
కాబూల్: అఫ్గాన్‌లోని ఖోస్ట్ ప్రావిన్సులో ఉన్న ఆర్మీ బేస్‌లో శక్తిమంతమైన పేలుడు సంభవించింది. ఆర్మీ బేస్‌లోని మసీదులో శుక్రవారం ప్రార్థనలు పూర్తవుతున్న సందర్భంగా జరిగిన ఈ పేలుడులో 27 మంది సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 57 మంది తీవ్రంగా గాయపడ్డారు. రిమోట్ కంట్రోల్ లేదా ఆత్మాహుతి దళ సభ్యుడి ద్వారా ఉగ్రవాదులు ఈ దాడి చేయించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ దాడిని తామే చేసినట్లు ఏ ఉగ్రసంస్థా ఇంతవరకూ ప్రకటించుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment