుదల చేసిన నివేదిక దేశంలో పిల్లల స్థితిగతులు ఎలా ఉన్నాయో వెల్లడించింది. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ తరలింపు, బాలలపై లైంగిక నేరాలు, వారిలో పౌష్టి కాహార లోపం వగైరాలతోపాటు సామాజిక అశాంతి పిల్లలపై చూపే ప్రభావం, మధ్యలో బడి మానేస్తున్న, అసలు అక్షరానికే దూరంగా ఉన్న చిన్నారుల పరిస్థితిపై నివేదిక చర్చించింది. దేశంలోని ఏ జిల్లాల్లో పిల్లలకు ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో చెప్పే డిజిటల్ మ్యాప్‌ను కూడా రూపొందించారు. దాని ప్రకారం దేశం లోని 678 జిల్లాల్లో 409... అంటే 60 శాతం జిల్లాలు బాలలకు కంటకప్రాయంగా ఉంటున్నాయి. ఒడిశా, బిహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పిల్లల అపహరణ అధికంగా ఉంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాల బాలల్లో పౌష్టికాహార లోపం అధికంగా ఉన్నదని తేలింది. ఈ రాష్ట్రాలన్నిటా వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయి. పిల్లలకు ఓట్లుంటే పాలకులు ఎలా ప్రవర్తించేవారో గానీ... ఇప్పుడైతే వారి విషయంలో క్షమార్హం కాని నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఏటా దాదాపు 50,000మంది మహిళలు, పిల్లలు వివిధ రాష్ట్రాల్లో మాయమవుతుండగా బంగ్లాదేశ్, నేపాల్ నుంచి వేలాదిమంది ఆడపిల్లలు ఈ నరక కూపాల్లో పడు తున్నారు. దేశంలోని వివిధచోట్ల వ్యభిచార గృహాల్లో ఉన్న నేపాల్ బాలికల సంఖ్య 2 లక్షలుంటుందని చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్ చెబుతోంది. అపహరణకు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి వారిని కన్నవారి వద్దకు చేర్చాలని ది హేగ్‌లో జరిగిన సదస్సులో ఆమధ్య ఒక ఒడంబడిక కుదిరింది. అయితే సకారణంగానే మన దేశం ఆ ఒప్పందంపై సంతకం చేయలేదు. భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తి విడిపోయినప్పుడు పరస్పర అంగీకారం లేకుండా భార్య తనతోపాటు పిల్లల్ని తీసుకెళ్లడాన్ని కూడా ఆ ఒప్పందం అపహ రణగా భావిస్తోంది. అందువల్ల సంతకం చేయకపోవడం సబబేనని వేరే చెప్పనవ సరం లేదు. అయితే అంతమాత్రాన మొత్తంగా పిల్లల అపహరణ అంశంపై అసలు శ్రద్ధే పెట్టాలన్న ధ్యాస లేకపోవడం అమానుషం. కానీ జరుగుతున్నది అదే. ఇందు వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తుతున్నాయో తెలిస్తే గుండె చెరువవుతుంది. అపహరణకు గురవుతున్న ఆడపిల్లల్ని వ్యభిచార గృహాల్లో అత్యంత అమానవీయ మైన పరిస్థితుల మధ్య ఉంచి, మాట వినేవరకూ వారికి సరిగా నీరు, ఆహారం కూడా ఇవ్వరని ఈమధ్యే ఆంగ్ల వారపత్రిక కథనం వెల్లడించింది. వారితో వ్యభి చారం చేయించడం, బూతు చిత్రాలు తీయడం వంటివి చేస్తున్నారని తెలిపింది. చట్టాల్లో ఉంటున్న లొసుగులు, వాటిని సరిచేయడం తక్షణావసరమని గుర్తిం చని పాలకులు, ఫిర్యాదులందినప్పుడు వాటిని స్వీకరించడానికే సిద్ధపడని, స్వీక రించినా దర్యాప్తు చేయడానికి ఆసక్తి చూపని పోలీసులు ఆ బాలలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకోవడానికి కారకులవుతున్నారు. కిడ్నాప్ ముఠాలకు రాజకీయ నాయకుల అండదండలుండటం కూడా ఈ సమస్యను మరింత జటిలం చేస్తోంది. రేపటి సమాజాన్ని సుసంపన్నం చేసేలా ఎదగవలసిన పిల్లలపట్ల ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామని వీరంతా గుర్తిస్తే తప్ప ఈ స్థితి మారదు. ఇప్పుడు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ బాలలు ఎంత దయనీయంగా బతుకులీడు స్తున్నారో అందరి దృష్టికీ తీసుకురావడం హర్షించదగిన విషయం. అయితే ఇక్క డితో ఆగితే సమస్య తీరదు. ఈ డేటా ఆధారంగా, దీనికి కొనసాగింపుగా తీసుకోవా ల్సిన చర్యలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా శాంతిభద్రతల యంత్రాంగంలో ఈ సమస్యపై అవగాహన పెంపొందించడం అవసరం. బాలల పట్ల అపచారం జరి గిందని తెలిసిన వెంటనే చర్య తీసుకునే సంస్కృతి పెంపొందాలి. నిందితుల అరెస్టు, వేగవంతమైన దర్యాప్తు, సత్వర విచారణ, దోషులకు కఠిన శిక్షలు పడటం చాలా ముఖ్యం. బాలలకు విద్యనందించడంలో, వారికి ఆరోగ్యకర జీవనాన్ని కల్పించడంలో ముందుంటానని మన దేశం ప్రతినబూనింది. అయితే ఆచరణంతా అందుకు విరు ద్ధంగా సాగుతోంది. పిల్లలకు 14 ఏళ్ల వయసు వచ్చేవరకూ ఉచిత, నిర్బంధ విద్యనందించడం కోసం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం నీరుగారింది. ఆరోగ్యా నికి సంబంధించిన అంశాల్లోనూ అదే స్థితి. యునిసెఫ్ నివేదిక ప్రకారం నివారించ దగ్గ వ్యాధులతో ఏటా దేశంలో 2 లక్షలమంది పిల్లలు కన్నుమూస్తున్నారు. వేయి మందిలో 63మంది పుట్టిన వారం రోజుల్లోనే చనిపోతుంటే అందులో 47 శాతం మరణాలు కేవలం మశూచి, ధనుర్వాతం వంటి వ్యాధుల వల్లనే సంభవిస్తున్నాయి. ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ లభ్యత లేకపోవడమే ఇందుకు కారణం. యూపీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఇలాంటి మరణాలు అధిక సంఖ్యలో ఉంటు న్నాయి. ఇక బాల కార్మిక వ్యవస్థ వరకూ చూస్తే ఆ విషయంలో అత్యధిక చట్టా లున్న దేశం మనదే. చిత్రంగా బాల కార్మికులు అధికంగా ఉన్నది కూడా మన దేశం లోనే. దీన్ని అరికట్టడానికి బదులు మరింత పెంచేలా నిరుడు జూలైలో 1986నాటి బాలకార్మిక వ్యవస్థ నిరోధక చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. కుటుంబ వ్యాపా రాలు, వృత్తులు, వ్యవసాయం తదితర అంశాల్లో తల్లిదండ్రులు పిల్లల సేవలను వినియోగించుకునే వెసులుబాటును ఆ సవరణ ఇచ్చింది. ఎందరు కాదన్నా దానికి పార్లమెంటు ఆమోదం కూడా లభించింది. బాల్యం పిల్లలపాలిట బందీఖానాగా, చేదు జ్ఞాపకంగా మిగిలిపోకూడదు. అది వారి సమగ్ర వికాసానికి తోడ్పడాలి. రేపటి తరాలు బహుళ రంగాల్లో మెరికల్లా రూపొందాలంటే... వారు అన్నిటా పదు నెక్కాలంటే పిల్లలను నిరంతరం అపురూపంగా చూసుకునే వ్యవస్థ ఉండాలి. వారి రక్షణకు తోడ్పడే సకల చర్యలనూ తీసుకోవాలి. తాజాగా కేంద్రం విడుదల చేసిన నివేదిక ఆ దిశగా సాగే కృషికి ప్రాతిపదిక కావాలి.