ఎమోషనల్ గా బందీనయిపోయా | SRK didn't want 'Fan' journey to end | Sakshi
Sakshi News home page

ఎమోషనల్ గా బందీనయిపోయా

Published Fri, Nov 20 2015 5:26 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

ఎమోషనల్ గా  బందీనయిపోయా - Sakshi

ఎమోషనల్ గా బందీనయిపోయా

ముంబై:  బాలీవుడ్  సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తాను నటిస్తున్న థ్రిల్లర్ మూవీ 'ఫ్యాన్' కి ఎమోషనల్ గా  బౌండ్ అయిపోయాడట. ఈ సినిమా  షూటింగ్   ఇంకా ఉంటే బావుండు అని బాద్‌ షా కు అనిపిస్తోందిట.  ఫ్యాన్ సినిమాతో తన ప్రయాణం ఇంత తొందరగా ముగిసిపోతుందని  ఎప్పుడూ అనుకోలేదంటూ సోషల్ మీడియాలో షారుక్  షేర్ చేశాడు. 

తాను మానసికంగా  ఫ్యాన్ సినిమాకు  బాగా బందీ అయినట్లు షారుక్ ఖాన్ పేర్కొన్నాడు.  జీవితం,  ప్రేమ, హాస్యం లాంటి మంచి సంగతులు తొందరగా  ముగియడం విచారకరమంటూ శుక్రవారం ట్విట్ చేశాడు. కొన్ని సినిమాల్లో నటిస్తున్నపుడు  షూటింగ్ లో మమేకమైపోతామని, ఇంకా షూటింగ్  ఉంటే బావుండు అనే ఫీలింగ్ కలుగుతుందన్నాడు.   ప్రస్తుతం  తను చేస్తున్న ఫ్యాన్ చిత్రం కూడా అలాంటిదేనన్నాడు.

కాగా మనీశ్ శర్మ దర్శకత్వంలో  ఒక సూపర్ స్టార్ గా, ఆ సూపర్ స్టార్ కి సూపర్ గా షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో ప్రఖ్యాత మోడల్ వలుశ్చా డిసౌజా, మరో హీరోయిన్‌గా శ్రీయా పిల్‌గౌంకర్  నటిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన ఫ్యాన్ ట్రైలర్‌ అభిమానులను ఆకట్టుకుంది.  2016, ఏప్రిల్15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement