
కాబుల్: ఉత్తర అఫ్గనిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. కుందూస్ నగరంలోని షియా మసీదులో పేలుడు చోటుచేసుకుంది. ఈ బాంబు పేలుడులో 100 మందికి పైగా మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు.శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా పేలుడు సంభవించింది. దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్‌గా అనుమానం వ్యక్తమవుతోంది. కొద్దిరోజులుగా షియాలకు ఐసిస్ ఖొరాసాన్ హెచ్చరికలు చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఐసిస్ ఖొరాసాన్.. తాలిబన్ల నాయకుడి తలనరికిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment