డయాబోలికల్ ఐరన్ క్లాడ్ బీటిల్
న్యూయార్క్ : పరిమాణంలో చిన్నగా.. చూడగానే ఒళ్లు కొద్దిగా జలదరించేలా ఉండే ‘డయాబోలికల్ ఐరన్ క్లాడ్ బీటిల్’ అనే జీవి శాస్త్రవేత్తలకు ఎంతో ఉపయోగకారిగా మారింది. పెద్ద కారును దాని మీదనుంచి పోనిచ్చినా బ్రతికి ఉండగలిగే శరీర నిర్మాణం దాని సొంతం. అందుకే దానిపై పరిశోధనలు చేయటం మొదలుపెట్టారు ‘పర్డ్యు యూనివర్శిటీ’ శాస్త్రవేత్తలు. ఉక్కు లాంటి దాని శరీర నిర్మాణంతో ఏం నేర్చుకోవచ్చో తెలుసుకుంటున్నారు. తద్వారా బలమైన విమానాలు, ఇతర వస్తువుల తయారీ, భవంతుల నిర్మాణంలో అది సహాయపడుతుందని భావిస్తున్నారు. సౌత్ కాలిఫోర్నియాలోని అడవుల్లో నివసించే ఈ జీవి దాని శరీర బరువుకంటే 39 వేల రెట్ల అధిక బరువును తట్టుకోగలదని చెబుతున్నారు. ( యూట్యూబ్‌లో దూసుకుపోతున్న కలెక్టర్ భక్తి పాట )
డయాబోలికల్ ఐరన్ క్లాడ్ బీటిల్ శరీర అంతర్ నిర్మాణం
అదే ప్రాంతంలో నివసించే మరికొన్ని జీవులు వాటి శరీర బరువు కంటే మూడు రెట్ల బరువును మాత్రమే తట్టుకోగలిగాయని చెప్పారు. ఐరన్ క్లాడ్ బీటిల్ శరీరం అంత బలంగా ఎలా ఉందో తెలుసుకోవటానికి సీటీ స్కాన్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లను ఉపయోగించారు. ప్రత్యేక, జిగ్‌షా ఆకారంలోని శరీర బంధనాల నిర్మాణం, పొరలే ఇందుకు కారణమని తేల్చారు. సదరు జీవి శరీరంపై తీవ్రమైన ఒత్తిడి కలిగించినపుడు దాని శరీరం ఒకే సారి ముక్కలవకుండా.. కొద్ది కొద్దిగా పగుళ్లు ఏర్పరచిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment