సాక్షి, ముంబై: బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్‌కి షాక్ ఇచ్చింది. భారతదేశంలో తన ద్విచక్ర వాహనాల పోర్ట్ ఫోలియోలో చాలా వాటిపై భారీగా ధరలను పెంచింది. పల్సర్ అవెంజర్ బైక్‌లతోపాటు, ఎలక్ట్రిక్ స్కూటర్ - చేతక్ ధరలను కూడా గణనీయంగా పెంచింది.
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్‌పై ధరను 9 శాతం పెంచింది. దీని ధరను 12,749 రూపాయలు పెంచింది. పుణేలో (ఎక్స్-షోరూమ్) 1.41 లక్షలతో రూపాయలతో పోలిస్తే ప్రస్తుత ధర 1.54 లక్షలుగా ఉంది. అయితే, ధర పెరిగినప్పటికీ, ఎలక్ట్రిక్ స్కూటర్ స్టైలింగ్, ఫీచర్లును అలానే ఉన్నాయి.
కాగా 2019లో బజాజ్ అకుర్దిలోని పూణే ప్లాంట్‌లో చేతక్ ఎలక్ట్రిక్ ఉత్పత్తిని ప్రారంభించింది. కంపెనీ ప్రస్తుతం భారతదేశంలోని 75 కంటే ఎక్కువ నగరాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తోంది. అప్పటినుంచి 14,000 యూనిట్లను విక్రయించినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment