కొండా మురళీ ఏకగ్రీవ ఎన్నిక | Konda murali to Unanimous as Warangal MLC | Sakshi
Sakshi News home page

కొండా మురళీ ఏకగ్రీవ ఎన్నిక

Published Thu, Dec 10 2015 12:49 PM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

కొండా మురళీ ఏకగ్రీవ ఎన్నిక

కొండా మురళీ ఏకగ్రీవ ఎన్నిక

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలోని స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బోణీ కొట్టింది. వరంగల్‌ ఎమ్మెల్సీగా కొండా మురళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లు గురువారం ఉపసంహించుకున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు టీఆర్ఎస్ వశమైంది.

 

ఈ స్థానానికి ఇండిపెండెంట్లు మినహాయిస్తే రాజకీయ పార్టీలకు సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థి అయిన కొండా మురళీ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆ పార్టీకి పోటీ లేకుండా పోయింది. నామినేషన్ దాఖలు సమయంలోనే విపక్షాలన్నీ చేతులెత్తేశాయి.కాగా కొండా మురళీ ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement