masid
-
అఫ్గనిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు.. 100 మందికి పైగా మృతి
కాబుల్: ఉత్తర అఫ్గనిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. కుందూస్ నగరంలోని షియా మసీదులో పేలుడు చోటుచేసుకుంది. ఈ బాంబు పేలుడులో 100 మందికి పైగా మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు.శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా పేలుడు సంభవించింది. దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్‌గా అనుమానం వ్యక్తమవుతోంది. కొద్దిరోజులుగా షియాలకు ఐసిస్ ఖొరాసాన్ హెచ్చరికలు చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఐసిస్ ఖొరాసాన్.. తాలిబన్ల నాయకుడి తలనరికిన విషయం తెలిసిందే. -
ఆలయం, మసీదు దెబ్బతినడంపై కేసీఆర్ ఆవేదన
-
మసీదులో పేలుడు: 27 మంది మృతి
కాబూల్: అఫ్గాన్‌లోని ఖోస్ట్ ప్రావిన్సులో ఉన్న ఆర్మీ బేస్‌లో శక్తిమంతమైన పేలుడు సంభవించింది. ఆర్మీ బేస్‌లోని మసీదులో శుక్రవారం ప్రార్థనలు పూర్తవుతున్న సందర్భంగా జరిగిన ఈ పేలుడులో 27 మంది సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 57 మంది తీవ్రంగా గాయపడ్డారు. రిమోట్ కంట్రోల్ లేదా ఆత్మాహుతి దళ సభ్యుడి ద్వారా ఉగ్రవాదులు ఈ దాడి చేయించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ దాడిని తామే చేసినట్లు ఏ ఉగ్రసంస్థా ఇంతవరకూ ప్రకటించుకోలేదు. -
లిబియాలో వరుస బాంబు పేలుళ్లు
బెంఘాజీ: ఆఫ్రికా దేశమైన లిబియా మంగళవారం వరుస కారు బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. బెంఘాజీ నగరంలోని ఓ మసీదు నుంచి ప్రార్థనల అనంతరం ప్రజలు బయటికొస్తుండగా రెండు శక్తిమంతమైన కారు బాంబు పేలుళ్లు సంభవించడంతో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుళ్లలో 87 మంది గాయపడ్డారు. మొదటి కారు బాంబు పేలిన తర్వాత సహాయక చర్యల కోసం అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న ప్రజలే లక్ష్యంగా అరగంట వ్యవధిలో మరో కారు బాంబు పేలిందని అధికారులు తెలిపారు. లిబియా అంతర్యుద్ధంలో ప్రభుత్వానికి అండగా నిలిచిన సలాఫీ గ్రూపులకు కేంద్రంగా ఉండటంతోనే ఈ మసీదుపై దాడి జరిగిందన్నారు. ఈ దాడిని తామే చేసినట్లు ఇంతవరకూ ఏ ఉగ్రసంస్థా ప్రకటించుకోలేదన్నారు. నాటో బలగాలు 2011లో లిబియా పాలకుడు గడాఫీని హతమార్చినప్పటి నుంచి ఆ దేశం అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. -
భక్తి శ్రద్ధలతో రంజాన్
పవిత్రమాసంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని శుక్రవారం (09-08-2013) ముస్లింల ప్రార్థనలతో నగరంలో ఈద్గాలు, మసీదులు కళకళలాడాయి. ఉదయం 8 గంటల నుంచే ప్రార్థనాలయాలకు వేలాదిమంది తరలివచ్చారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ చెప్పుకున్నారు. ఉల్లాసంగా గడిపారు. మక్కామసీదులో ముస్లింల ప్రార్థనల మీరాలం ఈద్గాలో... చార్మినార్ వద్ద దానం చేస్తూ... చిలకలగూడ ఈద్గా: చిన్నారులకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే జయసుధ భద్రతాసిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతున్న చిన్నారులు చిలకలగూడ ఈద్గాలో ... లాలాగూడ: రంజాన్ వేడుకల్లో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి ఎల్బీనగర్ మజీద్గల్లీ వద్ద ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్న పుత్తా ప్రతాప్‌రెడ్డి మియాపూర్ ఆదిత్యనగర్ కాలనీలోని ఈద్గాలో... రంజాన్ వేడుకల్లో కొత్వాల్ అనురాగ్ శర్మ రంజాన్ సందర్భంగా భోలక్‌పూర్‌లో ఒంటెలపై ఊరేగుతున్న చిన్నారులు భోలక్‌పూర్ బడీ మసీద్‌లో... అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్ లో...