Lord vinayaka
-
Ganesh Chaturthi 2024: అమృత ఘడియల్లో విషమెందుకు?
వినాయకుడి విగ్రహం తయారీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇనుము, సింథటిక్ రంగులతో పాదరసం, క్రోమియం, సీసం, లెడ్ ఆర్సనిక్ తదితర విషపూరిత రసాయనాలను వాడుతున్నారు. వీటితో జీవవైవిధ్యం దెబ్బతింటున్నది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నీటిలో కరగదు. మట్టిలో కలవదు. నిప్పుకు కూడా దహనం కాదు. దీనిలో జిప్సం అనేది ముడి పదార్థంగా ఉంటుంది. ఈ విగ్రహాలను నీటివనరుల్లో వేస్తాం. ఆ నీటిని వాడితే డయేరియా, స్కిన్ క్యాన్సర్‌తో పాటు అనేక చర్మ వ్యాధులు సోకే ప్రమాదం వుంది. ముఖ్యంగా తగరంతో చర్మ వ్యాధులు వచ్చి చర్మం రంగు మారుతుంది. ఆర్సనిక్ వల్ల జుట్టు రాలిపోతుంది. సీసం వల్ల కడుపు నొప్పి వస్తుంది. శరీరం పట్టుత్వం తగ్గుతుంది. అంతేగాక ఆ రసాయనాల నీటిని పంట పాలాలకు మళ్లిస్తే భూసారం తగ్గి భూమి సహజ స్వరూపాన్ని కోల్పోతుంది.మట్టితో చేసిన ప్రతిమల వల్ల పైన చెప్పుకున్న ప్రమాదాలేవీ ఉండవు. పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. చూడటానికి కూడా విగ్రహం ముచ్చటగా ఉంటుంది. పండుగ తర్వాత నిమజ్జనం చేసిన కొద్దిసేపట్లోనే నీటిలో కరిగి΄ోతుంది. దీనివల్ల పర్యావరణం, జీవవైవిధ్యం రెండు కూడా సమతులంగా ఉంటాయి. మట్టి విగ్రహం తయారీలో కేవలం బంకమట్టి మాత్రమే వాడతారు. ఎలాంటి రంగులు వాడరు. కాబట్టి నీరు కలుషితం కాదు.ఎంత విగ్రహం పెట్టి పూజిస్తే అంత గొప్ప అనుకోవడం మానేయాలి. విగ్రహం సైజు కంటే భక్తి ముఖ్యం. పర్యావరణం పట్ల బాధ్యత అంతకంటే ముఖ్యం. రసాయన రంగుల విగ్రహాల వల్ల పర్యావరణం, జీవవైవిధ్యం దెబ్బితింటాయి. రాబోవు రోజుల్లో జీవకోటికి ప్రమాదం ఏర్పడుతుంది. – డాక్టర్ ఎల్ నాగిరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, పర్యావరణ విభాగం, శ్రీకృష్ణదేవరాయ ఉద్యాన కళాశాల, అనంతపురం -
కమనీయం.. గణనాథుని కల్యాణం
యాదమరి (చిత్తూరు జిల్లా): స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి తిరుకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. వేకువజామున మూలాస్థానంలోని స్వయంభు వినాయకునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ ఉభయదారుల ఆధ్వర్యంలో మూలమూర్తికి అభిషేకాలు చేపట్టారు. సాయంత్రం అలంకార మండపంలో పచ్చటి తోరణాలు, అరటి చెట్ల మధ్య బ్రహ్మ మానస పుత్రికలైన సిద్ధి, బుద్ధిలతో స్వామివారి కల్యాణాన్ని ఆలయ అర్చక వేదపండితులు సోమశేఖర్ స్వామి, సుబ్బారావు నిర్వహించారు. అనంతరం ఉభయదారులు, ఆలయ అధికారులు నూతన వధూవరులను పుర వీధుల్లో ఊరేగించారు. ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు, సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా, మంగళవారం రాత్రి సిద్ధి, బుద్ధి, వినాయక స్వామివారు అశ్వవాహనంపై గ్రామ వీధుల్లో ఊరేగారు. నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు: వినాయక స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణతో ముగియనున్నాయి. గురువారం ఉదయం నుంచి స్వామివారి ప్రత్యేక ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. గురువారం నుంచి అక్టోబర్ 8 వరకు సిద్ధి, బుద్ధి సమేతంగా వినాయక స్వామి పలు వాహనాలపై ఊరేగనున్నారు. -
వినాయకుడి వివాహం ఎలా జరిగిందో తెలుసా?మనకు తెలియని కథ..
వినాయకుని వివాహం గురించి చక్కటి పౌరాణిక గాథ. ప్రళయవేళ శ్రీ మహావిష్ణువు నాభినుండి వచ్చిన తామరపువ్వుపై బ్రహ్మ అవతరించాడు. ప్రళయానంతరం విష్ణువు మేల్కొని జీవనసృష్టి కార్యకలాపాన్ని ప్రారంభించమని తన కొడుకైన బ్రహ్మను ఆదేశించాడు. బ్రహ్మ సృష్టి ఆరంభిచాడు. కానీ అంతా వక్రంగా వుంది. అప్పటికి ఎన్నో కల్పాలలో సృష్టి చేస్తూ వస్తున్న బ్రహ్మకు ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించింది. ఆలోచనలో పడ్డాడు. అప్పుడు నారదుడు కార్యారంభానికి ముందు వినాయక పూజ చేయనందువల్లే ఈ వైకల్పికము వచ్చిందని గణేశ అర్చనం చేయమని బ్రహ్మకు బోధించాడు. బ్రహ్మ వినాయకునికై కఠోర తపస్సు చేశాడు. ప్రత్యేక్షమైన వినాయకుడు బ్రహ్మ ఆంతర్యాన్ని గ్రహించి జ్ఞానం, క్రియలనే శక్తులను ఉపాసించమని బోధించాడు. బ్రహ్మ ఆ ఉపాసన చేశాడు. అప్పుడు ఆ రెండు శక్తులు సిద్ధి, బుద్ధి అనే రూపాలతో ప్రత్యక్షమయ్యాయి. బ్రహ్మ కోరిక మేరకు వారిరువురూ ఆయన కుమార్తెలుగా జన్మించారు. ఆ తరువాత బ్రహ్మ చేసిన సృష్టి సక్రమముగా కొనసాగింది. సిద్ధిబుద్ధులు యౌవనవతులయ్యారు. వారి వివాహం చేయాలని బ్రహ్మ సంకల్పించాడు. ఈలోగా నారదుడు కథ నడిపి సిద్ధిబుద్ధులు గణేశుని కోరుతున్నారని ఆయనకు చెప్పాడు. వినాయకుడు అంగీకరించాడు. తరువాత గణేశుడు మిమ్మల్ని కోరుతున్నాడని వారిద్దరికీ చెప్పాడు. బ్రహ్మ సమక్షంలో వినాయకుడికి పెళ్ళి జరిగింది. నూతన వధూవరులను ఆశీర్వదించి నారదుడు వినాయకునివైపు ఆశ్చర్యంగా చూశాడు. అతని ఆంతర్యాన్ని గ్రహించిన వినాయకుడు నారదా! మా మధ్య కలహం వస్తుదని నీవు భావించావు. ఈ సిద్ధిబుద్ధి ఎవరోకాదు, నా ఆంతరంగిక శక్తులైన జ్ఞానం, క్రియ. అందుకే మేము మళ్ళీ ఒకటయ్యాం.నీ కలహ చింతన లోకోపకారమైంది. భవిష్యత్ మానవుడు సిద్ధిబుద్ధి సమేతుడనైన నన్ను ఆరాధిస్తే వారికి సమస్త విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని చెప్పాడు. ఇది వినాయకుడి పెళ్ళి కథ ఆంతర్యం. -
హ్యాపీ హ్యాపీగా...
రకుల్ ప్రీత్‌సింగ్ ప్రధాన పాత్రలో సుమిత్ వ్యాస్, సతీష్ కౌశిక్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛత్రీవాలి’. తేజస్ ప్రభ విజయ్ దేవాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల 20 నుంచి ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు వీక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని హ్యాపీగా ఫీలవుతున్నారు రకుల్. కొత్త ఏడాది తొలి విజయం దక్కడంతో ఆమె ముంబయ్‌లోని సిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆమెతో పాటు తేజస్ ప్రభ విజయ్ దేవాస్కర్ కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు రకుల్. కాగా కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న ‘ఇండియన్ 2’లో చిత్రంలో రకుల్ కీలక పాత్ర చేస్తున్నారు. -
స్వచ్చ గణేష్ సాక్షిగా..2nd Sep 2017
-
కామధేనువుపై వరసిద్ధుడు
కాణిపాకం(ఐరాల): కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి కామధేను వాహనంపై ఉభయదేవేరులతో విహరిస్తూ వినాయకస్వామి భక్తులను ఆశీర్వదించారు. ఉదయం ఆలయంలో మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేక పూజలు, అలంకరణలు జరిగాయి. ఉదయం నుంచి ఆలయం లో రద్దీ కనిపించింది. రాత్రి 10–30 గంటలకు అన్వేటి మండపంలో సిద్ధి,బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను పరిమళభరిత పుష్పమాలికలు, పట్టుపీతాంబరాలు, విశేషాభరణాలతో అలంకరించారు. ధూపదీప నైవేద్యాల అనంతరం తీర్థప్రసాదాలను వినియోగం జరిగింది. తర్వాత ఉత్సవమూర్తులను కామధేను వాహనంపై ఆశీనులను చేసి మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ ఊరేగించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆలయ ఈఓ పూర్ణచంద్రరావు, ఏసీ వెంకటేషు, ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్రబాబు, అధికారులు చిట్టిబాబు, మల్లికార్జున, ఉభయదారులు పాల్గొన్నారు. అస్థాన మండపంలో జరిగిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. -
‘ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి’
ఆదిలాబాద్ రిమ్స్ : ఆదిలాబాద్‌లో నిర్వహించిన గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని హిందూ సమాజ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జంగిలి ఆశన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రింట్మీడియా ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గణేశ్ ఉత్సవాలు విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రజలకు, పోలీసులకు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందికి కతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఆనందోత్సహాల మధ్య పండుగ నిర్వహించుకున్నారన్నారు. అందరి సహకారంతోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా వేడుకలు ముగిశాయని పేర్కొన్నారు. సమావేశంలో సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రపుల్ వఝే, నాయకులు శ్రీరాంశర్మ, సామ రమేశ్‌రెడ్డి, మేస్రం రాజేశ్వర్, నరేందర్, సంతోష్‌రెడ్డి ఉన్నారు. -
జై బోలో ఎకో ఫ్రెండ్లీ వినాయక్ కీ!
-
ఢమరుక నాద గణపతి
వినాయక చవితి పురస్కరించుకుని తెనాలి మార్కెట్ వద్ద ఆదివారం విఘ్నేశ్వరుడి విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగాయి. వాటిలో ఢమరుకంపై ఉన్న విఘ్నేశ్వరుని ప్రతిమ పలువురిని ఆకట్టుకుంటోంది. – తెనాలి అర్బన్ -
కబడ్డీ ఆడుతున్న గణనాధులు