‘ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి’ | lord vinayaka festival end sucessfully | Sakshi
Sakshi News home page

‘ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి’

Sep 17 2016 11:54 PM | Updated on Oct 1 2018 6:33 PM

ఆదిలాబాద్‌లో నిర్వహించిన గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని హిందూ సమాజ్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు జంగిలి ఆశన్న పేర్కొన్నారు.

ఆదిలాబాద్‌ రిమ్స్‌ : ఆదిలాబాద్‌లో నిర్వహించిన గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని హిందూ సమాజ్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు జంగిలి ఆశన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రింట్‌మీడియా ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గణేశ్‌ ఉత్సవాలు విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రజలకు, పోలీసులకు, రెవెన్యూ, మున్సిపల్‌ సిబ్బందికి కతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఆనందోత్సహాల మధ్య పండుగ నిర్వహించుకున్నారన్నారు.
     అందరి సహకారంతోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా వేడుకలు ముగిశాయని పేర్కొన్నారు. సమావేశంలో సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ప్రపుల్‌ వఝే, నాయకులు శ్రీరాంశర్మ, సామ రమేశ్‌రెడ్డి, మేస్రం రాజేశ్వర్, నరేందర్, సంతోష్‌రెడ్డి ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement