local mlc elections
-
‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి గెలుపొందారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో ఉప ఎన్నిక కౌంటింగ్ చేపట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి 109 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్నట్టయింది.గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే గత మార్చి 28న ఉపఎన్నిక జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. నియోజకవర్గంలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా, 1,437 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇద్దరు ఎంపీటీసీలు ఓటు వేయలేదు. ఓట్ల లెక్కింపును ఏప్రిల్ 2నే చేపట్టాల్సి ఉండగా, లోక్‌సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జూన్ 2 తేదీకి వాయిదా పడింది. మొదటి ప్రాధాన్యతా ఓట్లతోనే.. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. పోలైన ఓట్లలో 1,416 ఓట్లు చెల్లగా.. 21 తిరస్కరణకు గురయ్యాయని అధికారులు నిర్ధారించారు. విజయానికి 709 ఓట్లు అవసరమని ఎన్నికల అధికారులు ప్రకటించారు. అభ్యర్థుల వారీగా మొదటి ప్రాధాన్యతా ఓట్లను లెక్కించగా నవీన్‌కుమార్ రెడ్డికి 762 ఓట్లు, జీవన్‌రెడ్డికి 653 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్‌గౌడ్‌కు ఒక్క ఓటు పోల్ అయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే కోటాకు మించి 762 ఓట్లు రావడంతో తన సమీప ప్రత్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై 109 ఓట్ల మెజారీటతో నవీన్‌రెడ్డి గెలిచినట్లుగా అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవినాయక్ ఆయనకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. పట్టు నిలుపుకున్న గులాబీ పార్టీ ఈ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా అధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే ఉన్నారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, ఆ వెంటనే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగడంతో తమకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ భా వించింది. కానీ అధికార పార్టీకి ధీటుగా గులాబీ పార్టీ తమ ప్రజాప్రతినిధులతో క్యాంపులను నిర్వహించి ఓటు బ్యాంకును కాపాడు కోవడంతో పాటు స్థానికంగా పట్టు నిలుపుకుంది. -
కరిగి పోతున్న పదవీకాలం!
సాక్షి, కామారెడ్డి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికనూ కమ్మేసింది. మే 3 వరకూ లాక్డౌన్ పొడిగించిన తరుణంలో.. ఆ తర్వాత ఉత్పన్నమ య్యే పరిస్థితులపై ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంది. అయితే, ఇప్పుడదే అంశం రాజకీయ వర్గా ల్లో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ పదవీకాలంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఉభయ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పని చేసిన భూపతిరెడ్డిని పార్టీ ఫిరాయింపు కింద తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఆ స్థానంలో ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 7న ఎన్నిక నిర్వహించి, 9న ఓట్ల లెక్కింపు చేపట్టి, 13 కల్లా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కూతురు, మాజీ ఎంపీ కవిత బరిలో దిగడంతో అందరి దృష్టి ఈ ఎన్నికలపైనే నెలకొంది. అయితే, ఇదే సమయంలో కరోనా ఎఫెక్ట్‌తో ఎన్నికను వాయిదా వేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవీ కాలం సాధారణంగా ఆరేళ్లు (2016 జనవరి 5 నుంచి 2022 జనవరి 4 వరకు) ఉంటుంది. గత జనవరి 16న భూపతిరెడ్డిని తొలగించడంతో ఆ స్థానం 16న ఖాళీ అయ్యింది. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ గత నెల 12న నోటిఫికేషన్ జారీ చేసింది. పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, చివరకు ముగ్గురు మాత్రమే బరిలో ఉన్నారు. అయితే అదే సమయంలో కరోనా వైరస్ అంశం ముందుకు రావడంతో ఎన్నికను వాయిదా వేశారు. లేదంటే ఈ నెల 7న ఎన్నిక నిర్వహించి, 9న ఓట్ల లెక్కింపు చేపట్టే వారు. 13వ తేదీతో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేది. గెలుపొందిన అభ్యర్థి ఎమ్మెల్సీగా ప్రమాణం చేసే వారు. తొలుత ప్రకటించిన లాక్డౌన్ ఈ నెల 14 వరకే ఉండడం, ఆ గడువు ముగియగానే ఎన్నికల ప్రక్రియ తిరిగి మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ మంగళవారం ప్రకటించారు. తగ్గుతున్న పదవీ కాలం.. ఎమ్మెల్సీ పదవీ కాలం 2022 జనవరి 4తో ముగియనుంది. ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగితే గెలుపొందిన అభ్యర్థి కనీసం 21 నెలల పాటు పదవిలో కొనసాగే వారు. ఒకవేళ కరోనా కేసులు మే నెలలో అదుపు లోకి వస్తే ఎన్నికల అంశం తెరపైకి రావొచ్చు. అప్పుడు జూన్‌లో ఎన్నిక నిర్వహించే అవకాశాలు ఉంటాయి. ఒక వేళ జూన్‌లో ఎన్నిక జరిగితే పదవీ కాలం 18 నెలల నుంచి 19 నెలల వరకు ఉంటుంది. అంటే ఏడాదిన్నర కాలం మాత్రమే గెలుపొందిన వారు పదవిలో కొనసాగే అవకాశాలుంటాయి. -
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలపై హైకోర్టుకు..
సాక్షి, హైదరాబాద్: స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల రద్దు కోరుతూ కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. హైకోర్టులో వెకేషన్ బెంచ్‌కుగానీ, లంచ్‌మోషన్ ద్వారా చీఫ్ జస్టిస్ బెంచ్‌కుగానీ పిటిషన్ దాఖలు చేయాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. అదే సమయంలో సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు శనివారం గాంధీభవన్‌లో జరిగిన పార్టీ సీనియర్ నేతల సమావేశంలో నిర్ణయించారు. సమావేశానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీనేత జానారెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జి కుసుమకుమార్, మాజీమంత్రులు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఏఐసీసీ ప్రొటోకాల్ ఇన్చార్జి హెచ్. వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసే వారి జాబితా ప్రచురించకుండానే నోటిఫికేషన్ విడుదల చేయడం సమంజసం కాదని నేతలు అభిప్రాయపడ్డారు. మరో నెలరోజుల్లో కొత్త జెడ్పీటీసీ, ఎంపీటీసీలు వస్తున్న నేపథ్యంలో పాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీల చేత ఓట్లు వేయించడం అన్యాయమని అన్నారు. ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధనలేదని, ఈ మూడు అంశాల ప్రాతిపదికగా నోటిఫికేషన్ రద్దు కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాలని నిర్ణయించారు. న్యాయ స్థానాల్లో దాఖలు చేసే పిటిషన్లను నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ప్రస్తుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల చేత దాఖలు చేయించాలని, సోమవారం హైకోర్టు, సుప్రీంకోర్టులో ఈ పిటిషన్లు వేయాలని నిర్ణయించారు. అభ్యర్థుల పేర్లు డీసీసీల ద్వారా... న్యాయపోరాటం చేస్తూనే ఎన్నికలు అనివార్యమైతే పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. వరంగల్ స్థానం నుంచి ఇనుగాల వెంకట్రామిరెడ్డిని బరిలో దించాలని దాదాపు నిర్ణయించారు. ఇక్కడి నుంచి పోటీకి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి విముఖత వ్యక్తం చేశారు. నల్లగొండ స్థానం నుంచి గూడూరు నారాయణరెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి పేర్లను పరిశీలించినప్పటికీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి అయితే బాగుంటుందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ స్థానం నుంచి రాజగోపాల్‌రెడ్డి గెలవడంతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఉన్న సంబంధాల నేపథ్యంలో లక్ష్మి పేరు దాదాపు ఖరారు చేశారు. రంగారెడ్డి స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారిలక్ష్మారెడ్డిని బరిలోకి దించాలనే దానిపై చర్చ జరిగింది. అయితే, ఇక్కడి అభ్యర్థిని నిర్ణయించే బాధ్యతను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి అప్పగించారు. మొత్తం మీద సోమవారం మధ్యాహ్నం వరకు అభ్యర్థులను ఖరారు చేయాలని, ఈలోపు మూడు జిల్లాల డీసీసీ అధ్యక్షుల నుంచి ఎవరు పోటీలో ఉంటే బాగుంటుందో వారి పేర్లను తెప్పించుకోవాలని నిర్ణయించారు. కోవర్టులను ఏం చేశారు... వీహెచ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ కోవర్టులున్నారని, వారి ద్వారానే ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డిలు పార్టీ మారారని ఆరోపించారు. ఆ కోవర్టులపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించబోగా దీనిపై చర్చించేందుకు ఈ సమయం సరైందని కాదని వీహెచ్‌ను ఇతర నేతలు సముదాయించారు. సుప్రీంకోర్టుకు వెళ్తాం: ఉత్తమ్ చనిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తీసేయలేదని సమావేశం అనంతరం విలేకరులతో ఉత్తమ్ అన్నారు. రాజీనామా చేసిన తర్వాత ఆరునెలల్లోగా ఎన్నికలు జరపాలన్న నిబంధన ఎక్కడాలేదని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల జాబితా లేకుండా ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సోమవారంలోగా కొలిక్కి వస్తుందని తెలిపారు. -
కొండా మురళీ ఏకగ్రీవ ఎన్నిక
వరంగల్: వరంగల్ జిల్లాలోని స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. వరంగల్ ఎమ్మెల్సీగా కొండా మురళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లు గురువారం ఉపసంహించుకున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు టీఆర్ఎస్ వశమైంది. ఈ స్థానానికి ఇండిపెండెంట్లు మినహాయిస్తే రాజకీయ పార్టీలకు సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థి అయిన కొండా మురళీ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆ పార్టీకి పోటీ లేకుండా పోయింది. నామినేషన్ దాఖలు సమయంలోనే విపక్షాలన్నీ చేతులెత్తేశాయి.కాగా కొండా మురళీ ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
ప్రతిపక్షాలకు అభ్యర్థులు కరువు
హైదరాబాద్: స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. మిగితా చోట్లలో అభ్యర్థులను వెతికినా దొరకని పరిస్థితి ఆ పార్టీకి ఎదురైంది. ఇక చాలా జిల్లాల్లో టీడీపీకి అభ్యర్థులు కరువయ్యారు. బీజేపీ కూడా తన ఉనికి చాటేందుకు కాస్తంత హడావిడి చేసినా చివరకు తన తరుపున అభ్యర్థులను నిలబెట్టేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. మొత్తంగా ప్రధాన పోటీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, టీడీపీ పోటీ చేయని చోట్ల ఏకగ్రీవానికి ప్రయత్నాలు మొదలుపెట్టిన టీఆర్ఎస్ పార్టీ మొత్తంగా 11 స్థానాల్లో తమదే విజయమని భరోసాగా ఉంది. ఒక్క నల్లగొండ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ తరుపున చిన్నపరెడ్డిని బరిలోకి దించారు. అయితే, నల్లగొండలో కూడా తాము విజయం సాధిస్తామని, అక్కడ కూడా తమ పార్టీకి గట్టి మద్దతు ఉందని టీఆర్ఎస్ భావిస్తోంది. -
ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..
-
ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..
హైదరాబాద్: స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. వారి జాబితాను ఇప్పటికే తమ అధిష్టానానికి పంపించింది. అయితే, ఎవరిని ఎంపిక చేయాలి అనే విషయంలో బాధ్యతను రాష్ట్ర పార్టీకే అప్పగించినట్లు అభ్యర్థుల ఎంపికను బట్టి తెలుస్తోంది. ఎవరిని ఎంపిక చేసినా పర్వాలేదని, పోటీ మాత్రం గట్టిగా ఉండాలని చెప్పడంతో మాజీ ఎంపీలను రంగంలోకి దించాల్సిందేనని నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ ఆ మేరకే అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. పార్టీ అధిష్టానానికి పంపించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి మాజీ జెడ్పీ చైర్మన్ దామోదర్ రెడ్డి నిజామాబాద్ జెడ్పీ మాజీ చైర్మన్ వెంకట రమణారెడ్డి ఆదిలాబాద్ నుంచి మహేశ్వర్ రెడ్డి నల్లగొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డిని ఎంపిక చేశారు. వీరు దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంది. పార్టీ అధిష్టానం కూడా ఈ రాత్రిలోగా ఆమోదం తెలపనుంది. వీరికి రేపు బీఫాంలు టీపీసీసీ అందించనుంది. మొత్తం పన్నెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 8 స్దానాల నుంచి పోటీ చేయనుంది. రెండేసి స్థానాలు ఉన్నచోటు నుంచి ఒక్క అభ్యర్థినే దించుతున్నారు. ఖమ్మంలో సీపీఐకి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నల్లగొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండలో ఎమ్మెల్సీ సీటును గెలుచుకునేంతగా స్థానిక ప్రతినిధుల బలం కాంగ్రెస్ కు ఉందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు వామపక్షాలు కూడా మద్దతిచ్చాయని తెలిపారు. పోటీ చేయకుంటే టీడీపీ, బీజేపీకి ఉన్న స్థానిక ప్రతినిధులు కూడా కాంగ్రెస్ కు మద్దతిస్తారని చెప్పారు.