హైదరాబాద్: స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. మిగితా చోట్లలో అభ్యర్థులను వెతికినా దొరకని పరిస్థితి ఆ పార్టీకి ఎదురైంది. ఇక చాలా జిల్లాల్లో టీడీపీకి అభ్యర్థులు కరువయ్యారు. బీజేపీ కూడా తన ఉనికి చాటేందుకు కాస్తంత హడావిడి చేసినా చివరకు తన తరుపున అభ్యర్థులను నిలబెట్టేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. మొత్తంగా ప్రధాన పోటీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్, టీడీపీ పోటీ చేయని చోట్ల ఏకగ్రీవానికి ప్రయత్నాలు మొదలుపెట్టిన టీఆర్ఎస్ పార్టీ మొత్తంగా 11 స్థానాల్లో తమదే విజయమని భరోసాగా ఉంది. ఒక్క నల్లగొండ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ తరుపున చిన్నపరెడ్డిని బరిలోకి దించారు. అయితే, నల్లగొండలో కూడా తాము విజయం సాధిస్తామని, అక్కడ కూడా తమ పార్టీకి గట్టి మద్దతు ఉందని టీఆర్ఎస్ భావిస్తోంది.
ప్రతిపక్షాలకు అభ్యర్థులు కరువు
Published Wed, Dec 9 2015 3:18 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement