వినాయకుడి విగ్రహం తయారీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇనుము, సింథటిక్ రంగులతో పాదరసం, క్రోమియం, సీసం, లెడ్ ఆర్సనిక్ తదితర విషపూరిత రసాయనాలను వాడుతున్నారు. వీటితో జీవవైవిధ్యం దెబ్బతింటున్నది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నీటిలో కరగదు. మట్టిలో కలవదు. నిప్పుకు కూడా దహనం కాదు. దీనిలో జిప్సం అనేది ముడి పదార్థంగా ఉంటుంది. ఈ విగ్రహాలను నీటివనరుల్లో వేస్తాం. ఆ నీటిని వాడితే డయేరియా, స్కిన్ క్యాన్సర్‌తో పాటు అనేక చర్మ వ్యాధులు సోకే ప్రమాదం వుంది. ముఖ్యంగా తగరంతో చర్మ వ్యాధులు వచ్చి చర్మం రంగు మారుతుంది. ఆర్సనిక్ వల్ల జుట్టు రాలిపోతుంది. సీసం వల్ల కడుపు నొప్పి వస్తుంది. శరీరం పట్టుత్వం తగ్గుతుంది. అంతేగాక ఆ రసాయనాల నీటిని పంట పాలాలకు మళ్లిస్తే భూసారం తగ్గి భూమి సహజ స్వరూపాన్ని కోల్పోతుంది.
మట్టితో చేసిన ప్రతిమల వల్ల పైన చెప్పుకున్న ప్రమాదాలేవీ ఉండవు. పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. చూడటానికి కూడా విగ్రహం ముచ్చటగా ఉంటుంది. పండుగ తర్వాత నిమజ్జనం చేసిన కొద్దిసేపట్లోనే నీటిలో కరిగి΄ోతుంది. దీనివల్ల పర్యావరణం, జీవవైవిధ్యం రెండు కూడా సమతులంగా ఉంటాయి. మట్టి విగ్రహం తయారీలో కేవలం బంకమట్టి మాత్రమే వాడతారు. ఎలాంటి రంగులు వాడరు. కాబట్టి నీరు కలుషితం కాదు.ఎంత విగ్రహం పెట్టి పూజిస్తే అంత గొప్ప అనుకోవడం మానేయాలి. విగ్రహం సైజు కంటే భక్తి ముఖ్యం. పర్యావరణం పట్ల బాధ్యత అంతకంటే ముఖ్యం. రసాయన రంగుల విగ్రహాల వల్ల పర్యావరణం, జీవవైవిధ్యం దెబ్బితింటాయి. రాబోవు రోజుల్లో జీవకోటికి ప్రమాదం ఏర్పడుతుంది.
– డాక్టర్ ఎల్ నాగిరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, పర్యావరణ విభాగం, శ్రీకృష్ణదేవరాయ ఉద్యాన కళాశాల, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment